బ్యాటరీ బ్యాకప్ కోసం సింపుల్ ట్రిక్స్

Written By:

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో బ్యాటరీ బ్యాకప్ ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఫోన్లలో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు బ్యాటరీ అయిపోతుందని చాలామంది బాధపడుతుంటారు.అయితే బ్యాటరీ బ్యాకప్ పెంచుకునేందుకు మార్గాలు లేవా అంటే ఎందుకు లేవు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ ని పెంచుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ని పెంచుకునే కొన్ని ట్రిప్స్ అలాగే ట్రిక్స్ మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Smartphones, laptops, tablets

బడ్జెట్ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైబ్రేషన్

మీ బ్యాటరీ సగం అయిపోతుందంటే దానికి కారణం వైబ్రేషన్ తో కూడిన ఛాటింగ్. మీరు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు వైబ్రేషన్ ఆఫ్ చేసి సైలెంట్ లో ఛాట్ చేస్తే మీ బ్యాటరీ బ్యాకప్ పెరిగే అవకాశం ఉంది.

గూగుల్ డిటెక్షన్

మీరు వాయిస్ కమాండ్ ల ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తే మీ బ్యాటరీ కొంత మేర సేవ్ అవుతుంది. దీనికోసం మీరు Go to Apps > Settings > Google Services > Search & Now > Voiceలో కెళ్లి OK Google detection'ను క్లిక్ చేయండి. మీ గూగుల్ డిటెక్షన్ టర్న్ ఆఫ్ అవుతుంది.

బ్లాక్ కలర్డ్ వాల్ పేపర్స్

అమోల్డ్ డిస్ ప్లే ఉన్న ఫోన్లు బ్లాక్ కలర్ వాల్ పేపర్ వాడటం వల్ల బ్యాటరీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా కలర్స్ వాడటం వల్ల అమోల్డ్ డిస్ ప్లే బ్యాటరీని తినేస్తుందని రిపోర్ట్ ల్లో తేలింది.

యాప్స్ లొకేషన్

మీరు మీఫోన్లో ఇన్ స్టాల్ చేసిన యాప్స్ అన్నీ లోకేషన్స్ ని ట్రాక్ చేస్తుంటాయి. ఉదాహరణకు గూగుల్ మ్యాప్ అలాగే ఉబెర్ సర్వీసులు లాంటివి. వీటిని మీరు అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ చేసుకోవడం మంచింది.

అప్ డేట్

మీరు మీ ఫోన్ ని ఎప్పుడూ అప్ డేట్ చేసుకోవడం వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ వర్షన్ లో యాప్స్ అప్ డేట్ ఇస్తుంటారు. వాటిని అప్ డేట్ చేసుకోవడం ఉత్తమం.

ఏరోప్లాన్ మోడ్

ఇది సమస్యకు పరిష్కారం కాదు గాని బ్యాటరీని మాత్రం సేవ్ చేస్తుంది. మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మీ ఫోన్లో బ్యాకప్ లో యాప్స్ రన్ కాకుండా ఉండేందుకు ఇలా చేయడం ఉత్తమం.

స్క్రీన్ విడ్జెట్స్ తీసేయండి

విడ్జెట్స్ కి సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ పెంచుకోవచ్చు.

Turn off Auto-sync

ఇలా చేయడం వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్ పెరిగే అవకాశం ఉంది.

Doze mode (Android Marshmallow users)

ఆండ్రాయిడ్ 6 మార్ష్ మల్లో వాడేవారికి ఇది కొత్తగా అప్ డేట్ చేయడం జరిగింది. ఆప్టిమైజ్ లో మీ ఫోన్ ని సెలక్ట్ చేసుకుంటే చాలు బ్యాటరీ కొంచెం సేవ్ అవుతుంది.

Check on GPS, Bluetooth, NFC

చివరిది కాని బ్యాటరీని చాలా సేవ్ చేయగలది. మీ మొబైల్ డేటాని ఆప్ చేసినప్పుడు ఇవి కూడా తప్పనిసరిగా ఆప్ చేయండి. లేకుంటే బ్యాటరీ మొత్తాన్ని తినేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write tips and trick to improve battery life
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting