ఉత్తర కొరియాకు మరోసారి పరాభవం

Written By:

ప్రపంచ దేశాలకు తమ ప్రయోగాలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఉత్తర కొరియా మరోసారి పరాజయం పాలైంది. మా దగ్గర క్షిపణులు ఉన్నాయని వాటిని ప్రయోగిస్తే ప్రపంచమే నాశనం అవుతుందని చెప్పిన మాటలన్నీ వట్టి మాటలేనని తేలిపోయాయి. క్షిపణి పరీక్షలు ఆ దేశానికి పీడకలనే మిగుల్చుతున్నాయి. సంచలనం రేపుతున్న కథనం ఇదే.

Read more: నార్త్ కొరియా గురించి కొన్ని విచిత్రమైన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. రెండు అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి అవి ఫెయిల్ అవ్వడంతో భంగపాటు ఎదురైంది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఉత్తర కొరియా ఉదయం 5.20గంటల ప్రాంతంలో ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు విఫలమయ్యాయని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. అవి మధ్యలోనే పేలిపోయాయని అధికారులు చెబుతున్నారు.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఇక తమ వద్ద జపాన్ లోని ఏ ప్రాంతంనైనా.. అలాగే అమెరికాలోని ఏ ప్రాంతంనైనా ధ్వంసం చేయగల ముసుదాన్ అణుక్షిపణులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా వాటి పరీక్షల్లో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేదు.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

దాదాపు 20 నుంచి 30 ముసుదాన్ క్షిపణులు ఉత్తర కొరియా వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా చెబుతుంది. అయితే, వీటి సామర్థ్యం విషయంలో మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. గత నెలలో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఇవి విఫలం అయ్యాయి.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఉత్తర కొరియా గత జనవరిలో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పటి నుంచి ఈశాన్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆ దేశంలో శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు, వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాల ఆందోళనలను బేఖాతరు చేస్తోంది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఇప్పటికే ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తుందని తెలిసి జపాన్ కూడా అప్రమత్తమైంది. తమ సరిహద్దులో ఒక్క మిసైల్ పడిన దానికి తగిన బుద్ధి చెప్పాలని తమ సైన్యానికి ఆదేశించింది. అయితే తాజా ప్రయోగం తర్వాత అలాంటిదేం ఇప్పటి వరకు జరగలేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఉత్తర కొరియా తన అణుపరీక్షలను వదిలేసి ఆలోచనే చేసేందుకు సుముఖంగా లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ మరోసారి స్పష్టం చేసింది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఇదిలా ఉంటే దక్షిణ కొరియా తమ నుంచి ప్రతీకార దాడులను ఎదుర్కోక తప్పదని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా గస్తీ నౌక ఒకటి తమ జలాల్లోకి ప్రవేశించిందన్న కారణంతో దక్షిణ కొరియా హెచ్చరికల కాల్పులు జరిపడాన్ని ఆ దేశం సీరియస్‌గా తీసుకుంది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

దీంతో ఎల్లో సముద్రంలోని తమ ప్రాదేశిక జలాల్లోకి 0.001 మిల్లీ మీటర్ ప్రవేశించినా నేరుగా నౌకల మీద కాల్పులు జరుపుతామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) తెలిపింది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

హెచ్చరికల కాల్పులు జరిపిన దక్షిణ కొరియా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఉత్తర కొరియా డిమాండ్ చేసినట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. అవసరమైతే యుద్దనౌకలపై దాడికీ వెనుకాడబోమని నార్త్ కొరియా హెచ్చరించింది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

సరిహద్దుల్లోని ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇటీవల సైనికాధికారుల స్థాయి చర్చలు జరపాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉంగ్ చేసిన ప్రతిపాదనను దక్షిణ కొరియా తిరస్కరించింది.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

న్యూక్లియర్ వెపన్స్ విషయంలో నియమాలకు కట్టుబడితేనే ఉత్తరకొరియాతో చర్చలు అంటూ దక్షిణ కొరియా తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా హెచ్చరికల కాల్పుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

ఉత్తర కొరియా ఇప్పటికైనా అణు పరీక్షల ప్రయోగాలను ఆపి చర్చలకు సై అంటుందా లేదా అన్నది ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం కొరకు

ప్రపంచాన్ని వణికిస్తున్న నార్త్ కొరియా లోపలి నిజాలు

ఉత్తర కొరియా మరోసారి పరాభవం

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Attempted North Korea missile launch fails South Korea
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot