మనుషులే లేని ఎడారిలో అబ్బురపరిచే లైన్లు,మిస్టరీని చేధించిన శాస్త్రవేత్తలు

|

పెరూ..దక్షిణ అమెరికాలోని వాయువ్య భాగాన గల దేశం.ఇక్కడ విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక ఆ దేశ ఎడారులను చూస్తే అందరూ ఫిదా అయిపోవాల్సిందే. అందుకే అందరూ ఆ దేశ ఎడారి అందాలు ఆస్వాదించడానికి వెళుతుంటారు. అయితే ఓ ఎడారి మాత్రం మిస్టరీలా ఉంటుంది. అదే పెరువియన్ ఎడారి. ఈ ఎడారినే నాజ్కా అని కూడా పిలుస్తారు. ఆ ఎడారిలో గీతలు రకరకాల ఆకారాల్లో దర్శనమిస్తుంటాయి. అవేంటనేది నిన్నటిదాకా ఎవరికీ తెలియదు. శాస్ర్తవేత్తలు ఇప్పుడు వాటిని చేధించారు అవేంటో మీరే చూడండి.

 

Read more: గూగుల్ ఎర్త్‌లో మిస్టరీగా మారిన ప్రదేశాలు

1

1

పై నుంచి చూస్తే మాత్రం అద్భుతమైన రేఖా చిత్రాలు కనిపిస్తాయి. వాటిని గీస్తే దేవుడైనా గీసుండాలి. లేదా దెయ్యమైనా గీసుండాలి. మనుషుల వల్ల మాత్రం అయ్యేపని కాదు. ఈ మిస్టరీని కళ్లారా చూసేందుకు ఏటా లక్షల మంది టూరిస్టులు దేశదేశాల నుంచి పెరూ మైదానాలకు వస్తుంటారు. మరి ఇవి ఎలా వచ్చాయి అనేది మిస్టరీగానే ఉంది.

2

2

అక్కడ వేల కొద్దీ వంపులు తిరిగిన రేఖలు, త్రికోణాలు, చతురస్రాలు, అనేకానేక జంతువుల రూపాలు అతి పెద్ద పరిమాణంలో చిత్రించి ఉన్నాయి. అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే నేలపై నిలబడి వాటిని ఆకృతులుగా గ్రహించడం కష్టం.

3
 

3

ఎంతో ఎత్తు నుంచి చూడాలి. అవి మామూలు మనుషులు గీసినట్లు లేవు. మామూలు మనుషులు అంతగా గీయడం కూడా కష్టమే. అయితే ఇప్పుడు శాటిలైట్ సహయంతో పెరూ దేశంలోని ఈ పురాతన ఎడారి ప్రాంత మిస్టరీలను, అలాగే పురాతన కట్టడాలను శాస్ర్తవేత్తలు చేధించారు.

4

4

జాగ్రత్తగా గమనిస్తే అవి ఆకుల్లోని ఈనెల్లా అనేక శాఖోపశాఖలుగా పద్ధతి ప్రకారం విస్తరించి ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, గడ్డిని ఒక చోట కుప్పలా పోస్తే గడ్డిపోచలు ఒక దానిపై ఒకటి పడినట్లు కనిపిస్తుంది. కానీ నేల నుంచి చూస్తే ఇవన్నీ చిన్న చిన్న గుంటలుగా, ఎండిపోయిన కాల్వలుగా కనిపిస్తాయి.

5

5

పైగా ఈ ప్రాంతంలో అక్కడికక్కడ పడి ఉన్న నల్లటి రాళ్లను తొలగిస్తే, వాటి కింద ఉన్న తెలుపు, పసుపు రంగులతో కూడిన గీతలు ఇలాంటివే మరి కొన్ని కనిపించాయి. నాజ్కా సరళరేఖల నిడివి దాదాపుగా 8 కిలోమీటర్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు లెక్క వేశారు.

6

6

రేఖలు అక్కడక్కడా వంపులు తిరిగాయి. దాదాపుగా మైలుకు పది అడుగుల వంపు ఉంటోంది! కొన్ని గీతలు ఆకాశం నుంచి చూస్త్తే తిమింగలాలుగా, పక్షులుగా, సాలెపురుగుల్లా కనిపిస్తాయి.మరి ఏమై ఉంటాయనేది మాత్రం చెప్పలేకపోయేవారు.

7

7

ముందే ఎవరో పథకం వేసుకుని, ముందు తరాలవారిని తికమక పెట్టేందుకు చాలా తెలివిగా ఈ పదమూడు వందల చ.కి.మీ కాన్వాసుపై ఒక పద్ధతి ప్రకారం చిత్ర లేఖనాలను రూపొందించారే తప్ప వీటి వెనుక మర్మం అంటూ ఏమీ లేదని ఆధునిక పరిశోధకులు అంటున్నారు.

8

8

ఇంకొందరు శాస్త్రవేత్తలు మరో రకమైన అభిప్రాయం వినిపిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసించిన 'ఇన్కా' జాతివారు ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదన కోసం నడిచినప్పుడు ఇలాంటి తీరైన గీతలు ఏర్పడ్డాయనీ, ఆ నడక భారతీయులు చేసే తపస్సులాంటిది అని అన్నారు.

9

9

మరికొందరు ఈ గీతలు నీటిపారుదల కోసం ఏర్పరచిన కాల్వలని అభిప్రాయపడ్డారు. మరీ ఊహాశాలులైతే ఈ గీతలు, ఇతర గ్రహాలకు చెందిన జీవుల అంతరిక్ష నౌకల రన్ వేలని భావించారు.

10

10

ఈ క్రమంలో 1975 లో జిమ్ ఉడ్మ్యాన్ అనే ఆయన మరికొంత ముందుకు వెళ్లి 'నాజ్కా' ప్రజలకు ఆ కాలంలో అందుబాటులో ఉన్న వస్తువులతో గాలిలో ఎగిరే బెలూన్ తయారు చేశాడు. ఇలా ఎగురుతూ అనాటి ప్రజలు ఈ గీతలు గీశారని ఆయన అభిప్రాయపడ్డారు

11

11

ఇక ఈ ఎడారి ప్రాంతంలో మానవులకు అలాగే జంతువులకు సంబంధించి దాదాపు 900 రేఖాగణిత ఆకారాలను చెక్కారు. ఇలా చెక్కిన ఈ ఆకారాలనే నాజ్కా లైన్స్ అని పిలుస్తారని అయితే ఈ కళా ఖండాలు నాజ్కా నాగరికతనే కాకుండా పురాతన నాగరికతను తెలుపుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

12

12

ఇక ఈ మధ్యన కొందరు శాస్ర్తవేత్తలు ఇవి ఖచ్చితంగా నీటి పారుదలకు సంబంధించినవేనని తేల్చారు. దాదాపు 200 బిసి 600 ఏడి కాలంలో ఈ ప్రాంతమంతా సర్పాల ఆకారంలో,అలాగే రాక్ లైన్ రంధ్రాలతో ఒకప్పుడు కాలువలా ఉండేదని అవన్నీ అండర్ గ్రౌండ్ లో వారు తయారుచేసుకున్నారని అవి ఇప్పుడు ఇలా మనకు దర్శనమిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

13

13

అప్పట్లోనే వారు వాటర్ రిసోర్స్ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడారని ఈ చిత్రాలను చూస్తే వారు ఎంత టెక్నాలజీతో వాటర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో ఇట్టే అర్థమవుతుందని ఈ టీమ్ కి నేతృత్వం వహించిన రోసా లాసాపోనర చెబుతున్నారు.

14

14

భూమి లోపల కాలువలను తవ్వి వాటి ద్వారా నీటి సరఫరాను ఏర్పాటు చేసుకున్నారని కార్క్ స్కూ ఆకారంలో సొరంగాలు అలాగే నీరు అందుబాటులో లేని ప్రదేశాలకు సైతం వీరు కాలువల ద్వారా నీటిని తరలించారని తెలుస్తోంది.

15

15

నాజ్కా ప్రాంతంలో పుక్యోస్ అనేది ముఖ్యమైన హైడ్రోలిక్ ప్రాజెక్ట్. ఇక్కడ సంవత్సరమంతా నీరు పారుతూ ఉంటుంది. ఈ నీటిని కేవలం వ్యవసాయానికే కాకుండా నీటి పారుదలకు అలాగే దేశీయ అవసరాలకు కూడా వినియోగించారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

16

16

వీరు ఎప్పటికీ నీరు తరిగిపోని విధంగా ఆ కాలంలోనే ఇలాంటి వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారని లోయ ప్రాంతాలో సాంద్ర వ్యవసాయానికి ఈ నీరును తరలించారని ప్రపంచంలోనే అన్ని ప్రాంతాలకు ఈ పుక్యోస్ వ్యవస్థ ఉపయోగపడే విధంగా రూపొందించారని దీనిని బట్టి వారి టెక్నాలజీ ఏంటో తెలుసుకోవచ్చన్నారు.

17

17

ఈ పుక్యోస్ వ్యవస్థ లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారని ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడానికి సహకార ,సామాజిక వ్యవస్థ చాలా అధ్భుతంగా పనిచేశాయని అందువల్లనే ఈ నాజ్కా లైన్స్ ఇంత అద్బుతంగా ఇక్కడ దర్శనమిచ్చాయని వారంటున్నారు.

18

18

ఇవి ఖచ్చితంగా నీటికి సంబంధించినవే అయి ఉంటాయని అందులో ఎటువంటి సందేహం లేదని ఈ మ్యాప్ లు అలాగే కాలువలు అవే చూపిస్తున్నాయని శాస్ర్తవేత్తల బృందం తేల్చింది.దీనికి సంబంధించిన పుక్యోస్ వ్యవస్థ పాయింట్ ను అలాగే దాని లోకేషన్ ని కూడా చూపించింది.

19

19

దీనిని బట్టి ఇది నజ్కా నాగరికతకు చెందిన అత్యాధునిక వాటర్ వ్యవస్థ అని ఇది దశాబ్దాల క్రితం ప్రపంచమంతా ఈ లైన్లను వేయాలని బహుశా అప్పుడే తలచారని ఆ దిశగానే వారు మనుగడ సాగించారని ఇది ఒక్క నజ్కా నాగరికతకే సాధ్యం అయిందని ఆ గుర్తులను బట్టి తెలుస్తోంది.

20

20

ఈ లైన్లను చాలా చోట్లనే గుర్తించారు కజకిస్తాన్ లో దాదాపు ఇటువంటి లైన్లు ఓ 50 దాకా గుర్తించారు. అవి అచ్చం పెరూ ఎడారిలో ఉన్న లైన్లను పోలి ఉన్నాయి. దీనిని బట్టే నాజ్కా వ్యవస్థ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.

21

21

ఈ వాదాలు, అభిప్రాయాలు, భావనలు ఎలా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే - ఈ ఆకృతులను ఇంత పెద్ద విస్తీర్ణంలో ఏర్పరచి వేల ఏళ్లు దాటుతున్నా ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం అందర్నీ విస్మాయానికి గురి చేస్తోంది.

22

22

అలాంటిది ఇప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువై ఒక్కో రేఖా రూపుమాసే ప్రమాదం ఏర్పడింది. మిస్టీరియస్ గా బయటపడి, మిస్టరీగా మిగిలిన నాజ్కా లైన్స్. అదృశ్యమైపోతున్న దృశ్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంపైనే గత నవంబర్‌లో ఐక్యరాజ్య సమితి విభాగం ‘యునెస్కో' అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే.

23

23

నాజ్కా గీతలలోని జామెట్రీ సిద్ధాంతాలను పరిశీలిస్తూ జర్మనీ గణిత శాస్త్రజ్ఞురాలు మేరీ రిచీ తన జీవితమంతా అక్కడే గడిపారు! ఆమె అధ్యయనం ప్రకారం ఈ గీతలు 'అంతరిక్ష క్యాలెండర్'లాంటివి. నిశితంగా గమనిస్తే అంతరిక్షంలోని నక్షత్రాల సమూహాలను, వాటి గమనాలను నాజ్కా రేఖలు ప్రదర్శిస్తాయని, సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను, గ్రహగతులను సూచిస్తాయని మేరీ ప్రతిపాదించారు.

25

25

ఏది ఏమైనా నాజ్కా లైన్స్'గా ప్రసిద్ధి చెందిన రేఖాకృతుల ఉనికి వెనుక రహస్యం నేటికీ వీడని ఒక మిస్టరీగానే మిగిలింది. అదేంటనేది శాస్ర్తవేత్తలు కనిపెట్టినా అది ఇంకా మిస్టరీని రేకెత్తిస్తూనే ఉంది. 

Best Mobiles in India

English summary
Here Write Ancient Peruvian Mystery Solved From Space

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X