చైనా సముద్రంలో రహస్యంగా ఏం చేస్తోంది ?

|

అది డ్రాగన్ కంట్రీ..ఎవరు చెప్పినా తన దారి తనదే అంటూ ముందుకు సాగే కంట్రీ. తన కుయుక్తులతో అగ్రరాజ్యానికి సైతం ముచ్చెమటలు పట్టించగల కంట్రీ..అగ్రరాజ్యానికి ఆ దేశమంటేనే హడల్. ఆ దేశం ఏదో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. చైనా..టెక్నాలజీ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతున్న దేశం. ఇప్పుడు మళ్లీ సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఏ రోజైనా ఆసియా దేశాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు భూమి, ఆకాశం నీరు దేనిని వదిలేలా లేదు.

రణ రంగం.. పాక్ వెనుక చైనా

ఇప్పటికే బలమైన గ్రేట్ వాల్‌ను కలిగిన చైనా సముద్రంలో కూడా తన రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్ పేరిట పెద్ద నిర్మాణాలను చేపడుతోంది. నడి సముద్రంలో విమానాలను దింపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. తాను ఇలాంటివి ఇక నిర్మించబోనని చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కింది. దక్షిణ చైనా సముద్రంలో ఏకంగా మూడో ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తోంది. అమెరికా శాటిలైట్ దృశ్యాలను బయటపెట్టింది. చైనా ప్లానేంటి..ఎందుకు అలా మొండిగా వెళుతోంది.. మిగితా కథనం స్లైడర్ లో చదవండి.

 

విశ్వ రహస్యాలు చైనా చేతిలో..?

3వేల మీటర్ల భూమి చుట్టూ గోడ

2002లో తాను మూడో నిర్మాణం ఏదీ తలపెట్టనని ప్రపంచ దేశాలకు చైనా హామీ ఇచ్చింది. ప్రస్తుతం మొత్తం 3వేల మీటర్ల భూమి చుట్టూ గోడ కట్టేస్తోంది. దీని వలన ఇక్కడ యుద్ధ విమానాల్ని మోహరించాలన్నది చైనా ప్లాన్.

రెండు కాకుండా మూడోదానిని..

సుదీర్ఘమైన సముద్ర తీరం కలిగిన చైనా ఇప్పటికే ఇలాంటి వాటిని రెండింటిని నిర్మించుకుంది. ఆ రెండు కాకుండా మూడోదానిని నిర్మిస్తోంది. రెండు ఎయిర్ స్ట్రిప్పులను వివాదాస్పద సముద్ర దీవుల్లో నిర్మించింది.

దక్షిణ చైనా సముద్రంపై చాలా దేశాలకు హక్కు
 

దక్షిణ చైనా సముద్రంపై చాలా దేశాలకు హక్కు

దక్షిణ చైనా సముద్రంపై చాలా దేశాలకు హక్కు ఉంది. అయితే చైనా మాత్రం దానిపై పూర్తి హక్కులను బలవంతంగా సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సముద్రం, దీని దీవుల్లో ఖనిజాలు, చమురు గనులు ఉన్నాయి.

చైనా తన ఇష్టానుసారం నిర్మాణాలు

వాటన్నింటిపై బ్రునై, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాంలకు కూడా హక్కుంది. కానీ వాటిపై కన్నేసిన చైనా తన ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టడం వివాదస్పమవుతోంది. అంటే అక్కడున్న అన్నింటిని సొంతం చేసుకోవడానికి ఇలా వ్యవహరిస్తోందనే వాదన ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది.

13 గంటల పాటు కడలిలో ప్రయాణిస్తే కానీ ఈ దీవికి చేరుకోలేరు.

వివాదాలకు కేంద్ర బిందువైన దక్షిణ చైనా సముద్రంలోని ఓ దీవే.. శాన్షా. ఈ కొత్త నగరం ఏర్పాటైంది దక్షిణ చైనా సముద్రంలోనే. చైనా దక్షిణ కొసన ఉన్న ప్రావిన్స్ నుంచి 13 గంటల పాటు కడలిలో ప్రయాణిస్తే కానీ ఈ దీవికి చేరుకోలేరు.

చైనా మరో వివాదానికి తెర

విసిరేసినట్టుగా ఎక్కడో ఉన్న ఈ బుల్లి దీవిని గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా చైనా మరో వివాదానికి తెరతీసింది. చైనా రిపబ్లిక్‌లో అవతరించిన కొత్త నగరం. దీని వైశాల్యం ఓ చిన్నపాటి విమానాశ్రయం(ఎయిర్ స్ట్రిప్) అంతే! కాకుంటే ఓ పోస్టాఫీస్, బ్యాంక్, సూపర్‌మార్కెట్, ఓ ఆస్పత్రిని నిర్వహించుకోవచ్చు. ఇక జనాభా చూస్తే వెయ్యే. ఇంతకీ ఈ బుల్లి సామ్రాజ్యం ప్రత్యేకత ఏంటనే కదూ అనుమానం?

దీవులపై ఆధిపత్యం సాధించేందుకు...

దక్షిణ చైనా సముద్రంలో ఇలాంటి చిన్న దీవులకు కొదవలేదు. చమురు నిల్వలు అపారంగా ఉన్న ఈ దీవులపై ఆధిపత్యం సాధించేందుకు చైనాతో పాటు వియత్నాం ఎప్పటి నుంచో విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

శాన్షాకు కొత్త మేయర్‌

ఈ నేపథ్యంలో చైనా ఓ అడుగు ముందుకేసి శాన్షాకు కొత్త మేయర్‌ను ప్రకటించింది. తొలి మేయర్‌గా జియోజీ ఎన్నికయ్యారు. చైనా సెంట్రల్ టెలివిజన్ దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసింది కూడా. శాన్షాలో సైనిక బలగాలను దింపినట్టు చైనా కేంద్ర మిలటరీ ప్రకటించింది.

ఇతర దేశాల నుంచి తీవ్ర నిరసన

చైనా తాజా చర్యకు ఇతర దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాల ఉల్లంఘన కొందకే వస్తుందని వియత్నాం ఆరోపించింది. దక్షిణ చైనా సముద్ర దీవుల్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడాన్ని ఫిలిప్పీన్స్ ఖండించింది.

తఘ్నులను మోహరించే యోచనలో..

మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దీర్ఘ శ్రేణి శతఘ్నులను మోహరించే యోచనలో ఉన్నట్టుగా తైవాన్ ప్రకటించడం తాజా వివాదానికి మరింత ఆజ్యం పోసే ప్రమాదముంది.

CSIS సంస్థ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

అమెరికాకు చెందిన CSIS సంస్థ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. వివాదాస్పద జలాల్లో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్లే అమెరికా నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుకున్నదాన్ని పూర్తి చేయకమానదు డ్రాగన్‌ కంట్రీ

కానీ... చైనా మాత్రం యధావిధిగా పనులు కొనసాగిస్తునే ఉంది. ఎవరెన్ని చెప్పినా అనుకున్నదాన్ని పూర్తి చేయకమానదు డ్రాగన్‌ కంట్రీ. తాజాగా తాను చేపట్టదలచిన ఎయిర్‌ స్ట్రిప్ నిర్మాణంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. చైనా మొండిగా ముందుకు పోతోంది.

సముద్ర జలాల్లో కృత్రిమ ద్వీపం

చైనాకు దక్షిణ ప్రాంతంలోని సముద్ర జలాల్లో కృత్రిమ ద్వీపం ఏర్పాటు చేసి... దానిపై దీర్ఘ చతురస్రాకారంలో దాదాపు 3 వేల మీటర్ల పొడవున ఎయిర్ స్ట్రిప్‌ నిర్మిస్తోంది. గతంలో చైనా నిర్మించిన రెండు ఎయిర్‌ స్ట్రిప్‌ల లాగే ఇదీ ఉందని అంటున్నారు అమెరికాకు చెందిన మేరీ టైమ్‌ ట్రాన్స్‌పరెన్సీ అధికారులు.

రగడ ముదిరేనా..

చైనా దక్షిణ ప్రాంతంలో ఉన్న సముద్ర జలాలు... వాటిలో దీవులపై సార్వభౌమాధికారం ఎవరిదనే దానిపై చైనా, బ్రూనై, మలేసియా, ఫిలిప్పైన్స్‌, తైవాన్, వియత్నాం దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మళ్లీ ఆప్రాంతంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మిచేందుకు సన్నద్దమవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్మీకి చెందిన ఎలాంటి విమానమైనా అక్కడ ల్యాండింగ్‌,

చైనా నిర్మాణ కార్యక్రమాల వల్ల అంతర్జాతీయ జలాల్లో ఇతరులు సేఫ్‌గా వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయని అంటోంది అమెరికా. అందుకే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సముద్ర జలాల్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్ స్ట్రిప్‌లో చైనా ఆర్మీకి చెందిన ఎలాంటి విమానమైనా అక్కడ ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేసే అవకాశం ఉంది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ వాషింగ్టన్‌ పర్యటన

సెప్టెంబర్‌ నెల మొదటివారంలో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ వ్యవహారం బైటకు పొక్కింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ వాషింగ్టన్‌ పర్యటనలో ఈ ఎయిర్‌స్ట్రిప్‌ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందు ముందు ఎలాంటి రగడ జరుగుతుందో చూడాలి

మరి ముందు ముందు ఎలాంటి రగడ జరుగుతుందో చూడాలి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

Most Read Articles
Best Mobiles in India

English summary
Here write Satellite images reveal China has already constructed 3km runway on island it has formed in disputed ocean territory

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more