ఇక అమెజాన్, స్నాప్‌డీల్‌లో మోటరోలా ఫోన్‌లు!
మోటరోలా ఇండియా తన మోటో సిరీస్ ఫోన్‌లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకునే క్రమంలో మోటరోలా తన మోటో రేంజ్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లోనే కాకుండా ఎంపిక చేయబడిన ఎయిర్‌టెల్ స్టోర్‌లతో పాటు స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మోటరోలా ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read More : గంటకో సెక్స్ వీడియో, నెట్‌లో పెట్టేస్తున్నారు
ముందుగా ఈ స్టోర్‌లలో మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ ఫోన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు మోటరోలా మొబిలిటీ ఇండియా పేర్కొంది. శుక్రవారం నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2014, ఇండియన్ మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా 5.6 మిలియన్ల మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు మోటరోలా వెల్లడించింది.
Read More : 3జీబి ర్యామ్‌తో InFocus M812 స్మార్ట్‌ఫోన్
ప్రపంచానికి మొబైల్ ఫోన్‌ను పరిచయం చేసి సరికొత్త విప్లవానికి నాందిపలికిన మోటరోలా ఆ తరువాత తన ప్రాముఖ్యతను కోల్పొయింది. 2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ $12.5బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తరువాత మోటరోలా మొబిలిటీ హ్యాండ్‌సెట్ విభాగాన్ని చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవోకు $2.91బిలియన్‌లకు విక్రయించినట్లు గూగుల్ తెలిపింది.
ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ పోర్టబుల్ సెల్యులార్ ఫోన్‌గా మోటరోలా డైనాటాక్ ఫోన్ (Motorola DynaTAC phone) చరిత్రపుటల్లో నిలిచింది. ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా మోటరోలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ మేనేజర్ రూడీ క్రోలోప్ కీలక పాత్ర పోషించారు. సెల్యులార్ ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా మోటరోలా చరిత్రలో నిలిచింది. మోటరోలా డైనాటాక్ సిరీస్ నుంచి విడుదలైన 2000, 4000, 6000 ఫ్యామిలీ, 8000 ఫ్యామిలీ ఫోన్ మోడల్స్ అప్పట్లో చరిత్ర సృష్టించాయి. 349 గ్రాములు బరువు గల మైక్రోటాక్ వ్యక్తిగత సెల్యులార్ ఫోన్‌ను మోటరోలా 1989లో పరిచయం చేసింది. అప్పట్లో ఈ ఫ్లిప్‌ఫోన్ చిన్నదిగా ఇంకా తక్కువ బరవు కలిగినదిగా ఉండేది. మోటరోలా నుంచి విడుదలైన మరో మోడల్ మైక్రోటాక్ అల్ట్రాలైట్ క్లాసిక్‌గోల్డ్ ఎడిషన్ ఫ్లిప్‌ఫోన్, WWII నాటి హ్యాండీ-టాకీ మోడల్ SCR536 పోర్టబుల్ టూ-వే రేడియోను కలిగి ఉండేది. 1994లో మోటరోలా iDEN డిజిటల్ రేడియోను పరిచయం చేసింది. ఈ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి కమర్షియనల్ డిజిటల్ రేడియో సిస్టంగా గుర్తింపు పొందింది. 1994లో ప్రపంచ సెల్‌ఫోన్ మార్కెట్‌ను మోటరోలా శాసించింది. గార్టనర్ వెల్లడించిన వివరాల మేరకు మోటరోలా ఆ సంవత్సరంలో 32.5 మార్కెట్ వాటాను సాధించింది. 1996లో మోటరోలా కంప్యూటర్ మోడెమ్‌లకు కనెక్ట్ చేసుకోదగిన స్టార్‌టాక్ వేరబుల్ సెల్యులార్ ఫోన్‌లను ఆవిష్కరించింది. మోటరోలా, టైమ్‌పోర్ట్ మోడల్ ఎల్7089 ట్రైబ్యాండ్ డిజిటల్ వైర్‌లెస్ ఫోన్‌ను 1999లో విడుదల చేసారు. ఈ ఫోన్‌ను జీఎస్ఎమ్ ప్రసార ప్రామాణికంలో వినియోగించారు. మోటరోలా వీ సిరీస్ నుంచి నాలుగు డిజిటల్ వీ8160 సెల్యులార్ టెలీఫోన్‌లు విడుదలయ్యాయి. జూన్ 2000లో మోటరోలా, సిస్కో కంపెనీలు సంయుక్తంగా జీపీఆర్ఎస్ సెల్యులార్ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సర్వీసును మొట్టమొదటి జీపీఆర్ఎస్ సెల్యులార్ ఫోన్ మోటరోలా టైమ్‌పోర్ట్ పీ7389ఐ మోడల్ సెల్యులార్ ఫోన్‌లో వినియోగించారు. ఇంటర్నెట్ ఇంకా సంక్షిప్త సందేశాలను పంపుకునేందకు వీలుగా మోటరోలా కంపెనీ 2001లో మోటరోలా వీ60 డిజిటల్ ఫోన్‌ను పరిచయం చేసింది 2004లో మోటరోలా మోటోరాజర్ వీ3 పేరుతో అత్యంత పలచని ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది. 2005లో మోటరోలా గుండ్రటి అంచులతో కూడిన మోటరోలా PEBL ఫోన్‌లు మార్కెట్లో విడుదలయ్యాయి. జూన్ 2006లో మోటరోలా ‘మోటో క్యూ' పేరుతో పలుచటి క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది. మింగ్ టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా 2006లో ఆసియా మార్కెట్లో విడుదల చేసింది. మోటరోలా రాజర్2 2006లో విడుదలైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మొట్టమొదటి ‘మోటరోలా డ్రాయిడ్' ఫోన్‌ను మోటరోలా కంపెనీ 2009 అక్టోబర్‌లో విడుదల చేసింది. మోటరోలా తన మొట్టమొదటి డ్యుయల్ కోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా ఆట్రిక్స్'ను 2011లో విడుదల చేసింది. ఈ సంవత్సరంలోనే మోటరోలా ఇంక్ రెండు భాగాలుగా చీలింది. మోటరోలా సొల్యూషన్స్, మోటరోలా మొబిలిటీ. 2012లో మోటరోలా మొబిలిటీ విభాగాన్ని $12.5 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదేరోజున మోటరోలా డెఫీటఫ్ ఫోన్ను ఆవిష్కరించింది. ఆ తురవాత మోటరోలా కొత్త వర్షన్ రాజర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విస్తరించుకునే క్రమంలో మోటోలక్సీ, మోటరోలా డెఫీ వేరియంట్‌లలో రెండు ఆండ్రాయిడ్ 2.3 స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా పరిచయం చేసింది. మోటరోలా ‘డెఫీ ప్రో' పేరుతో పూర్తిస్థాయి క్వర్టీ కీప్యాడ్ ఇంకా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో కూడిన మొదటి లైఫ్‌ప్రూఫ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సెప్టంబర్ 6, 2012న వెరిజోన్ వైర్‌లెస్ ఇంకా మోటరోలా మొబిలిటీలు సంయుక్తంగా మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. వాటి పేర్లు డ్రాయిడ్ రాజర్ ఎమ్, డ్రాయిడ్ రాజర్ హెచ్‌డి, డ్రాయిడ్ రాజర్ మాక్స్ హైడెఫినిషన్. ఈ మోడల్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. సెప్టంబర్ 18, 2012న మోటరోలా ప్రాసెసింగ్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌తో జతకట్టి మోటరోలా రాజర్ ఐ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆగష్టు 2013లో మోటో ఎక్స్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా విడుదల చేసింది. ‘మోటో జీ' పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా నవంబర్ 2013లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇండియన్ మార్కెట్లో విక్రయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో విడుదలవుతున్న అన్ని మోటో జీ, మోటో ఇ, మోటో ఎక్స్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించింది. ఆ తరువాత మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా మార్కెట్లో విడుదల చేసింది. గూగుల్ తన మోటరోలా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని లెనోవో కంపెనీకి $2.9 బిలియన్లకు విక్రయించినట్లు పేర్కొంది. లెనోవో యాజమాన్యంలో మోటరోలా మరింతగా ముందుకు సాగుతోంది.
మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....
మోటరోలా మొట్టమొదటి 3జీ సెల్యులార్ ఫోన్ ఏ830ను 2002లో పరిచయం చేసారు.
మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా....

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్ధానం సాగిందిలా...

మోటరోలా ప్రస్థానం సాగిందిలా..

మోటరోలా ప్రస్థానం సాగిందిలా..

మోటరోలా ప్రస్థానం సాగిందిలా..


Click it and Unblock the Notifications