ఫస్ట్ టైం జియో టాప్‌లోకి దూసుకొచ్చింది
డౌన్‌లోడ్ స్పీడ్‌లో దూసుకుపోతున్న జియో అప్‌లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట.
జియో ఎట్టకేలకు తన జోరును పెంచింది. జనవరి నెలలో నాలుగో స్థానానికి పడిపోయిన జియో ఫిబ్రవరి నెలలో పైకి ఎగిసింది. డౌన్‌లోడ్ స్పీడ్‌లో సరికొత్త మార్కెట్ లీడర్‌గా అవతరించింది. ట్రాయ్స్ 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడులో జియో మార్కెట్ ను ఏలుతున్నట్టు వెల్లడైంది.
జియో దెబ్బ..చైనా కంపెనీలు కూడా..

అప్‌లోడ్ స్పీడులో
డౌన్‌లోడ్ స్పీడ్‌లో దూసుకుపోతున్న జియో అప్‌లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట.

సగటు వేగం 17.427 ఎంబీపీఎస్
2017 ఫిబ్రవరిలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో తర్వాతి స్థానంలో ఐడియా(12.216ఎంబీపీఎస్), ఎయిర్ టెల్(11.245ఎంబీపీఎస్), వొడాఫోన్(8.337ఎంబీపీఎస్) ఉన్నాయి.

ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువే
అయితే 2016 డిసెంబర్ లో నమోదుచేసిన 18.146ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువేనని ట్రాయ్ తెలిపింది.

ఐడియా సెల్యులార్ స్పీడ్
ఐడియా సెల్యులార్ స్పీడ్ వరుసగా పైకి ఎగుస్తున్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. డిసెంబర్ నెలలో 5.943ఎంబీపీఎస్ గా ఉన్న ఐడియా సెల్యులార్ స్పీడ్, తర్వాతి నెలలో 10.301ఎంబీపీఎస్ గా, గత నెలలో 12.216ఎంబీపీఎస్ గా ఉన్నట్టు పేర్కొంది.

ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్లు
టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్లు మాత్రం జనవరి నుంచి తక్కువవుతున్నాయని డేటా వెల్లడించింది. చాలా వేగవంతంగా 4జీ అప్ లోడ్‌లో ఐడియా ముందంజలో ఉన్నట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది.


Click it and Unblock the Notifications








