క్రికెట్ ప్రపంచంలో కళ్లు చెమర్చే కన్నీటి జ్ఙాపకాలు

|

క్రికెట్ ప్రపంచంలో మరపురాని ఎన్నో గుర్తులు ఉన్నాయి. అవి ఓ తీపి జ్ఙాపకాలు క్రికెట్ ఉన్నంత కాలం చరిత్రలో నిలిచిపోతాయి. క్రికెట్ లేకపోయినా ఆ గుర్తులు మాత్రం పదిలంగా ఉంటాయి. ఆఫోటోలను చూసినప్పుడల్లా గుండెల నిండా సంతోషం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తిరిగిరాని మరచిపోలేని గుర్తులను కొన్నింటిని మీకందిస్తున్నాం చూసి మీరే చెప్పండి. అవి తీపిగుర్తులా లేక చెదిరిపోని జ్ఙాపకాలా అన్నది..

 

Read more: మార్క్ జుకర్ బర్గ్ కొత్త ఇల్లు ఎలా ఉంటుందంటే..?

1

1

ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ తన చివరి వీడ్కోలు సమయంలో అభిమానులు కోలాహాలం. ముంబై వాంఖేడే స్డేడియంలో వెస్టీండీస్ తో సచిన్ చివరి మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు.

2

2

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పాకిస్తాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టి ఇండియాకు విజయాన్ని అందించిన తీపి జ్ఙాపకం. అది వరల్డ్ రికార్డుగా నమోదైంది.

3

3

సునామి దెబ్బకు శిధిలమూ రోదించిన శ్రీలంకలోని గల్లే స్టేడియం. సునామి తరువాత అది స్టేడియం రూపురేఖలనే కోల్పోయింది.

4
 

4

2007 టీ 20 వరల్డ్ కప్ సంధర్భంగా ఇంగ్లండ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది ఇంగ్లండ్ కు చుక్కలు చూపించారు. బలైన ఇంగ్లండ్ బౌలర్. సువర్ట్ బ్రాడ్. దీనిపై ఫ్లింటాప్ వాగ్విదానికి కూడా దిగారు.

5

5

ఇండియా 1983లో తొలిసారిగా ప్రపంచకప్ గెలిచిన ఆనందపు క్షణాలు. ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్ జిమ్మి అమర్ నాద్ వెస్ట్ండీస్ బ్యాట్స్ మెన్ మైకెల్ హోల్డింగ్ ను చివరి వికెట్ గా వెనక్కి పంపారు.

6

6

లార్డ్స్ ఇంగ్లండ్ పై విజయం సాధించిన ఆనందంలో దాదా ఇలా తన జెర్సీని విప్పి ఫ్లింటాప్ కు తగిన బుద్ది చెప్పారు. అంతకు ముందు 7 నెలల క్రితం ముంబై వాంఖేడే స్టేడియంలో ఫ్లింటాప్ ఇండియాపై విజయం సాధించిన అనంతరం ఇలా జెర్సీ విప్పి గంతులు వేశాడు

7

7

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ సంధర్భంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో తేనెటీగలు హల్ చల్ చేయడంతో ప్లేయర్లు ఇలా తమను తాము రక్షించుకున్నారు.

8

8

వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విసిరిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించింది. ఇదే వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. 434 పరుగుల లక్ష్యాన్ని ఒక ఓవర్ ఉండగానే దక్షిణాఫ్రికా చేధించింది.

9

9

1938లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మధ్యలో టీ బ్రేక్. చాలా చిత్రంగా అనిపించింది అందరికీ

10

10

లార్ట్ మైదానం 200 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా 22 మంది క్రికెట్ యోధులు అక్కడ మ్యాచ్ ఆడారు. సచిన్ ఓ టీమ్ కి కెప్టెన్ కాగా మరో టీంకి షేన్ వార్న్ కెప్టెన్ గా వ్యవహరించారు. అప్పుడు దిగిన సెల్ఫీ

11

11

మ్యాచ్ ఆడే సమయంలో టీమ్ స్కోరు 111 కి వచ్చినప్పుడు అంపైర్ డేవిడ్ షెపర్డ్ ఇలా మూడు మూడు విధాలుగా దర్శనమిస్తారు. ఓ కాలి తో పైకి లేచి జంప్ చేస్తారు.

12

12

క్రికెట్ ఆడుతూ బాల్ తగిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిన హ్యూగ్స్ కు తన సెంచరీని అంకితమిచ్చిన స్టీవ్ స్మిత్. ఇది అందర్నీ కంటతడి పెట్టించింది.

13

13

న్యూజిలాండ్ ఒక బంతికి ఆరు పరుగులు కొట్టాల్సిన సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ ట్రెవర్ ఛాపెల్ బంతిని ఇలా కిందకు విసిరి వారిని వెక్కిరించినంత పనిచేశారు. ఇది 1981లో జరిగింది. ఆస్ట్రేలియా అహంకారానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం.

14

14

క్రికెట్ లెజెండ్ బ్రాడ్ మన్ తన ఫైనల్ ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యారు. 4 పరుగులు చేసి ఉంటే అతని యావరేజ్ 100కి చేరుకునేది. డకౌట్ తో తన ప్రస్థానాన్ని ముగించారు.

15

15

1999 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో చేతులారా మ్యాచ్ ని ఆస్ట్రేలియాకు అప్పగించింది దక్షిణాఫ్రికా. ఇది అనుకోని సంఘటన. క్లూసెనర్ మాటలు వినని డోనాల్డ్ రనౌట్ అయి ఆస్ట్రేలియాను ఫైనల్ కి చేర్చారు. ఇది సౌతాఫ్రికాను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

16

16

చిన్న వివాదంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ జావెద్ మియాందాద్ బౌలర్ డెన్నిస్ లిల్లీపై తన బ్యాట్ ను ఎత్తాడు. డెన్నిస్ లిల్లీ బౌలింగ్ చేస్తున్న సమయంలో జరిగిన వివాదానికి పాక్ క్రికెటర్ మియాందాద్ ఇలా తన విశ్వరూపాన్ని చూపారు.

17

17

ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ తన బౌలింగ్ లో ఫీల్డింగ్ ను ఇలా పెట్టారు. 9 మంది ప్లేయర్లను స్లిప్ లో మొహరించారు. ఈ అరుదైన ఘటన 1977లో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగింది.

18

18

1999లో హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మళ్లీ అదే సీన్ రిపీట్ చేసింది. ఇది చూసేందుకు చాలా ఫన్నీగా అనిపించింది. అలా ఫీల్డింగ్ పెట్టడం ఇప్పట్లో సాధ్యవుతుందా మరి.

19

19

2004లో ఇంగ్లండ్ పై ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి సంచలనం సృష్టించిన వెస్ట్ండీస్ బ్యాట్స్ మెన్ బ్రయాన్ లారా ఆనందం. ఇలా మైదానాన్ని ముద్దాడి తన అభిమానాన్ని చాటుకున్నారు.

20

20

1992 వరల్డ్ కప్ లో సూపర్ మ్యాన్ జాంటీ రోడ్స్ ఇలా డైవ్ చేస్తూ ఇంజమామ్ ఉల్ హక్ ను రనౌట్ చేశారు. ఆ రనౌట్ ను తలుచుకున్నప్పుడల్లా అందరూ షాకింగ్ కు గురవతారు ఇప్పటికీ.

21

21

ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ తన చివరి మ్యాచ్ సంధర్భంగా క్రికెట్ కు వీడ్కోలు చెబుతూ ఇలా మైదానాన్ని తడిమారు. అది అందర్నీ ఎంతో విషాదంలో ముంచింది అప్పుడు.

22

22

సచిన్ కెప్టెన్ గా ఉన్న ఎమ్ సీసీ టీంలో యువరాజ్ బ్యాటింగ్ కు దిగుతూ ఇలా తన దేవుడి కాళ్లకు నమస్కరించాడు. ఇదో అద్భుతమైన సీన్

23

23

ఇండియా 2011 ప్రపంచకప్ గెలిచిన ఆనందం. 100 కోట్ల మంది ఆశలను నెరవేర్చిన క్షణం. ఇప్పటికీ మదిలో ఓ చెదరని గుర్తులా మిగిలింది.

24

24

గుండప్ప విశ్వనాధ్ సెంచరీ చేసిన సమయంలో ఆయన్ని బేబి అంటూ ఎత్తుకున్న ప్రత్యర్థి టోని గ్రెగ్ . ఇది టీమ్ స్పిరిట్ ను మరింత పెంచింది.

25

25

లిటిల్ మాస్టర్ 100వ సెంచరీ సమయంలో మాస్టర్ ఆనందం

26

26

1976లో లార్ట్స్ లో ఫస్ట్ వుమెన్స్ వన్డ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఫోటో.

27

27

ఇండియన్ ఫీల్డర్ ఏకనాధ్ సోల్కర్ అత్యధ్బుతమైన క్యాచ్. 1971లో అలెన్ క్నాట్ కొట్టిన బంతిని ఇలా డైవ్ చేస్తూ చేజిక్కించుకున్నారు. ఇది అత్యుత్తమ ఫీల్డింగ్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిస్తుంది.

28

28

క్రికెట్ లో దేవుళ్లుగా కీర్తింపబడుతున్న ఇద్దరు లెజెండ్స్ ఇలా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది. సర్ డాన్ బ్రాడ్ మాన్ విగ్రహం వద్ద లిటిల్ మాస్టర్ ఉన్నప్పుడు క్లిక్ మన్న చిత్రం.

29

29

టెర్రరిస్ట్ ల అటాక్ తో బిత్తర పోయిన శ్రీలంక క్రికెట్ టీం ఇలా హెలికాప్టర్ వైపు పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకుంది. చాలామంది ప్లేయర్లు గాయాల పాలయ్యారు కూడా. ఇది 2009లో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగింది.

30

30

2002 లో జరిగిన ఓ మ్యాచ్ లో స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన దవడకు గాయం అయినా లెక్క చేయకుండా వరుసగా 14 ఓవర్లు బౌలింగ్ చేసి గేమ్ స్పిరిట్ ని చాటుకున్నారు. ఇప్పట్లో ఇది ఎవరైనా చేయాలంటే హడలి చస్తారు.

Best Mobiles in India

English summary
Here Write 30 Iconic Photos Every Cricket Fan Should See

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X