అణుబాంబు వేయాల్సిందే, వణుకుతున్న అమెరికా, షాక్ వీడియో..

Written By:

నార్త్ కొరియా..అతి చిన్న దేశం..ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధం దిశగా నార్త్ కొరియా పయనిస్తుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అదేంటో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి పెరిగింది. దీనికి సాక్ష్యంగా యూట్యూబ్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. Anonymous గ్రూపు ఒకటి ప్రపంచం మూడవ యుద్ధం దిశగా నడుస్తుందంటూ ఓ వీడియోని విడుదల చేసింది. ఓ ఆసక్తికర కథనం మీ కోసం.

ఆగని Airtel దూకుడు, మళ్లీ సరికొత్త ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆరు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో

ఆరు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో ప్రజలు మూడవ ప్రపంచయుద్ధానికి సిద్ధం కావాలంటూ Anonymous గ్రూపు పిలుపునిస్తోంది. దీన్ని యూట్యూబ్ లో పెట్టడంతో దాన్ని ఇప్పటికే 17లక్షల మందికి పైగా తిలకించారు. ఇప్పటికే 1.5 మిలియన్ మంది ఆ సైటును సబ్ స్రైబ్ చేసుకున్నారు.

అమెరికా ఓ శక్తివంతమైన పోగ్రామ్ మీద ప్రయోగాలు

ఆ వీడియోలో అమెరికా ఓ శక్తివంతమైన పోగ్రామ్ మీద ప్రయోగాలు నిర్వహిస్తుందని తెలిపింది. దానిపేరు Minuteman 3 ICBMగా పేర్కొంది. ఇది నార్త్ కొరియా మీద దాడిచేయడానికేనని ఆ గ్రూపు తెలిపింది. అలాగే జపాన్ కూడా అమెరికా వలలో చిక్కుకోబోతందని కూడా చెప్పింది.

చైనా ఈ దిశగా ప్లాన్ కూడా చేసిందని

ఇదే అసలైన రియల్ వార్ అంటూ ఆ వీడియోలో Anonymous గ్రూపు చెబుతోంది. ఇప్పటికే చైనా ఈ దిశగా ప్లాన్ కూడా చేసిందని, ఇది ఓ పనికిమాలిన చర్య అంటూ పేర్కొంది.

రష్యా అమెరికా ఎప్పటికైనా శత్రువే

రష్యా మీద చైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని, అయితే రష్యా అమెరికా ఎప్పటికైనా శత్రువేనని దానిపై యుద్ధానికి రష్యా ఆసక్ి చూపిస్తోందని ఆ వీడియోలో గ్రూపు తెలిపింది.

అమెరికా మీద దాడి చేయడమే లక్ష్యం

ఇక నార్త్ కొరియా ఎప్పటికైనా అమెరికా మీద దాడి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని కిమ్ జింగ్ మాటలను బట్టి తెలుస్తోంది.

ఏదో ఓ ప్రాంతంలో అణుబాంబు దాడి

ఇందుకు ఊతంగా ఏదో ఓ ప్రాంతంలో అణుబాంబు దాడి చేయాల్సిందేనని కిమ్ నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్తలతో అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి.

అణుబాంబుల సంఖ్యను

తమ వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యను నానాటికీ పెంచుకుంటున్న ఉత్తర కొరియా, అణు యుద్ధానికి దింగేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు.

ఎక్కడో ఓ చోట

ప్రపంచంలోని ఎక్కడో ఓ చోట అణుబాంబును ప్రయోగించేందుకు ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడని అమెరికా పసిఫిక్ అడ్మిరల్ హ్యారీ హర్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని గ్రూపు కూడా పరోక్షంగా తెలిపింది.

అమెరికా తదితర దేశాల హెచ్చరికలను

తమకెదురయ్యే ఈ విపత్తు నుంచి తట్టుకునేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, అమెరికా తదితర దేశాల హెచ్చరికలను సైతం పక్కనబెట్టిన కిమ్, ఈ వారం ప్రారంభంలో సరికొత్త ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిశీలించి ప్రపంచ ఆందోళనను మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.

Anonymous చెప్పినట్లు

మరి Anonymous చెప్పినట్లు మూడవ ప్రపంచ యుద్దం దిశగా ప్రపంచం కదులుతుందా లేదా అన్నది ముందు ముందు తెలియాల్సిందే.

యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో

వీరు యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ఇదే. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Anonymous publishes chilling video warning people to 'prepare' for World War 3 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot