ఆగని Airtel దూకుడు, మళ్లీ సరికొత్త ఆఫర్లు, పైసా ఖర్చు లేకుండా..

Written By:

ఎయిర్‌టెల్ ఆఫర్ల దూకుడు ఆగడం లేదు. నిన్నటిదాకా మొబైల్ యూజర్ల కోసం సరికొత్త డేటా ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు బ్రాడ్‌బాండ్ సర్వీసులను ఆఫర్లతో హోరెత్తిస్తోంది. జియో ఫైబర్ సర్వీసులు ప్రారంభించడానికి ముందే, ఎయిర్‌టెల్ తన బ్రాడ్ బ్యాండు సర్వీసుల్లో హై-స్పీడు డేటా ప్రయోజనాలను 100శాతం రెట్టింపు చేయడం ప్రారంభించింది. కష్టమర్లు జియోకి మరలకుండా డేటా ఆఫర్లను అందిస్తోంది.

BSNL అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

899 రూపాయల ప్లాన్

899 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్న 30జీబీ హైస్పీడ్ డేటాను, 60జీబీకి పెంచింది.

రూ.1099 ప్లాన్

అదేవిధంగా రూ.1099 ప్లాన్ కింద ఆఫర్ చేసే 50జీబీ డేటాను ప్రస్తుతం 90జీబీకి పెంచుతున్నట్టు ప్రకటించింది.

1299 రూపాయల ప్లాన్

1299 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 75జీబీ డేటాను 125జీబీకి పెంచింది.

1499 రూపాయల ప్లాన్

1499 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 100జీబీ డేటాను 160జీబీకి పెంచుతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.

అన్ని ప్లాన్స్ కింద

ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సిటీలోనూ ఈ డేటా ప్రయోజనాల ఇంక్రిమెంట్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. అన్ని ప్లాన్స్ కింద ఏ నెట్ వర్క్ కైనా, అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది.

కొత్త కస్టమర్లు

ప్రస్తుతం బిల్ సైకిల్ నుంచి ఇప్పటికే తమ నెట్ వర్క్ పై ఉన్న కస్టమర్లు ఆటోమేటిక్ గా కొత్త ప్రయోజనాలోకి మారతారని తెలిపింది. కొత్త కస్టమర్లు డేటా ప్రయోజనాలు బట్టి డేటా ప్లాన్స్ ను ఎంపికచేసుకోవచ్చని చెప్పింది.

వీఫైబర్ తో హోమ్స్ కు 100 ఎంబీపీఎస్ స్పీడు

ఫ్యూచర్ రెడీ నెట్ వర్క్ ను ఎయిర్ టెల్ రూపొందించిందని, ఇందులో భాగంగానే వీ-ఫైబర్ ను లాంచ్ చేసిందని తెలిపింది. వీఫైబర్ తో హోమ్స్ కు 100 ఎంబీపీఎస్ స్పీడు వరకు సూపర్ ఫాస్ట్ బ్రాడ్ బాండ్ సర్వీసులను అందిస్తున్నట్టు పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel to offer up to 100% more data to broadband users read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot