మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతోందా..?
మీరు లేటెస్ట్ ఐఫోన్ లేదా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్నట్లయితే, మీ డివైస్ మీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది. ఈ ట్రాక్ చేసిన సమాచారాన్ని యూజర్ పర్సనలైజెడ్ సర్వీసులకు మాత్రమే ఉపయోగిస్తామని యాపిల్ చెబుతోంది.
Read More : ఇక అమెజాన్, స్నాప్‌డీల్‌లో మోటరోలా ఫోన్‌లు!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయబడిన డేటా మాత్రం నేరుగా గూగుల్‌కు చేరుతుంది. వాస్తవానికి లోకేషన్ ట్రాకింగ్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముంది. ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు తమ డివైస్‌లోని లోకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను భేషుగ్గా టర్నాఫ్ చేసుకోవచ్చు. అది ఏలానో క్రింది స్లైడర్‌లో చూసేద్దామా మరి.....
Read More : గంటకో సెక్స్ వీడియో, నెట్‌లో పెట్టేస్తున్నారు

ఐఫోన యూజర్లు
డివైస్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఐఫోన యూజర్లు
ప్రైవసీ సెక్షన్‌లోని Location Serviceను సెలక్ట్ చేసుకోండి.

ఐఫోన యూజర్లు
లోకేషన్ సర్వీసెస్‌లోని System Servicesను సెలక్ట్ చేసుకోండి.

ఐఫోన్ యూజర్లు
సిస్టం సర్వీసెస్‌లో Frequent Locationను సెలక్ట్ చేసుకోండి.

ఐఫోన్ యూజర్లు
ఫ్రీక్వెంట్ లోకేషన్‌ను turn off టర్నాఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు
ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

ఆండ్రాయిడ్ యూజర్లు
Privacyని సెలక్ట్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ యూజర్లు
ప్రైవసీ మెనూలోని Google Location Historyని సెలక్ట్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ యూజర్లు
Location Historyని పూర్తిగా డిలీట్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లు
తరువాత చర్యలో భాగంగా లోకేషన్ హిస్టరీని ఆఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.


Click it and Unblock the Notifications