ప్రపంచాన్ని ఏలుతున్న 1 డాలర్ జీతగాళ్లు

Written By:

1 డాలర్ జీతంతో వారంతా ప్రపంచాన్ని ఏలుతున్నారు. సంవత్సర కాలం పాటు కేవలం ఒకే ఒక డాలర్ జీతం తీసుకుని ఇప్పుడు కోట్లకు వారసులుగా మారారు. కంపెనీని పెట్టినప్పటి నుంచి దాన్ని అగ్రస్థాయికి తీసుకెళ్లడానికి వారు రాత్రంబవళ్లు కష్టపడుతూ ఒక డాలర్ జీతంతో తమ బతుకును వెళ్లదీశారు. ఈ మేరకు వారి కంపెనీ సెక్యూరిటీ ఎక్సేంజ్ కమిషన్ లో వివరాలను నమోదు చేశారు. మరి వారెరవరో మీరే చూడండి.

Read more: ఆపిల్ బంఫర్ ఆఫర్: నెలకు రూ. 999 చెల్లిస్తే ఐఫోన్ మీ చేతికి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ (Larry Page and Sergey Brin )

1

2004లో వీరు సంవత్సరానికి తీసుకున్న జీతం కేవతం 1 డాలర్. ఇప్పుడు కంపెనీ విలువ 34. 9 బిలియన్ల డాలర్లు, ఇందులో సీఈఓ బ్రిన్ విలువ 34.3 బిలియన్ల డాలర్లు.

జాక్ డెర్సీ ( Jack Dorsey)

2

ట్విట్టర్ సీఈఓ ..ఇప్పు కంపెనీ నెట్ వర్త్ 2.3 బిలియన్ల డాలర్లకు పైనే. ఇతను ఆ డాలర్ కూడా తీసుకోలేదు. ఈ మేరకు కంపెనీ డాక్యుమెంట్ లో పొందుపరిచారు.

లారీ ఎల్లిసన్ ( Larry Ellison)

3

ఒరాకిల్ సీఈఓ. 2014లో ఇతను తీసుకున్న జీతం కేవలం ఒక డాలర్ మాత్రమే. ప్రపంచ టెక్ రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ అధినేత 1 డాలర్ తీసుకున్నారంటే ఎవరైనా నమ్మగలరా.కంపెనీ కో సీఈఓలు సాప్రా కాట్జ్ ,మార్క్ హుడ్ లు 950000 డాలర్లు తీసుకుంటే ఈయన మాత్రం కేవలం ఒక డాలర్ మాత్రమే తీసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

ఈలోన్ ( Elon Musk )

4

టెస్లా మోటర్ అధినేత. దీని కంపెనీ నికర విలువ 13 బిలియన్ల డాలర్లు. 2015లో కంపెనీలో మినిమం జీతాలు 37 డాలర్లు ఉంటే ఇతను మాత్రం జీతం లేకుండానే పనిచేశారు.

మార్క్ జుకర్ బర్గ్ ( Mark Zuckerberg)

5

ఫేస్‌బుక్ అధినేత. 2012లో తీసుకున్న జీతం కేవలం 1 డాలర్ మాత్రమే. ఇప్పుడు మార్క్ నికర విలువ 41 బిలియన్ డాలర్లకుపైగానే అని అంచనా.

డేవిడ్ ( David Filo)

6

యాహూ అధినేత. ఇతని ఫస్ట్ ఏడాది జీతం 1 డాలర్ మాత్రమే. ఇప్పుడు ఇతని ఆస్తుల నికర విలువ 2.8 మిలియన్ల డాలర్లని అంచనా

Jeremy Stoppelman

7

yelp అధినేత. ఇతను ఏడాదికేడాదికి తన జీతం తగ్గంచుకుంటూ వెళ్లారు.2012లో 300,000 డాలర్లు ఉంటే అది 2013 నాటికి 37,501 డాలర్లకు చేరింది. అది కాస్తా 2014కి 1 డాలర్ కి చేరింది.ఇప్పుడు ఇతని నికర ఆస్తుల విలువ 222 మిలియన్ డాలర్లు.

John Mackey

8

Whole Foods అధినేత. కంపెనీ ఎస్ఈసీలో పొందుపరిచిన వివరాల ప్రకారం 2007లో ఇతను తీసుకున్న జీతం కేవలం 1 డాలర్ మాత్రమే. ఇప్పుడు ఇతని ఆస్తుల నికర విలువ మిలియన్ల డాలర్లు

ఎడ్వర్డ్ ( Edward Lampert)

9

Sears అధినేత సీఈఓ, కంపెనీ ఎస్ఈసీ ఫిల్లింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇతను 2013లో తీసుకున్నజీతం కేవలం అ డాలర్ మాత్రమే. ఇప్పుడు ఇతని ఆస్తుల నికర విలువ 2.6 మిలియన్ డాలర్లు.

రిచర్డ్స్ ( Richard Fairbank )

10

క్యాపిటల్ వన్ అధినేత. గత 20 సంవత్సరాల నుంచి జీతం లేకుండానే పనిచేస్తున్నారని కంపెనీ ఎస్ ఈసీలో పొందుపరిచారు.

Steven Kean

11

కిండర్ మోర్గాన్ సీఈఓ. కంపెనీ ఎస్ఈసీ ఫిల్లింగ్ నోట్ లో కేవలం ఇతని జీతం 1 డాలర్ గా పొందుపరిచారు.

Richard Hayne

12

Urban Outfitters' ప్రెసిడెంట్, సీఈఓ, ఇతని బేసిక్ జీతం 1 డాలర్. ఫర్ ఫార్మెన్స్ బోనస్ 500,000 మిలియన్ డాలర్లు.

స్టీవ్ జాబ్స్ (Steve Jobs)

13

యాపిల్‌ కంప్యూటర్స్‌ చీఫ్‌ స్టీవ్‌జాబ్స్‌ జీతం ఎంతో తెలుసా? కేవలం ఒక్క డాలర్‌ మాత్రమే. మూడేళ్ల పాటు ఆయన తన జీతం కేవలం ఒక డాలర్‌ మాత్రమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 14 top executives who make a 1 salary or less
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting