రూ. 59 వేల కోట్ల డీల్ : దుమ్ము రేపనున్న రఫాలే

Written By:

అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫాలే జెట్ ఫైటర్స్ ఇండియా అమ్ములపొదిలోకి రానున్నాయి. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ ఒప్పందం ఎట్టకేలకు ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ 59 వేల కోట్ల రూపాయలకు ఈ డీల్ కుదిరినట్లు బిజెపి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే దీని ద్వారా రూ. 21 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్లు కూడా వెల్లడించింది. అయితే దీనిపై ఇప్పుడు అనేక విమర్శలు మొదలవుతున్నాయి.

Read more: ఆర్యభట్టకు 41 వసంతాలు: గుర్తు చేసుకోవాల్సిన నిజాలెన్నో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఫ్రాన్స్ నుంచి రఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నట్టు బీజేపీ తన అధికారిక ఫేస్ బుక్‌ఖాతాలో వెల్లడించింది. 8.8 బిలియన్ డాలర్లు(రూ.59,000 కోట్లు) కు డీల్ కుదిరిందని తెలిపింది.

2

తాజా ఒప్పందంతో ప్రభుత్వానికి 3.2బిలియన్ డాలర్లు(రూ.21,000 కోట్లు) ఆదా అయినట్లు వెల్లడించింది. గతంలో 12బిలియన్ డాలర్లు(రూ.80,000 కోట్లు) కు రఫెల్ ఒప్పందం కుదిరింది.

3

ఈ ఒప్పందం తరువాత ఇరు దేశాల మధ్య అనేకసార్లు బేరసారాలు జరిగాయి. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 3.2బిలియన్ కోట్లు ఆదా అయినట్లు బీజేపీ తెలిపింది.

4

రక్షణ శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ మాట్లాడుతూ.. 36 జెట్ విమానాల కొనుగోలుకు మార్గం సుగమమైందని త్వరలోనే ఈ ప్రతిపాదన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్పిల్(డాక్) ముందుకు వెళ్లనుందని తెలిపారు.

5

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విమానాలను కొనుగోలు చేయాలనే ఒప్పందం (ఎంఓయూ) ఈ ఏడాది ప్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకొయిస్ హోలండ్ భారత పర్యటనలో ఉండగానే ఖరారైంది.

6

కాగా బీజేపీ వెల్లడించిన కొనుగోలు ఒప్పందం సంఖ్యలతో రక్షణ శాఖ విభేదించడం కొసమెరుపు. మరోవైపు విమానాల కొనుగోలు వివరాలను బీజేపీ ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

7

డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న 'రఫాలే' అనేది రెండు ఇంజన్ల డెల్టా వింగ్ మల్టీ రోల్ జెట్ ఫైటర్ విమానం. దీన్ని భూతలంతో పాటు సముద్రం నుంచి చేసే యుద్ధాలకు కూడా ఉపయోగించొచ్చు.

8

ఫ్రెంచి వైమానిక దళంతో పాటు అక్కడి నావికాదళం కూడా వీటిని ఉపయోగిస్తోంది. రఫాల్‌లో థేల్స్ ఆర్‌బీఈ2 పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ మల్టీ మోడ్ రాడార్ ఉంటుంది. ఇది గాల్లోంచి వచ్చే ప్రమాదాలను గుర్తించడంతో పాటు దూరశ్రేణి ప్రమాదాలనూ పసిగడుతుంది.

9

భూతలం మీద కనపడే లక్ష్యాలను అత్యధిక రిజల్యూషన్‌తో మ్యాప్‌లుగా అప్పటికప్పుడు సిద్ధంచేసి పైలట్లకు అందిస్తుంది. వీటి వేగం గంటకు 2130 కిలోమీటర్లు. రేంజ్ 3700 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

10

సోవియట్ యూనియన్ కాలం నాటి భారత ఆయుధాలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా ఇండియా ఎప్పటి నుంచో అత్యాధునిక యుద్ధ విమానాల కోసం కసరత్తులు చేస్తోంది. 

11

ఇక ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే.

12

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write advanced hi tech Rafale fighter jets deal finalised at $8.8 billion
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot