షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

Written By:

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..అవును నిన్నటిదాకా బయటి ప్రపంచానికి తెలియని ఆపిల్ ఫ్యాక్టరీ రహస్యాలు ఇప్పుడు బటయకొచ్చాయి. అత్యంత గొప్ప బ్రాండ్ గా చెప్పుకునే ఆపిల్ సంస్థ తన ఫోన్లకు సంబంధించిని కొన్ని భాగాలను చైనాలో తయారుచేస్తుందని దీనికి సంబంధించిన అనేక రహస్యాలను లేబర్ వాచ్ అనే చైనా సంస్థ బయటపెట్టింది. అవేంటో మీరే చూడండి.

Read more: సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఐఫోన్ .. ప్రపంచంలో చాలామంది విపరీతంగా ఇష్టపడే స్మార్ట్ ఫోన్. అందరూ ఆసక్తి చూపే ఈ ఫోన్లను తయారు చేసే కంపెనీలో పనెలా జరుగుతుందనేది తెలుసుకోవడం కూడా అంతే ఆసక్తి కరంగా ఉంటుంది. 

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఉదయం 9 కాగానే ఉన్న షాంఘై నగరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి వేలమంది ఉద్యోగులు ఇలా గులాబి చొక్కాలు ధరించి ఐ ఫోన్ తయారీకి రెడీ అవుతారు.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఉద్యోగులు ఒక్కసారి కాంపౌండ్లోకి అడుగపెట్టగానే అక్కడ మెటల్ డిటెక్టర్లు, కెమెరాలు, వీడియోల్ని, ఐడీ కార్డులు, ముఖాల్ని స్కానింగ్ చేసే యంత్రాల్ని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఆపిల్ సంస్థ కోసం ఐఫోన్లను చైనా షాంఘైలోని పెగట్రాన్ కార్పొరేషన్ అసెంబ్లింగ్ ప్రక్రియ ద్వారా రూపొందిస్తుంది. ఈ వ్యవహారమంతా అత్యంత పకడ్బందీగా, రహస్యంగా సాగుతుంది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

90 ఫుట్బాల్ మైదానాలు పట్టేంత వైశాల్యంలో, 50 వేలమంది సిబ్బంది సైనిక క్రమశిక్షణను పాటిస్తూ .. పనిచేసే భారీ కర్మాగారమిది. గులాబీ రంగు జాకెట్లు, తలపై నీలిరంగు టోపీ, ప్లాస్టిక్ చెప్పులు వేసుకోవాల్సిందే.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఐఫోన్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి విషయాలు బయటికి పొక్కకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అధునాతన గుర్తింపు వ్యవస్థ .. ఉద్యోగికి సంబంధించిన ప్రతి సెకనునూ లెక్కిస్తుందని కర్మాగారం చీఫ్ జాన్ష్యూ పేర్కొన్నారు.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఇంతకాలం అత్యంత రహస్య కర్మాగారంగా పేరొందిన ఇక్కడ ఏం జరుగుతోందో బయటికి తెలిసేది కాదు. ఇటీవలి కాలంలో ఉద్యోగుల పనివేళలకు సంబంధించిన వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో తొలిసారిగా పాశ్చాత్య మీడియాను లోపలికి అనుమతించారు.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

దీంతో ఇది ఆపిల్ ఫ్యాక్టరీ అని ఇక్కడ నుంచి ఐ ఫోన్ కి సంబంధించి అనేక రకాల పార్టులు తయారవుతాయని బయటి ప్రపంచానికి తెలిసింది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఇక ది గ్రేట్ అని చెప్పుకునే యాపిల్ ఫోన్లో రకరకాల పార్టులు అనేక దేశాల్లో తయారవుతాయి. చైనా మాత్రమే కాదు ... జపాన్, యూకే, జర్మనీ, తైవాన్, దక్షిణ కొరియా - లాంటివన్నీ ఈ లిస్టులో ఉన్నాయి.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

మొత్తం మీద యాపిల్ కు ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల్లో 60 ఫోన్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ప్రముఖ నాన్ - ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (లాభాపేక్ష లేని సంస్థ) 'లేబర్ వాచ్' చైనాలోని యాపిల్ చవక ధర ఐఫోన్ తయారీ యూనిట్ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం విదితమే.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఈ యూనిట్లో పనిచేస్తున్న కార్మికులకు మెరుగైన వసతులను కల్పించటంతో యాజమాన్యం తీవ్రంగా విఫలమైందంటూ లేబర్ వాచ్ మండిపడింది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

కేవలం 30 నిమిషాల విశ్రాంతితో షిఫ్టుకు 12 గంటల చొప్పున రోజుకు 24 గంటల పాటు కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు లేబర్ వాచ్ ఆరోపించింది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

యాపిల్ చవక ధర ఐఫోన్లు తయారవుతున్న షాంఘై సమీపంలోని వుక్సీ (ఉక్షి) ప్లాంట్లోని పలు దృశ్యాలను చైనా లేబర్ వాచ్ బహిర్గతం చేయటం జరిగింది.మీరు చూస్తున్నది ఆ ఫోటోలే

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

ఈ ఫోటో చూశారా.. ఇందులో చిరునవ్వులు చిందిస్తున్నది యాపిల్ కంపెనీ సిఇవో టిమ్ కుక్. చైనాలోని ఫాక్స్ కాన్ కంపెనీలో తమ ఐఫోన్ సిక్స్ తయారీని పర్యవేక్షిస్తూ పరవశిస్తున్న సీన్ ఇది.

షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write inside one of the worlds most secretive iphone factories
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot