ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

Written By:

చరిత్రలో ఎన్నో మిస్టరీలకు ఇప్పటిదాకా జవాబులు దొరకలేదంటే నమ్ముతారా..కొన్ని మిస్టరీలను శాస్రవేత్తలు చేధించినప్పటికీ మరికొన్ని మిస్టరీలు మాత్రం అలానే ఉండిపోయాయి. వాటికి సమాధానం మాత్రం ఇప్పటిదాకా రాలేదు. అలా మిస్టరీగా మారిన కొన్నింటిని మీకందిస్తున్నాం. చూడండి.

Read more: షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

239 మందితో బయలు దేరిన మలేషియా MH370 విమానం జాడ ఇప్పటిదాకా తెలియలేదు. హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని కొందరు అలాగే బంగాళాఖాతంలో కూలిపోయిందని మరికొందరు చెబుతారు. కాని అసలైన వాస్తవం ఇంతవరకు బయటకు రాలేదు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

32 చదరపు మైళ్ల విస్తీర్ణంలో లావా విరజిమ్మింది. 1783లో వచ్చిన అతి పెద్ద విస్ఫోటనం ఇది. దాదాపు 150 సంవత్సరాలు తరువాత ఇలా నిప్పులు చిమ్ముతూ లావా ఐస్ లాండ్ ని కమ్మేసింది. సల్ఫర్ డై ఆక్సైడ్ భూమిలో నుంచి పొగలు కక్కుతూ అగ్నిపర్వతం బద్దలైనట్లుగా కనిపించింది. మరి ఎందుకు అలా జరిగిందనేది మిస్టరీనే.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

ఇదొక మర్డర్ కేసు. ఈ కేసు సీరియల్ సాగినట్లుగా సాగింది. తన మాజీ గర్ల్ ప్రెండ్ ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మాజీ ప్రియురాలని కడతేర్చాడు. చివరకు ఊసలు లెక్కబెట్టాడు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

115 అడుగుల అడుగుల లోతు వరకు ఇలా ఓ పెద్ధ రంధ్రం పడింది. ఇది సైబీరియాలో జరిగింది. ఇటువంటి హోల్స్ ను కొద్ది రోజుల వ్యవధిలో రష్యాలో కనుగొన్నారు. అయితేసైంటిస్టలు ఉపరితలం నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల ఇలా రంధ్రం పడిందని చెబుతారు.కాని అసలైన కారణం ఏంటనేది తెలియదు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

10 మిలియన్ల డాలర్లు విలువ చేసే 1400 బంగారు నాణేలు కపుల్స్ కాలిఫోర్నియా బ్యాక్ యార్డ్ లో వీటిని చేజిక్కించుకున్నారు. దాదాపు 8 డబ్బాల నిండా ఈ నాణేలు దొరికాయి. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం మిస్టరీనే. చాలామంది వీటికోసం అక్కడ వెతికితే వారికి ఏమీ చిక్కలేదు కూడా.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

గతేడాది ఆగస్టులో సెలబ్రిటీల ఫోటోలు హ్యాక్ అయ్యాయి. అయితే ఎవరు హ్యాక్ చేశారు. ఎందుకు హ్యాక్ చేశారు. ఎంతమంది హ్యాక్ చేశారన్నది మాత్రం తేల్చుకోలేకపోయారు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

ఏలియన్స్ ప్లానెట్ మీద చందమామను కనుగొన్నారని దాన్ని ఎక్సోమూన్ గా పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

అండర్ గ్రౌండ్ లో ఇలా విశాలమైన నిర్మాణాలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు తేల్చారు. ఇది 500 ఏళ్ల క్రితం నిర్మాణాలని వారంటున్నారు. అయితే అవి ఎవరివి అన్నది మాత్రం కనుక్కోలేకపోతున్నారు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

సోని కంపెనీని నార్త్ కొరియా హ్యాక్ చేసిందని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అది నిజమేనా నిజంగానే సోనిని నార్త్ కొరియా హ్యాక్ చేసింది లేక అమెరికా నాటకం ఆడిందా అనేది మిస్టరీనే. ఎందుకంటే నార్త్ కొరియాలో ఇంటర్నెట్ ను బయట కంపెనీలు ప్రొవైడ్ చేస్తుంటాయి. అక్కడ ఇంటర్నెట్ కంట్రోల్ అంతా బయటి కంపెనీల చేతుల్లో ఉంటుంది.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

మెక్సికోలో 12 మంది విద్యార్థులు ఏమయ్యారో అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇన్విస్టిగేషన్ లో వారిని చంపేశారని చెప్పినా వారు బాడీలు ఇంతవరకు చిక్కలేదు. ఆ విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని చెబుతారు.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

కొన్ని దేశాల్లో టొర్నాడోలు అనేవి సహజం. అయితే ట్విన్స్ టొర్నోడోలు రావడం అనేది బహు విచిత్రం. నెబరస్కాలో గత జూన్ లో ఇలా ట్విన్స్ టొర్నాడోలు భీభత్సం సృష్టించాయి. దీని దెబ్బకు ఇద్దరు చనిపోగా 24 మంది గాయపడ్డారు. గంటకు 200 మైళ్ల వేగంతో సుడిగాలిలా దూసుకువెళ్లింది. అయితే ఇది అలా ఎందుకు జరిగిందనేది మాత్రం సస్పెన్స్.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

దాదాపు 300 మంది విద్యార్థినులు గత ఏప్రిల్ నెలలో కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన జరిగింది. ట్విట్టర్ లో కూడా ఈ న్యూస్ వైరల్ గా మారింది. నైజీరియాకు చెందిన ఈ విద్యార్థినులు ఎక్కడ ఉన్నారు. ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.

ఈ మిస్టరీలకు సమాధానం దొరుకుతుందా..?

స్వీడన్ లో వయెలెన్స్ అనే మాటకు తావులేదని అక్కడ టాప్ జనరల్ సెక్రటరీ గత అక్టోబర్ లో చెప్పారు. అయితే స్వీడిష్ మిలటరీ ఇలా సబ్ మెరైన్లతో పాగా వేసింది. దీన్నే వారు అఫిషియల్ గా ది హంట్ అని కూడా పిలుస్తారు. అదేమంటే ఈ సబ్ మెరైన్ ఫారిన్ ది చెబుతారు. కాని అక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం సస్పెన్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 13 unsolved mysteries that still need answers
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot