ఎప్పటికీ మరచిపోలేని ఇండియన్ లెజెండ్స్

Written By:

ఇండియా ప్రయోగాలకు ఓ పెట్టని కోట.. ఈ మట్టి మీద దొరికే ప్రతి వస్తువు ఏదో ఓ ప్రయోగానికి పనికివచ్చేదే. ఈ మట్టి మీద ఎందరో మహానుభావులు తమ ప్రయోగాలతో ప్రపంచానికి సరికొత్త వెలుగును ప్రసాదించారు. వారి కనుగొన్న ఆవిష్కరణలు ఇప్పుడు యావత్ ప్రపంచానికి దిక్సూచీలుగా మారాయి. అలాంటి మహనీయులును ఓ సారి స్మరించుకుంటూ వారి ఆవిష్కరణలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

Read more: మొదటి రాకెట్ టిప్పు సుల్తాన్‌దే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Prafulla Chandra Ray

1

ప్రముఖ విద్యావేత్త అలాగే గొప్ప కెమిస్ట్, బెంగాలి కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఫౌండర్. ఇది దేశంలోని తొలి పార్మాస్యూటికల్ కంపెనీ

Salim Ali

2

పక్షి ప్రేమికుడు ప్రకృతిని అమితంగా ఆరాధించే గొప్ప ప్రకృతి వేత్త. ఈ మహనీయునికి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా ఉంది. అలాగే పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు. భారతదేశంలో పక్షి శాస్త్రం గురించిన అవగాహన పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు.

Srinivasa Ramanujan

3

లెక్కల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న గొప్ప గణిత వేత్త. మ్యాధ్స్ మీద ఎన్నో పరిశోధనలు చేసిన యోధుడు

C. V. Raman

4

ఫిజిక్స్ ప్రపంచాన్ని ఏలిన గొప్ప శాస్ర్తవేత్త. రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతంతో ప్రపంచానికి వెలుగులను పంచిన ధీరుడు. దీనికి 1930లో నోబెల్ అవార్డ్ కూడా వరించింది.

Homi Jehangir Bhabha

5

ఇండియన్ ఆటోమిక్ ఎనర్జీ ప్రోగ్రామ్ చీప్ ఆర్కిటెక్ . భౌతిక శాస్రవేత్త . భారత అణుశక్తి రంగానికి పితామహుడుగా ఈ యోధుడునే చెబుతారు.

Jagadish Chandra Bose

6

భౌతిక శాస్ర్తవేత్త. అలాగే ఆర్కియాలజిస్ట్. రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.ఈ యోధుడిని రేడియో విజ్ఞానంలో పితామహునిగా చెబుతారు.

Satyendra Nath Bose

7

సత్యేంద్రనాథ్ బోస్ జనవరి 1,1894 న కలకత్తా లో జన్మించారు. ఇతడు భారత దేశ భౌతిక శాస్త్రవేత్త. ఇతడు 1920 లలో క్వాంటం మెకానిక్స్ లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ మరియు బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణ కృషికి గుర్తింపు పొందాడు. ఆయన భారత దేశం లో రెండవ అత్యున్నత అవార్డు అయిన పద్మ విభూషణ ను 1954 లో కైవసం చేసుకున్నాడు.

A.P.J. Abdul Kalam

8

ఇండియా అణు రంగంలో దూసుకుపోతుందంటే కారణం ఈ యోధుడి వల్లనే. క్షిపణులను అభివృధ్ధి చేసి ప్రపంచం పటంలో భారత రూపురేఖలను మార్చివేశారు.

Har Gobind Khorana

9

బయో కెమిస్ట్రిలో నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్ర్తవేత్త. జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసిన గొప్ప శాస్రతవేత్త.

S.S. Abhyankar

10

గణిత శాస్ర్తవేత్త, బీజాగణితం మీద ప్రయోగాలు చేసి సంచలనాలు నమోదు చేసిన శాస్రతవేత్త.

Meghnad Saha

11

గొప్ప మేధావి. భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.

Subrahmanyan Chandrasekhar

12

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983లో నోబెల్ ప్రైజ్ పొందిన అపర మేధావి.

Raj Reddy

13

కంప్యూటర్ రంగాన్ని ఏలిని కంప్యూటర్ మేధావి. కృత్రిమ మేధస్సు విధానాల రూపకర్తగా ఈ యోధుడిని చెబుతుంటారు. టూరింగ్ అవార్డు గ్రహీతఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం నందు ఇచ్చే అత్యున్నత అవార్డు. గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు మరియు కార్నిగీ విశ్వవిద్యాలయాలలో సేవలను అందిస్తున్నాడు..రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు.

Birbal Sahni

14

బీర్బల్ సహాని భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష , గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రం లో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీం ఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ అనే చెప్పాలి.

Prasanta Chandra Mahalanobis

15

సంఖ్యా శాస్ర్త నిపుణులు, అలాగే భౌతిక శాస్ర్తవేత్త, ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్ స్టిట్యూట్ ను స్థాపించి అమూల్యమైన సేవలను అందించిన శాస్ర్తవేత్త.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 Famous Indian Scientists and their Inventions
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting