సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

|

కొత్తగా ఫోన్‌ను కొనుగోలు చేసామాన్న ఉత్సాహం పలువురిలో కొద్ది సేపైనా నిలవదు. ఫోన్ స్కీన్ పై గీతలు పడిపోవటం, ఆదమరుపున చేయి జారి క్రిందపడిపోవటం వంటి అంశాలు కొత్త ఫోన్ ఉత్సహాన్ని పూర్తిగా నీరుగారుస్తాయి. మీ ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్‌ను ఇప్పుడు చూద్దాం.

Read More : రాఖీ స్పెషల్, రూ.700కే ఫోన్

మీమీ గాడ్జెట్‌లకు సంబంధించి మీకు తెలియని కొత్త రూపం ఒకటుంటుంది. అదే లోపలి హార్డ్‌వేర్ భాగం. స్మార్ట్‌ఫోన్..ట్యాబ్లెట్.. పర్సనల్ కంప్యూటర్ ఇలా ఏ సాంకేతిక వస్తువైనా సక్రమంగా పనిచేయలంటే లోపల అమర్చిన హార్డ్‌వేర్ మన్నికైనదై ఉండాలి. ప్రముఖ ఆన్‌లైన్ సైట్ ఇఫిక్సిట్ డాట్ కామ్ ifixit.com గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి రిపేరింగ్ చిట్కాలను అందిస్తుంది.

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

మీ ఫోన్ స్ర్కీన్ పై చిన్నిచిన్ని పగుళ్లు ఏర్పడ్డాయా..? ఈ పగుళ్ల పై టూత్ పేస్ట్‌ను అప్లై చేసినట్లయితే క్షణాల్లో పగుళ్లు మటుమాయమవుతాయి. ఈ టిక్ర్‌ను అప్లై చేసే ముందు ఫోన్ పోర్ట్స్ ఇంకా బటన్ భాగాలను టేప్‌తో సీల్ చేసేయండి. ఇప్పుడు స్ర్కీన్ పై ఏర్పడిన పగుళ్ల పై వైట్ టూత్ పేస్ట్ (జెల్ టైప్ కాదు)ను వేసి ఓ సాఫ్ట్ క్లాత్‌తో రబ్ చేయండి. ఆ తరువాత మొత్తడి తడి గుడ్డతో రబ్ చేయబడిన ప్రాంతాన్ని శుభ్రం చేసేయండి.

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

ఫోన్ పై గీతలు ఏర్పడ్డాయా..? ఈ గీతల పై బేకింగ్ సోడా మిశ్రమాన్ని అప్లై చేసినట్లయితే క్షణాల్లో గీతలు కనుమరుగువుతాయి. ఈ ట్రిక్ ను అప్లై చేసేందుకు రెండు భాగాల బేకింగ్ సోడాలో ఒక భాగం నీటిని కలిపి చిక్కిన మిశ్రమంలా తయారు చేయంది. ఆ మిశ్రమంలో కొద్ది మొత్తాన్ని ఓ మైక్రోఫైబర్ క్లాత్ పేస్ చేసి గీతల ఏర్పడిన ఫోన్ భాగం పై సర్క్యులర్ మోషన్ లో రబ్ చేయండి.

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

ఫోన్ స్ర్కీన్ పై గీతలు ఏర్పడ్డాయా..? స్ర్కీన్ పై ఏర్పడ్డ గీతల పై ఫైన్ క్వాలిటీ సాండ్ పేపర్‌ను అప్లై చేసినట్లయితే అవి తొలగిపోయే ఆస్కారం ఉంది.

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

విరిగిపోయిన ఫోన్ కీబోర్డ్ బటన్‌లను ఫిక్స్ చేసేందుకు ఫెవిక్విక్ చక్కటి ఉపాయం. (గమనిక: ఫెవిక్విక్ ను అప్లై చేసే సమయంలో మీ చేతి వేళ్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి).

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

చమ్మతాకిడికి లోనైన మీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకురావాలంటే..? ఈ సమయంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

 సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

ఫోన్ హెడ్‌ఫోన్ పోర్ట్‌లో సమస్యలా..?

ఓ కాటన్ బెడ్‌ను ఫోన్ హడ్‌ఫోన్ పోర్ట్‌లోపలి భాగాన్ని క్లీన్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. 

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ ఎంతో అవసరం. ప్రొటెక్టివ్ కేస్ ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంటుంది. ఆదమరుపున చేయి జారి ఫోన్ క్రిందపడినా పెద్దగా ప్రమాదమేమి ఉండదు. కాబట్టి, మీ కొత్త ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ తప్పనిసరి.

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ అవసరం ఎంతైతే ఉందో స్ర్కీన్ ప్రొటెక్టర్ అవసరం కూడా అంతే ఉంది. స్ర్కీన్ ప్రొటెక్టర్ ఫోన్ స్ర్కీన్ పై గీతలు పడకుండా చేస్తుంది.

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

స్మార్ట్‌ఫోన్‌‌లు చాలా వరకు బాత్రూమ్‌లలోనే ప్రమాదాలకు గురవుతున్నాయట. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను బాత్రూమ్‌లలోకి తీసుకువెళ్లకండి.

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

ఫోన్‌ను ఫ్యాంట్ జేబుల్లో షర్ట్ జేబుల్లో క్యారీ చేయకుండా ప్రత్యేకమైన స్టోర్ కేస్‌ల సహాయంతో బెల్ట్ లేదా పర్స్‌‍కు ఏర్పాటు చేసుకోండి.

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడి పడితే అక్కడ వదిలేయకండి. ముఖ్యంగా అనుమానిత వ్యక్తులకు ఫోన్‌ను దూరంగా ఉంచండి.

 సింపుల్ టిప్స్

సింపుల్ టిప్స్

ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ చేయించుకోవటం మరిచిపోవద్దు.

Best Mobiles in India

English summary
Quick Fixes That May Just Save Your Broken Phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X