మీ ఫోన్‌లో చెత్త యాప్స్ ఉన్నాయా..?
మరే ఇతర ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్‌ను నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆండ్రాయిడ్ డివైస్‌లలో మనకు తెలియకుండానే మాల్వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంటుంది. కొన్ని సందర్బాల్లో యూజర్ కు తెలియకుండానే పనికిరాని యాప్స్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ కాబడతాయి. ఇలాంటి యాప్స్ ప్రమాదకర మాల్వేర్‌లను సృష్టించి డివైస్‌కు నష్టం చేకూరుస్తాయి. మీ ఆండ్రాయిడ్ డివైస్ లోకి పనికిరాని యాప్స్ చేరకుండే ఉండేందుకు పలు ముఖ్యమైన చిట్కాలు...
Read More : రూ.6,999కే Meizu M2 స్మార్ట్‌ఫోన్

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
సెక్యూరిటీ సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి
Settings>Security>Unknown sources and uncheck allow installation of apps from (unknown sources)

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎడమ వైపు పై కార్నర్‌లో కనిపించే మూడు గితల ఆప్షన్ పై టాప్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి.

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
కొన్ని సమయాల్లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ యాడ్వేర్‌లను కలిగి మీ అనుమతి లేకుండానే డివైస్‌లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోండి

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
మోసపూరిత అప్లికేషన్‌ల జోలికి వెళ్లకండి.

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం ద్వారా అవాంఛిత యాప్స్ తొలగిపోతాయి.

చెత్త యాప్స్‌ను తరమికొట్టండిలా
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కావటం వల్ల రకరకాల మాల్వేర్లు, వైరస్‌లు విచ్చలవిడిగా స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించి మెమరీ కార్డ్‌లలో తిష్టవేస్తుంటాయి. కాబట్టి, మెమరీ కార్డ్‌ను ఫార్మాట్ చేసుకోవటం ద్వారా మాల్వేర్లు తొలగిపోతాయి.


Click it and Unblock the Notifications








