లక్షల మందిని చంపేసి తెర వెనక్కి వెళ్లిన ఆయుధాలు

By Hazarath
|

రెండవ ప్రపంచ యుద్ధం గురించి అందరికీ తెలుసు. నెత్తుటేరులు పారిన ఆ యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ యుద్ధంలో వాడిన కొన్ని ఆయుధాలు తరువాత మరుగునపడిపోయాయి. కేవలం యుద్దం కోసమే వీటిని తయారుచేసి కొన్ని లక్షల మందిని చంపేలా వ్యూహాలు రచించారు. ఆ ఆయుధాలు యుద్ధంలో వాడిన తరువాత మళ్లీ కనడపలేదు కూడా..అవేంటో మీరే చూడండి.

Read more : ఇప్పటికీ రహస్యంగానే మిగిలిన భూగర్భ స్థావరాలు

1

1

నాజీలు ఈ ఆయుధాన్ని తయారుచేశారు. దీన్ని సీ లైన్ ఆపరేషన్ గా ఉపయోగించాలని స్కెచ్ కూడా వేశారు. యుకె మీద నీటిలోనుంచి దాడిచేయడానికి ఈ ఆయుదాన్ని నీటిలో ఉంచారు. నీటి లోపల ఉంటూ శత్రువుల మీద దాడిచేసే విధంగా దీని నమూనా తయారుచేశారు. నీటిలో ఎన్ని రోజులు ఉన్నాఈ ఆయుధాలు చెక్కు చెదరవు.

2

2

అయితే ఈ ఆయుధాలు కేవలం 20 నిమిషాలు మాత్రమే పనిచేయగలవు. అలాగే నీటిలోపల 50 అడుగుల వరకు మాత్రమే ప్రయాణం చేయగలవు. దాదాపు 150 ట్యాంకులను తయారుచేశారు. వీటిని యుదధం తరువాత ఆపఏశారు. ఎందుకు పనికి రాకుండా పోయాయి. 

3

3

1941లో ఈ కాన్సెప్ట్ బయటకొచ్చింది. అనేక ట్యాంకులను టెస్టింగ్ కూడా చేశారు. ఈ ట్యాంకర్ చుట్టూ ఓ గుడ్డను కట్టేసి మధ్యలో సైనికులు ఉంటారు. నీళ్లలో ప్రయాణిస్తూ శత్రువుల మీద దాడి చేయడం వీరి పని. యుద్ధంలో వాడిన తరువాత మళ్లీ ఇవి కనపడలేదు.

4

4

దాదాపు 27 ట్యాంకులను సముద్రం అడుగుభాగాన కూడా ఉంచారు. అయితే ఏమైందో ఏమో వీటిని కూడా వాడకుండా వదిలేశారు. అవి ఇప్పటికీ అలానే మూలన పడి ఉన్నాయి.

5

5

జర్మనీ ఈ ఆయుధాలను కనిపెట్టింది. 1936 ప్రాంతంలో ట్రాన్స్ పోర్ట్ కోసం కనిపెట్టారు. అయితే ట్రాన్స్ పోర్ట్ నుంచి అది కాస్తా శత్రువుల మీద దాడిచేసే ఆటోమేటిక్ సెల్ఫీ గన్ గా మారిపోయింది.యుద్ధంలో అనేక మందిని మట్టుపెట్టింది.

6

6

ఇది 600 మిల్లీ మీటర్ల బారల్ అలాగే 1800 కిలోగ్రాముల బరువుతో ఉండి 3 మైళ్ల దూరం వరకు తన ప్రతాపాన్ని చూపించగలదు. అయితే కొద్ది కాలం తరువాత వీటిని పేల్చి పడేసింది. ఇవి పనికిరావని తీసిపారేసింది.

7

7

ఇవి గల్లీ గల్లీ తిరుగుతూ శత్రువులను మట్టుబెట్టే ఆయుధాలు. హిట్లర్ వీటిని దగ్గరుండీ మరీ తయారుచేయించారు. ఎంత పెద్ద భవనాలను అయినా క్షణాల్లో కూల్చేయగల అత్యాధునిక ఆయుధాలు ఇవి. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

8

8

బారెల్ చుట్టూ రంధ్రాలు పెట్టి అందులో నుంచి రాకెట్ లాంచర్లు ప్రయోగించే విధంగా తయారుచేశారు. వార్సా తిరుగుబాటు సమయంలో వీటిని ఆ యుధ్ధానిక తరలించారు. అయితే ఆ యుధ్ధం తరువాత అవి మళ్లీ కనపడలేదు.

9

9

1920లో సోవియట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇవి గాల్లో తిరుగుతూ నేల మీద ఉన్న శత్రువులపై ఏక కాలంలో బాంబులను కురిపించగల జెట్లను మోసుకెళ్లే విమానం. ఈ ఎయిర్ క్రాప్ట్ ఒకేసారి మూడు విమానాలను తనతో పాటు తీసుకెళ్లగలదు.

10

10

వీటితోనే నాజీలు యుద్ధంలో పొగలు కక్కించారు. 1941 యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వెపన్స్ 1942 వచ్చేసరికి మూలకు వెళ్లాయి. వాస్తవానికి యుద్ధం కోసమే వీటిని తయారుచేశారని తెలుస్తోంది.

11

11

1942లో జర్మనీ సెయిల్ ప్లేన్ అసోషియేషన్ ఈ కాన్సెప్ట్ తయారుచేసింది. 1933లో దీన్నే ప్రదర్శనకు పెట్టినా బయటకు మాత్రం 1943లో వచ్చింది. దాదాపు 100 జెయు జెట్ ఫైటర్స్ ఒక్కోటి 1800 కిలోగ్రాముల పేలుడు పదార్ధాలను మోసుకెళ్లగలవు. యుద్ధంలో దుమ్ము రేపాయి కూడా.

12

12

అయితే గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల పైకి బాంబులను కురిపించే ఈ జెట్ ఫైటర్స్ గతి తప్పాయని అవి టార్గట్ ని చేధించడంలో విఫలం అయ్యాయని చెబుతారు. అందుకే వాటిని పక్కకు నెట్టారని తెలుస్తోంది.

13

13

1920లో ఫ్రెంచ్ వాళ్లు కనిపెట్టిన సబ్ మెరైన్ ఇది. 20 సెంటీమీటర్ల గన్ లను రెండింటిని మోసుకెళ్లగలదు. ఈ సబ్ మెరైన్లను వాషింగ్టన్ నావల్ నిషేధించింది.అయితే ఓ ప్రత్యేక మినహాయింపుతో ఫ్రెంచ్ సైన్యం చేతికి మళ్లీ ఇవి వెళ్లాయి.

14

14

అయితే కొత్తవి చేయడం సాధ్యమవుతుందా అని అప్పట్లో ఆయితే యుద్ధంలో ఫ్రాన్స్ లొంగిపోయినప్పుడు యుకె వీటిని స్వాధీనం చేసుకుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఇది నీటిలో మునిగిపోయింది.

15

15

నీటి లోపల నడిచే మరొక సబ్ మెరైన్ ఇది. జర్మనీ ఫ్రొపెసర్ తయారుచేశారు. రాకెట్ ఇంధనంతో వీటిని నింపి యుధ్ధానికి తీసుకెళ్లే విధంగా వీటిని తయారుచేశారు. నీటిలోపల అత్యంత వేగంగా ప్రయాణించేలా వీటిని రూపొందించారు.

16

16

అయితే ఇంధనంతో భారం కావడం. అలాగే వీటిల్లో పసలేకపోవడంతో వీటిని క్యాన్సిల్ చేశారు. ఆ తరువాత చిన్న చిన్న సబ్ మెరైన్లను రూపొందించుకుని యుద్ధానికి దిగారు.

17

17

ఇవి ఎక్కడైనా ల్యాండ్ కాగల విమానాలు.రెండవ ప్రపంచ యుద్ధంలో వీటిని వాడారు.

18

18

అయితే రాను రాను ఇవి కూడా తెర వెనక్కి వెళ్లిపోయాయి.అత్యాధునిక విమానాలతో పోటీ పడలేకపోవడంతో జపాన్ వీటిని పక్కన పడేసింది.

19

19

ఇదొక అత్యాధునిక యుద్ధ ట్యాంకర్ నాజీలు తయారుచేసి యుద్ధంలో వాడారు. చీకటిగా ఉన్న సమయంలో ఇవి లైట్లు వేసుకుని శత్రువులను మట్టు బెట్టే విధంగా నాజీలు తయారుచేశారు.

20

20

వందలాది రహస్య ఆయుధాలను సప్లయి చేసినప్పటికీ వీటిని యుద్ధంలో చాలా తక్కువగా వాడారు. ఆ తరువాత అత్యాధునిక ఆయుధాలు రావడంతో ఈ సీక్రెట్ ఆయుధాలను రద్దు చేశారు.

21

21

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write 10 Bizarre World War II Weapons That Were Actually Built

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X