ఆర్యభట్టకు 41 వసంతాలు: గుర్తు చేసుకోవాల్సిన నిజాలెన్నో..

Written By:

ఇతర దేశాలు అసూయపడేలా భారతజాతి గర్వించేలా నేటికి నాటికీ మన దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పినది సరిగ్గా ఇదే రోజు. 1975 ఏప్రిల్ 19న తగిన నిధులు ,సరైన వనరులు లేని రోజుల్లో ఆర్యభట్ట ఉపగ్రహానికి ఊపిరిపోసి తన సాంకేతిక ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది ఇండియా. ఇస్రోను ఏర్పాటు చేసిన ఆరేళ్లకే మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించారు. నేటికి 41 వసంతాలు పూర్తి చేసుకున్న ఇస్రో కలికితురాయి ఆర్యభట్ట గురించి మీకు అలాగే ప్రపంచానికి తెలియని నిజాలు ఇస్తున్నాం. ఓ సారి చూడండి.

Read more : ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ శాటిలైట్ కి పేరును ఇండియా ప్రప్రధమ మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పెట్టారు. 5వ శతాబ్దంలోని ఇండియా ఖగోళ శాస్త్రవేత్త, అలాగే గణిత మేధావి అయిన ఆర్యభట్ట పేరు మీద ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేశారు.

2

360 కిలోగ్రాములు బరువు ఉండే ఈ శాటిలైట్ ను అప్పటి సోవియట్ యూనియన్ రష్యా సహాకారంతో దీన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా)లోని కాప్స్టున్ యర్Kapustin Year) లోని అంతరిక్ష వాహన ప్రయోగ కేంద్రం నుండి ,కాస్మోస్ -3Mఅనే ఉపగ్రహ వాహాక రాకెట్ సహాయంతో, 1975 వ సంవత్సరం, ఏప్రిల్ 19వ తేదిన విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు

3

ఈ ఉపగ్రహ ప్రయోగం నిమిత్తమై ఇండియా,సోవియట్ యూనియన్ మధ్య U.R ,రావు గారి సారధ్యంలో 1972 లో అంగీకారం కుదిరినది.వారు ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతి ఫలంగా సోవియట్ యూనియన్ వారు భారతదేశం రేవుల నుండి,ఓడల మరియు లాచింగ్ వాహనాల మార్గాలను జాడలుపట్టుటకు/ ట్రాక్(track) చెసేందుకు వారికి అనుమతి ఇవ్వడమైంది

4

ఈ శాటిలైట్ కి సంబంధించిన డేటా రీసివింగ్ సెంటర్ బెంగుళూరులో ఏర్పాటుచేశారు. టాయిలెట్ రూంని డేటా రిసీవింగ్ సెంటర్ గా మార్చారు అప్పట్లో.

5

ప్రయోగించిన నాలుగు రోజుల తరువాత,60 ప్రదక్షణలు పూర్తయిన తరువాత,ఉపగ్రహంలో విద్యుత్తు ఉత్పత్తిలో లోపం వలన, ఈఉపగ్రహం పనిచెయ్యడం మానివేసినది.సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది.

6

ఈ ఉపగ్రహానికి ఫర్నిచర్ ఇతర వస్తువుల కోసం దాదాపు 3 కోట్ల వరకు అంచనా వేశారు. అయితే అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే అయింది.

7

మన దేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఆర్యభట్ట ఉపగ్రహం యెక్క గొప్పతనం కరెన్సీ నోట్ లోకి కూడా ఎక్కింది. 1976 1997 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకు 2 రూపాయల నోట్ పై ఆర్కభట్ట ఉపగ్రహాన్ని ఉంచింది.

8

ఇండియా రష్యా కలిసి ఆర్యభట్ట మీద స్టాంపుని కూడా రీలీజ్ చేశాయి. స్మారక స్టాంపును రష్యా ఇండియా కలిసి ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించిన రోజునే రిలీజ్ చేశాయి.

9

ఈ ఉపగ్రహం రియల్ టైమ్ డేటా ట్రాన్స్ మిషన్ రేటు ఫర్ సెకండ్ కి 256 బిట్స్ . ఇంటర్నల్ టెంపరేచర్ 0 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

10

తిరిగి 17 సంవత్సరాల తరువాత భూ వాతావరణంలోకి ఆర్యభట్ట ప్రవేశించింది. 1992 ఫిబ్రవరి 11న ఇది ప్రవేశించింది.

11

ఖగోళశాస్త్ర ఎక్స్ కిరణాల అధ్యయనం(ray astronomy),భౌతిక, రసాయనిక విధాన అధ్యయనం (aeronautics),సూర్య సంబంధిత విజ్ఞాన అధ్యయనంపై పరీక్షలు నిర్వహించడం
ఈ ఉపగ్రహ ప్రయోగ ఉద్దేశ్యం

12

దీనిని అప్పట్లో ఇలా ఎద్దుల బండి మీద తీసుకెళ్లారు. అప్పట్లో మన రవాణా సాధనాలు ఇవే.  

rn

13

ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో

14

టెక్నాలజీ‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 9 amazing facts you probably didn t know about Aryabhata satellite
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot