ఫిట్‌బిట్ అకౌంట్ మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

గూగుల్ సంస్థ 2.1 బిలియన్లకు ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేసింది. ఈ వార్త వచ్చినప్పటి నుండి ఫిట్‌బిట్ వినియోగదారులలో వారి వ్యక్తిగత మరియు ఆరోగ్య డేటాను గూగుల్ ఎలా ఉపయోగించవచ్చో అన్న భయం అందరికి కలుగుతున్నది. ఇటువంటి భయం ఉండడం అందరికి సహజం. ఫిట్‌బిట్ వాచ్ లో అన్ని రకాల డేటాను సేవ్ చేసుకొని ఉంటారు.అలాగే గూగుల్ లో ఇప్పటికే చాలా స్కాంలు జరిగాయి.

ఫిట్‌బిట్

ఏదేమైనా ఫిట్‌బిట్ యొక్క పరికరాల సేవల యొక్క ఆరోగ్యం లేదా సంరక్షణ డేటాను మరియు ఫిట్‌బిట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించదని లేదా గూగుల్ ప్రకటనల కోసం ఉపయోగించదని గూగుల్ డివైస్ ల యొక్క సీనియర్ VP రిక్ ఓస్టర్లోహ్ స్పష్టం చేశారు. ఫిట్‌బిట్ వినియోగదారులకు వారి డేటాను సమీక్షించడానికి, తరలించడానికి లేదా తొలగించే అవకాశాన్ని కూడా గూగుల్ ఇప్పుడు అందిస్తుందని ఒక పోస్ట్ ద్వారా పేర్కొంది.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

గూగుల్

అయినప్పటికీ ఫిట్‌బిట్ వినియోగదారుల ప్రైవసీను గూగుల్ నిర్వహిస్తుందనే హామీ ఏమి లేదు. కాబట్టి మీరు ప్రైవసీ గురించి ఆందోళన చెందుతుంటే మరియు మరేదైనా స్మార్ట్‌వాచ్‌కు వెళ్లాలనుకుంటే కనుక మీరు ఫిట్‌బిట్ అకౌంట్ ను మరియు సర్వర్‌లో నిల్వ చేసిన డేటాను తొలగించవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి కింద వున్న పద్దతులను పాటించండి.

మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి

మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి

ఫిట్‌బిట్ యొక్క అకౌంట్ ను తొలగించే ముందు అందులో వున్న మీ యొక్క ప్రస్తుత డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. అప్రమేయంగా ఫిట్‌బిట్ 31 రోజుల డేటాను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. 31 రోజుల కంటే ముందు ఏదైనా డేటా ఉంటే కనుక వినియోగదారులు ఆర్కైవ్ కోసం అభ్యర్థించాల్సి ఉంటుంది.

1. మొదట ఫిట్‌బిట్ డాష్‌బోర్డ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసి దానిని ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అవ్వండి.
2. కుడివైపు ఎగువ మూలలో ఉన్న 'గేర్' అనే గుర్తుపై క్లిక్ చేసి అందులోని 'సెట్టింగులను' ఎంచుకోండి.
3. తరువాత మెనులోని 'ఎక్సపోర్ట్ డేటా' ను ఎంచుకోండి
4. మీకు డేటా కావాల్సిన టైమ్ ఫ్రేమ్ మరియు ఫార్మాట్ ఎంచుకోండి తరువాత 'డౌన్‌లోడ్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
5. ఒక వేళ మీకు మొత్తం డేటా కావాలి అనుకుంటే క్రిందికి స్క్రోల్ చేసి 'ఎక్సపోర్ట్ యువర్ అకౌంట్ ఆర్కైవ్‌' ను ఎంచుకొని 'రిక్వెస్ట్ డేటాను' ఎంచుకోండి.
6. ఇది నిర్ధారించుకోవడానికి ఒక లింక్‌తో ఇమెయిల్ పంపుతుంది. దానిపై క్లిక్ చేయండి.
7. ఇన్‌బాక్స్‌కు తిరిగి వెళ్లి డేటాను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌తో మరొక ఇమెయిల్ కోసం చూడండి.

 

ఫిట్‌బిట్ అకౌంట్ డెలిట్ చేయడం ఎలా?

ఫిట్‌బిట్ అకౌంట్ డెలిట్ చేయడం ఎలా?

డెస్క్‌టాప్ ఉపయోగించి మీ ఫిట్‌బిట్ అకౌంట్ ను ఎలా తొలగించాలి :

1. మొదట డెస్క్‌టాప్ లో ఫిట్‌బిట్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి.

2. తరువాత ఫిట్‌బిట్ యొక్క సెట్టింగుల పేజీని క్రిందికి స్క్రోల్ చేసి అందులో 'డెలిట్ అకౌంట్' పై క్లిక్ చేయండి.
3. దానిని నిర్ధారించడానికి మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సెండ్ కన్ఫర్మేషన్ పై క్లిక్ చేయండి.

 

మొబైల్ యాప్ ఉపయోగించి తొలగించడం ఎలా?

మొబైల్ యాప్ ఉపయోగించి తొలగించడం ఎలా?

1. ఫిట్‌బిట్ యాప్ లో Today చిహ్నాన్ని నొక్కండి. తరువాత స్క్రీన్ ను దిగువకు స్క్రోల్ చేయండి.
2. తరువాత ప్రొఫైల్ ఫోటోపై నొక్కండి. తరువాత 'మ్యానేజ్ డేటా' ఎంపిక కోసం చూడండి.
3. 'డెలిట్ అకౌంట్' పై నొక్కండి.
4. నిర్ధారించడానికి మరోసారి 'డెలిట్ అకౌంట్' పై మళ్ళి నొక్కండి.

Best Mobiles in India

English summary
Procedure to Download Fitbit Data and Delete The Account

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X