Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్‌డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
CM: ఆ సీఎం సీరియస్ అయితే ఆ కిక్కేవేరప్ప, వారంలో సినిమా గ్యారెంటి, అమ్మాయిలతో గేమ్స్ ఆడితే ?
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్‌మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రపంచానికి తెలియని చైనా రహస్య ప్రాజెక్ట్, సముద్ర తలంపై..
అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ముందుండే చైనా మరో కొత్త ప్రయోగానికి తెరలేపింది. ఏకంగా సముద్రంపైనే తన పట్టును బిగించేందుకు పావులు కదుపుతోంది. సముద్రతలంపై నెంబర్ వన్ గా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేస్తోంది. ఇప్పటికే చైనా సముద్రంలో నిఘాను పటిష్ఠం చేసిన చైనా, సౌత్ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇప్పుడు నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాలతో మిగతా దేశాలక దడ పుట్టిస్తోంది. మిగతా కథనం స్లైడర్‌లో..
Read more: సముద్ర గర్భంలో చైనా దాచిన నిజాలు

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
ఇటీవల నిర్మించిన కృత్రిమ ద్వీపంపై విద్యుత్ అవసరాల కోసం సముద్ర జలాలపై నడిచే అణువిద్యుత్ కేంద్రాలను నిర్మించే పనిలో పడింది. అన్ని రాడార్ వ్యవస్థలు, లైట్హౌస్లు, సైనిక శిబిరాలు, నౌకాశ్రయాలు, వైమానిక స్థావరాలు సహా సకల సదుపాయాలతో కృత్రిమ ద్వీప సమూహాన్ని చైనా నిర్మించేందుకు పావులు కదుపుతోంది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
అయితే దీనికి భారీ ఎత్తున విద్యుత్ అవసరం కావడం, అదీగాక సదరు సముద్ర ప్రాంతం చైనా పవర్ గ్రిడ్‌కు వందల మైళ్ల దూరంలో ఉండడంతో విద్యుత్ సరఫరా కష్టంగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే చైనా వినూత్నంగా ఆలోచించింది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
ఏకంగా సముద్రజలాలపై తేలియాడుతూ తిరిగే అణువిద్యుత్ కేంద్రాలకు రూపకల్పన చేసింది. చైనా ప్రభుత్వ సారథ్యంలోని 'చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరే షన్' సంస్థ వీటిని నిర్మించేందుకు సన్నద్ధమైంది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
వీటి ద్వారా సముద్రంలోని చమురు కర్మాగారాలు, మానవ నిర్మిత ద్వీపాలు వంటి మారుమూల ప్రాంతాల కోసం విద్యుత్ అందించనున్నట్టు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ తో వివిధ ఒప్పందాలు చేసుకున్న చైనా, ఆసియాలో అత్యంత కీలకమైన భారత్‌ను అష్టదిగ్భంధనం చేసే దిశగా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే సముద్రం తలంపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
అయితే ఈ విద్యుత్ కేంద్రాలకు భారీ డిమాండ్ ఉన్నట్టు చైనా నౌకా నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ లియు జెంగువో తెలిపారు. వాస్తవానికి ఈ న్యూక్లియర్ ప్లాంట్లను నిర్మించనున్న విషయం చైనా ఆటొమేటిక్ ఎనర్జీ అథారిటీ డైరెక్టర్ జు డాజే జనవరిలోనే వెల్లడించారు.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
అయితే ఇది వైజ్ఞానిక పరిశోధన పరంగా అత్యంత క్లిష్టమైనదనీ, సముద్ర విద్యుత్తో (మారీటైమ్ పవర్) అనుసంధానం కావడం చైనా బలమైన ఆకాంక్ష అని చెప్పారు. 2020 నాటికి చైనా ప్రభుత్వం తలపెట్టిన ఐదేళ్ల ఆర్ధికాభివృద్ధి ప్రణాళికలో భాగంగానే అణువిద్యుత్ ఉత్పాదకతను అభివృద్ధి చేస్తున్నట్టు డాజే వెల్లడించారు.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
అయితే ఈ తరహా అణువిద్యుత్ కేంద్రాలను తొలిసారి కనిపెట్టింది మాత్రం చైనా కాదు. 1960 లో పనామా కెనాల్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అమెరికా దళాలు రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఓ యుద్ధనౌకలో న్యూక్లియర్ రియాక్టర్లను నెలకొల్పింది. 1960 ల్లో పనామా కెనాల్ జోన్కూ, 1970 ల్లో అమెరికా పవర్ గ్రిడ్కూ సైన్యానికి చెందిన ఫ్లోటింగ్ అణురియాక్టర్ ద్వారా విద్యుత్ అందించారు.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
1955 నుంచే యుద్ధనౌకల్లో విద్యుత్ అవసరాల కోసం అణు రియాక్టర్లను ఉపయోగించారు. తొలిసారి అణువిద్యుత్ ఉపయాగించిన అమెరికన్ సబ్మిరైన్ 'నాటిలస్' కమాండింగ్ అధికారి అప్పట్లో ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
ఇక దక్షిణ చైనా ప్రాంతంలో తరచూ తుఫాన్లు తీరం దాటుతూ ఉంటాయి. అణువిద్యుత్తో పనిచేసే యుద్ధనౌకలు, ఓడలు తుఫాను ప్రాంతం నుంచి వెంటనే తప్పించుకునేలా వేగంగా ప్రయాణించాల్సి ఉంటుంది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
అయితే నూతనంగా ప్రవేశపెట్టబోతున్న ఈ అణురియాక్టర్ నౌకలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయి, ఎలాపనిచేస్తాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని చైనా అణు భద్రతా సంస్థ అధికారి టాంగ్బో చెబుతున్నారు. సముద్రంలో ఉండే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉందన్నారు.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
తేలియాడే నౌకల్లో పెను ప్రమాదం చోటు చేసుకుంటే .. అంటే రియాక్టర్ కోర్ కరగడం కారణంగా తలెత్తే ప్రమాదాల వంటివి జరిగితే .. వాయుప్రవాహం ద్వారా రేడియో యాక్టివిటీ తరంగాలు మానవాళికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని మరో న్యూక్లియర్ ఇంజనీర్ డేవిడ్ లాంచ్బామ్ తెలిపారు

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
నౌక అడుగుభాగం నుంచి మండే రియాక్టర్ కోర్ కరగడం అంటూ జరిగితే ... కరిగిన భాగాలు నౌక కింద నీటిలోకి చేరతాయని ఇలాంటి ప్రమాదాలు కూడా తీవ్ర దుష్పరిణామాలను మోసుకొస్తాయని వెల్లడించారు.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
చల్లబరిచేందుకు నీరు చాలా ఉత్తమైన వస్తువనీ .. అయితే అది అదుపుతప్పితే మన చేతుల్లో ఉండదని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సముద్రంలో గుర్తించబడని కొత్త ద్వీపాల్లో చైనా తన ఆటోమేటిక్ అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతోంది. అవి తమకు చెందిన ద్వీపాలంటూ అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
చైనాకి దక్షణాన వందల మైళ్ల దూరంలో గత రెండేళ్ల నుంచి కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. అదీ కూడా వివాదాస్పద సముద్ర జలాల్లో వీటిని నెలకొల్పుతుండడం పొరుగుదేశాలకూ చైనాకు మధ్య ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతోంది.

సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది
ఈ పరిణామాలతో సదరు ప్రాంతంపై తనకూ హక్కు ఉందని చెబుతూ అమెరికా తమ యుద్ధనౌకలను ఈ దీవులకు సమీపంలో మోహరించింది. తరచూ ఈ వివాదంపై చైనా, అమెరికా యుద్ధనౌకలు పరస్పరం కవ్వింపులకు పాల్పడుతుండడంపై అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

17
ఇప్పటికే రష్యా కూడా ఇలాంటి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. మరి ఇది ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి
టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470