ఇప్పటికీ రహస్యంగానే మిగిలిన భూగర్భ స్థావరాలు

Written By:

భూగర్భంలో మనకు తెలియకుండా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. శాస్ర్తవేత్తలు ఆర్కియాలజిస్టులు వాటిని చేధించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్నింటిని చేధించారు..మరికొన్ని మాత్రం అలానే మిగిలిపోయాయి. కొన్ని చోట్ల భూగర్భంలో దాగిన మిస్టరీని చేధించడానికి శాస్ర్తవేత్తలు కిందా మీదా పడుతున్నా కాని వారికి సాధ్యం కావడం లేదు. అటువంటి కొన్ని రహస్యాలను మీకందిస్తున్నాం చూడండి.

Read more : 100 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌తో నక్షత్రాల వేట షురూ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈజిప్ట్ లో ఉన్న ఈ భూగర్భ ప్రపంచంలో ఎన్నో విజ్ఙానపరమైన అంశాలు దాగిఉన్నాయి. ఈ కోటల మీద చెక్కిన చిత్ర లిపి పురాతన ఈజిప్ట్ కు సంబంధించిన నాగరికతను ప్రతిబింబిస్తుంది. అయితే అది ఏంటనేది శాస్ర్తవేత్తలు ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. ఇది పవిత్రమైన మొసళ్లు నివసించడానికి నిర్మించిన ప్రదేశమని చెబుతుంటారు.12 మంది రాజులు నిర్మించారని చెబుతారు. అయితే ఈజిప్ట్ ప్రభుత్వం దీని పరిశోధనకు వ్యతిరేకత తెలుపుతోంది. దీన్ని లాబ్రినాధ్ గా పిలుస్తారు.

2

5000 సంవత్సరాల క్రితం నాటి అండర్ గ్రౌండ్ సిటీ ఇది. దీన్ని డెత్ వాల్లీ అని పిలుస్తారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి అక్కడ మమ్మీలు, అలాగే ఆసక్తికరమైన పాత ఖళా ఖండాలు కనిపించాయని చెబుతారు. అయితే అది ఎవరిది అక్కడ ఎందుకు దీన్ని నిర్మించారనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీలానే ఉంది.

3

పురాతన నాగరికతకు సంబంధించిన నాగరికులు ఈ గ్రాండ్ కాన్యన్ లోని రహస్య భూగర్భ నగరంలో నివసిస్తున్నారని శాస్ర్తవేత్తల పరిశోధనలో తేలింది. అయితే అది ఇంకా రహస్యంగానే ఉంది. అసలు నిజంగానే పురాతన వాసులు ఉన్నారా లేరా అన్నది మాత్రం శాస్ర్తవేత్తలు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు.

4

టర్కీలో ఈ నగరాన్ని భూగర్భంలో కనుగొన్నారు. ఇతి అత్యంత అధునాతనంగా కట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడ నిర్మాణం చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. అయితే అంతటి అధునాతన నగరాన్ని ఎవరు నిర్మించారన్నది మాత్రం రహస్యంగానే మిగిలింది.

5

మిస్సోరిలోని పురాతన నగరం ఇది. అక్కడ రాక్షసులు నివసించారని చెబుతుంటారు. శాస్ర్తవేత్తల పరివోధనలతో అక్కడ పెద్ద పెద్ద మనుషుల ఎముకలు బయటపడ్డాయి. అయితే వాళ్లెవరనేది మాత్రం మిస్టరీగానే మిగిలింది.

6

పురాతన కాలంనాటి ఓ రహస్య స్థావరాన్ని జపాన్ లో కనుగొన్నారు. అది అంతా పర్వతాలతో నిండి ఉంది. అద్భుతమైన దేవాలయాలతో అది కనిపించింది. శాస్ర్తవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసినా అది ఏంటనేది మాత్రం కనుక్కోలేకపోయారు.

7

ఈ ప్రదేశంలోకి నీవు ఓ సారి ఎంటరయితే బయటకు రావడానికి నీకు దారి కనిపించదు. చాలా కాలం క్రితం అక్కడ దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఇసుకతోనే నిర్మించారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మొత్తం ఎడారిలాగా ఉంటుంది. అందుకే దీన్ని సీ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఇది చైనాలో ఉంది.

8

ఇది రష్యాలో కనుగొన్నారు. భూగర్భంలో అంతా సరస్సులాగా ఉంటుంది. దీన్ని అక్కడి వాసులు ఓ పవిత్ర భూమిగా చెబుతుంటారు. అక్కడ కనుగొన్న సరస్సును కూడా చాలా పవిత్రమైనదిగా చూస్తుంటారు. మరి ఎవరు దీన్ని నిర్మించారనేది మాత్రం రహస్యమే.

9

ఇది మన ఇండియా స్టోరి. ఈ భారీ గుహల నుంచి ఓ పురాతన మనిషి బయటకు వచ్చాడని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అతని తెల్లని శరీరంతో ఆ పురాతన గుహల నుండి బయటకు వెళ్లి పోయాడని వారంటున్నారు.మరి ఎవరతను అనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది.

10

ఇటలీలో భూగర్భంలో ఈ పెద్ద పిరమిడ్ ని శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. అయితే ఇది 6th- 4th centuries BC మధ్య కాలంలోనిదని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు.అయితే ఎవరు దీన్ని అక్కడ పెట్టారు. ఎలా తీసుకెళ్లారన్నది మాత్రం సస్పన్స్ గానే ఉంది.

11

టిబెట్ లోని భూగర్భ ప్రదేశంలో ఇలా మెట్లతో కూడిన మందిరాలు చాలానే బయటపడ్డాయి. అక్కడి గుహలు అన్ని అత్యంత సుందరంగా దేవాలయాలతో కళకళలాడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం వీరు గ్రహాంతర వాసులకు చెందిన మూలాలుగా శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. ఇక అక్కడనుంచి బండి ముందుకు సాగలేదు.

12

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 11 Mysterious Underground photos which is Unsolved To This Day
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot