ఈ నంబర్స్ గురించి మీకు తెలుసా..?

Written By:

మీరు ఎస్‌డీ , మైక్రో ఎస్‌డీ కార్డులు వాడుతున్నారా..ఎస్‌డీ కార్డులు కెమెరాలకు ఇతర పనులకు ఉపయోగిస్తే మైక్రో ఎస్‌డీ కార్డులు మొబైల్స్, టాబ్లెట్స్ వంటి వాటికి వాడుతుంటారు. అయితే మీరు ఎస్‌డీ కార్డులను జాగ్రత్తగా గమనించినట్లయితే దానిపైన కొన్ని నంబర్లు కనిపిస్తాయి. 2, 4, 6, 10,U1, U3 అనే నంబర్లు కనిపిస్తాయి. అసలు అవేంటి..?అవి అలా ఎందుకు ప్రింట్ చేశారు అనేది చాలామందికి తెలియదు. అవి ఎందుకు ప్రింట్ చేశారో క్లుప్తంగా అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫస్ట్ టైం జియో టాప్‌లోకి దూసుకొచ్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంత ఎక్కువ స్పీడ్ గా అది పనిచేస్తుందని

మెమొరీ కార్డులపై ఉండే నంబర్లు వాటి క్లాసులను చూపిస్తాయి. అంటే ఎంత ఎక్కువ స్పీడ్ గా అది పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఈ క్లాస్ అంకెలను పొందుపరిచారు.

క్లాస్ 2 కార్డులు

ఈ కార్డుల్లో 2 ఎంబీ ప‌ర్ సెకండ్ ఆపైన స్పీడ్‌తో డేటాను రీడ్‌, రైట్ చేసుకోవ‌చ్చు. ఇది చాలా త‌క్కువ స్పీడ్‌. కానీ ఇప్పుడు ఆ స్పీడ్‌తో కార్డులు చాలా త‌క్కువ‌గా ల‌భిస్తున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

క్లాస్ 4 కార్డులు

సెక‌నుకు 4 ఎంబీ ఆపైన స్పీడ్‌తో వీటిలో డేటాను రీడ్‌, రైట్ చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా 4జీబీ, 8 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో ప‌నిచేస్తాయి.ఇందులో షూట్ సమయంలో సాధారణ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

క్లాస్ 6 కార్డులు

ఈ కార్డుల్లో 6 ఎంబీ ప‌ర్ సెకండ్ ఆపైన స్పీడ్‌తో డేటాను రీడ్‌, రైట్ చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా 4జీబీ, 8 జీబీ, 16 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో ప‌నిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 720pతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

క్లాస్ 10 , U1 కార్డులు

వీటి ద్వారా సెక‌నుకు 10 ఎంబీ ఆపైన స్పీడ్‌తో డేటాను రీడ్‌, రైట్ చేసుకోవ‌చ్చు. గ‌రిష్టంగా 60 ఎంబీ ప‌ర్ సెకండ్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. 8 జీబీ, 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో ప‌నిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 1080pతో హెచ్‌డి వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

 

 

U3

ఈ మెమొరి కార్డు ద్వారా మీరు మీ మొబైల్ నుంచి 4కె వీడియోలను ఎటువంటి అంతరాయం లేకుండా రికార్డ్ చేయవచ్చు. క్లాస్ 10 కన్నా అత్యంత వేగవంతమైన స్పీడ్ దీని సొంతం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Picking the Right SD Card: What Do the Numbers Mean read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot