మీ ఫోన్ వేడెక్కుతోందా..?

Written By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య 'overheating'. ముఖ్యంగా ఈ హీటింగ్ సమస్య బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో లభ్యమవుతోన్న లెనోవో కే3 నోట్, యు యురేకా, యుపోరియా, మైక్రోమాక్స్ స్పార్క్, షియోమి ఎంఐ 4ఐ వంటి ఫోన్‌లలో తలెత్తటం పలువురిని వేధిస్తోంది.ఈ హీటింగ్ సమస్య కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకే పరిమతమనుకుంటే మీరు పొరబడినట్లే. స్నాప్‌డ్రాగన్ 810 సీపీయాను కలిగి ఉన్న వన్‌ప్లస్2, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ సిరీస్ వంటి ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ల‌లోనూ హీటింగ్ సమస్య ఉంది.

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్

ఫోన్‌లో ఎక్కువ సేపు వీడియో కాల్స్ చేయటం, గ్రాఫికల్ గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయటం వల్ల ఓవర్‌హీట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోన్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను అప్లై చేయటం ద్వారా ఓవర్‌హీట్ ఫోన్‌ను కూల్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడ చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ - 1

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్ ను తగ్గించుకోవచ్చు.

టిప్ - 2

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

 

టిప్ - 3

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

టిప్ - 4

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

 

టిప్ - 5

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి.

టిప్ - 6

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

 

టిప్ - 7

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

 

టిప్ - 8

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.

 

టిప్ - 9

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

పై చిట్కాలు పాటించినప్పటికి మీ ఫోన్ ఓవర్ హీటింగ్‌ను ఎదుర్కొంటున్నట్లయితే రూటింగ్ అలానే కస్టమర్ ROMను ఇన్స్‌స్టాల్ చేయటం వల్ల పురోగతి కనిపించవచ్చు.

 

టిప్ - 10

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone Overheating Problem? These Easy Tips Will Help You Fix the Issue!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting