మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత ‘స్పీడు’గా పనిచేయాలంటే..?
ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఉత్తమమైనదిగా అభివర్ణిస్తారు. అనేక అప్లికేషన్‌లను ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఒదిగి ఉన్న మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు మరింత మెరుగుపడాలంటే....
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..? స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో 6 ముఖ్యమైన అంశాలను సూచిస్తూ గిజ్ బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తీసుకువచ్చింది. చదివేందుకు క్లిక్ చేయండి:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత ‘స్పీడు’గా పనిచేయాలంటే..?
అప్లికేషన్‌లను అప్‌టూడేట్‌గా ఉంచుకోండి:
మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత ‘స్పీడు’గా పనిచేయాలంటే..?
యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోండి:
ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత ‘స్పీడు’గా పనిచేయాలంటే..?
అనవసర అప్లికేషన్‌లను టర్ఫ్ ఆఫ్ చేసేయండి:
అవసరం లేకున్నా ఫోన్‌లోని అన్ని అప్లికేషన్‌లను ఓపెన్ చేయటం వల్ల ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. ఈ సందర్భంలో హ్యాండ్‌సెట్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే రన్ చేసుకోవాలి.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత ‘స్పీడు’గా పనిచేయాలంటే..?
మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి. (Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.


Click it and Unblock the Notifications








