Home
News

100 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌తో నక్షత్రాల వేట షురూ !

By Hazarath

అంతరిక్షంలో నక్షత్రాలను అలాగే ఏలియన్స్‌ను కనుగొనేందుకు ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్‌తో ఫేస్‌బుక్ అధినేత జట్టు కట్టాడు. ఎప్పటి నుంచి అంతరిక్షం మీద పరిశోధనలు చేస్తున్న స్టీఫెన్ హాకింగ్ కు మార్క్ జత కట్టడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరికి జతగా రష్యా బిలీయనీర్ మిల్నర్ కూడా తోడవడం అదీ మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్ కావడంతో అంతా ఇక అంతరిక్షంలో వేట మొదలైనట్లేనని తెలుస్తోంది.

Read more: గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్న జంగిల్ బుక్

1

1

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్, రష్యా బిలియనీర్ యూరీ మిల్నర్, ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్‌బర్గ్‌లతో కలిసి నక్షత్ర యానం చేసే చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌లను తయారుచేసేందుకు 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని హాకింగ్స్, మిల్నర్‌లు వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఇన్ న్యూయార్క్‌లో ప్రకటించారు.

2

2

బ్రేక్‌ త్రూ స్టార్ షాట్ పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో కాంతి వేగానికి 20 రెట్లు ఎక్కువగా ప్రయాణించగల నానోక్రాఫ్ట్‌లను తయారుచేయనున్నారు. ప్రస్తుత స్పేస్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే 1,000 రెట్లు వేగంగా ఇవి ప్రయాణించగలవు.

3

3

నానోక్రాఫ్ట్‌లు నిర్మించడం పూర్తయిన తర్వాత ఇవి ఆల్ఫా సెంటౌరీ అంటే భూమికి 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను చేరుకోగలదని, ఇందుకు 20 సంవత్సరాల కాలం పడుతుందని మిల్నర్ తెలిపారు. సాధారణ స్పేస్ క్రాఫ్ట్‌లు ఈ దూరాన్ని పూర్తి చేయాలంటే 30,000 సంవత్సరాలకు పైచిలుకు సమయం పడుతుంది.

4

4

మొత్తం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఈ నానోక్రాఫ్ట్‌ల్లో రెండు ప్రధాన భాగాలుంటాయి. 1. కంప్యూటర్ సీపీయూ సైజ్‌లో ఉండే 'స్టార్ చిప్' 2. మెటామెటీరియల్‌తో రూపొందించిన 'లైట్‌సెయిల్'

5

5

ఇందులో కేవలం కొన్ని వందల అణువుల మేర మాత్రమే మందాన్ని కలిగిన కాంతి తెర చాపలను జోడిస్తారు. భూమి నుంచి ప్రయోగించే లేజర్ కాంతి కిరణాలు దీన్ని ముందుకు నెడతాయి. ఇది మినహా ఈ వ్యోమనౌకలో సొంతంగా చోదక వ్యవస్థ ఉండదు.

6

6

కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వ్యోమనౌక వేగాన్ని గంటలకు 13 కోట్ల మైళ్లకు పెంచవచ్చు. కాంతి వేగంలో ఇది ఐదో వంతు. ఈ వేగంతో ఆల్ఫా సంచారైను 20 ఏళ్లలో చేరుకోవచ్చు.

7

7

కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉండే స్టార్‌చిప్‌లో విశ్వ పరిశోధనకు అవసరమైన కెమెరాలు, నావిగేషన్, సమాచార సాధనాలు ఇమిడి ఉంటాయి. స్టార్‌చిప్‌ల‌ను ఐ-ఫోన్ ఖరీదులోనే ఒకేసారి తయారు చేసుకోవచ్చని మిల్నర్ వివరించారు.

8

8

సాధనాలను శక్తిమంతమైన లేజర్ సాయంతో విశ్వ ప్రయాణానికి పంపుతామని, ఇందుకు 100 గిగావాట్ల పవర్‌ను ఉపయోగిస్తామని న్యూస్‌కాన్ఫరెన్స్ పేనెలిస్ట్‌లో ఏబ్ తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

9

9

పదిహేను ఏళ్ల కిందట ఇటువంటి ప్రయోగాలు చేయడంపై పెట్టుబడి పెట్టడం అర్ధం లేదని కానీ, ఇప్పుటి పరిస్థితులు వేరు' అని మిల్నర్ అన్నారు. గత ఏడాది జులై 2015లో మిల్నర్, హాకింగ్స్‌లు పాలపుంతకు దగ్గరగా ఉన్న 100 గెలాక్సీల్లో ఏలియన్ల‌ను వెతకడానికి ప్రారంభించిన ప్రాజెక్టు కూడా బ్రేక్ త్రూ‌లో ఒక భాగం.

10

10

ఆల్ఫా సెంటౌరీని చేరుకోవడం ఒక్కటే మా లక్ష్యం కాదు. ఆ మార్గంలో మేం ఎదుర్కొనే సవాళ్లు కూడా మా లక్ష్యమే. ఇందులో చాలా పెద్ద మొత్తంలో సైన్స్‌ను తెలుసుకోబోతున్నాం అని జెమీసన్ అన్నారు.

11

11

ఈ రోజు మనిషి మొదటిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన రోజు. ఇదే రోజున మేం మరో పెద్ద కార్యాన్ని తలపెడుతున్నాం' అని హాకింగ్స్ అన్నారు. భూమ్యకర్షణ శక్తి మనల్ని కిందే ఉండేలా చేస్తుంది. కానీ, నేను అమెరికాకు ఎగురుకుంటూ వెళ్లగలిగాను.' అని హాకింగ్స్ పేర్కొన్నారు.

12

12

ఇదిలా ఉంటే క్షణాల్లో మిలియన్ స్నేహితులను స్టీఫెన్ సంపాదించుకున్నారు. చైనా వర్షన్‌కు చెందిన ట్విటర్ ఖాతాలో చేరిన కాసేపట్లోనే దాదాపు పది లక్షలమంది ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు.

13

13

భారత్‌లో ట్విట్టర్ వర్షన్ మాదిరిగా చైనాలో కూడా వైబో అనే ట్విటర్ మాధ్యమానికి చెందిన ఓ సామాజిక అనుసంధాన వేదిక ఉంది. అందులో హాకింగ్ మంగళవారం చేరారు. ఆయన చేరిన క్షణాల్లోనే అనూహ్యంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది. ఇక ఆయన చేసిన తొలి పోస్టింగ్‌కైతే ఏకంగా ఐదులక్షల లైక్‌లు వచ్చాయి.

14

14

చైనాలోని నా స్నేహితులందరికి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ద్వారా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. నాజీవితాన్ని గురించి నేను చేస్తున్న పని గురించి మీకు దీని ద్వారా తెలపాలని అనుకుంటున్నాను. దీంతోపాటు మీరు తిరిగి సమాధానం ఇవ్వడం ద్వారా ప్రశ్నించడం ద్వారా కూడా మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను' అని హాకింగ్ అన్నారు.

15

15

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Stephen Hawking and a Russian Billionaire Want to Build an Interstellar Starship
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X