షాక్.. ఈ వ్యక్తి సొంతంగా ఐఫోన్ 6ఎస్‌ను తయారుచేశాడు

Written By:

ఈ రోజుల్లో ఆపిల్ ఐఫోన్ అంటే ఎనలేని క్రేజ్..దాన్ని కొనుగోలు చేయాలంటే మాత్రం ఎనలేని భారం. అయితే ఇతను వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా ఐపోన్ 6ఎస్‌ను సొంతంగా తయారుచేశాడు. ఐఫోన్ కు కావాల్సిన విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి, బెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా పేరు తెచ్చుకుంటున్న ఐఫోన్ 6ఎస్ ను తయారుచేసేశాడు. నమ్మలేకున్నారా..అయితే వీడియో చూడండి.

ధన్ ధనా ధన్‌కి పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ

తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.

ఆ వీడియోకు లైక్స్, కామెంట్స్

ఆ వీడియో లైక్స్, కామెంట్స్ తో యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కేవలం ఆ ఒక్క వీడియోతోనే ఆ ఛానల్ కు 20వేల మంది సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు. అది కూడా కేవలం 22 గంటల్లోనేనట. ఆ వ్యక్తి రూపొందించిన వీడియోకు 2500 కామెంట్లు రాగా, 25వేల లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వెల్లువెత్తాయి.

లక్షల కొద్దీ వ్యూస్

మెటల్ బ్యాక్ కేసును సెర్చ్ చేయడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడు ఆ వ్యక్తి.

ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం

గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని ఆ వ్యక్తి మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపించాడు.

సొంతంగా ఐఫోన్ 6ఎస్

మొత్తానికి తనకోసం సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారుచేసుకుని పెద్ద సంచలనమే సృష్టించాడు. 

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Watch How This Man Built an iPhone 6s From Spare Parts read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot