ఓ చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

Written By:

ఓ చిన్న డ్రోన్ ఏకంగా 55 విమానాలకు చుక్కలు చూపించింది. ఆ డ్రోన్ దెబ్బకు విమానాలను ఎక్కడికక్కడే నిలిపేశారు. వివరాల్లోకెళితే చైనాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంలో అధికారులు ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేశారు. సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న చెంగ్డూ షాంగ్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉన్న అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం మీదుగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియని ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న 55 విమానాలను కొంత సమయం పాటు అలాగే నిలిపేశారు. ప్రమాదమేమీ లేదని నిర్థారించుకున్న తరువాత విమానాలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరాయి. ఆ డ్రోన్‌కు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఓ డ్రోన్ మూలంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగటం ఇదే తొలిసారని అంటున్నారు.

Read more: సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

సుమారు 111 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన విమానాశ్రయంలో కనీసం కట్టినప్పటి నుంచి ఒక్క ప్రయాణికుడు కూడా లేడంటే నమ్మగలరా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

జై సల్మేర్ రాజస్థాన్ లోని ఎడారి నగరం.ఇక్కడ అంతా ఎటు చూసినా ఇసుకతో అలరారుతూ ఉంటుంది. అటువంటి చోట దాదాపు 17 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 111 కోట్లు ఖర్చు పెట్టి రెండేళ్ల క్రితం అత్యాధునిక విమానాశ్రయాన్ని నిర్మించారు.

3 లక్షల మంది ప్రయాణికులు...

180 సీట్లు ఈ విమానాశ్రయం దాదాపు 300 మంది ప్రయాణికుల అవసరాలు తీర్చేలా,180 సీట్లుండే మూడు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించారు.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

ఇంత ఖర్చు పెట్టిన ఈ విమానాశ్రయం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా అక్కడి నుంచి ప్రయాణించడం లేదు.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

జైసల్మేర్ ఒక్కటే కాదు. 2009 నుంచి దాదాపు ఇండియాలో 326 కోట్లతో సుమారు విమానాశ్రయాలను నిర్మించారు. వీటిల్లో ఒక్క ఎయిర్ పోర్టుకు సర్వీసులు తిరగట్లేదు.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

రాజస్తాన్ లోని ఎయిర్ పోర్ట్ లో ఖాళీగా కనిపించే చెకిన్ డెస్క్ లు ,దుమ్ముపట్టిన సీట్లు దర్శనమిస్తుంటాయి.ఇక రాత్రయితే అక్కడ లైట్లు వెలగక అవిదెయ్యాల కోటల్లా కనిపిస్తుంటాయి.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

దేశ వ్యాప్తంగా ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలోని 100కు పైగా విమానాశ్రయాల్లో ఈ ఏడాది ఒక్క విమానం కూడా దిగలేదు. వీటిలో కొన్నింటిని చార్టెడ్ విమానాల కోసం నిర్మించినట్లుగా అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

ఒక విమానాశ్రయాన్ని నిర్మించినంత మాత్రాన మౌళిక వసతులు కల్పించేశాం అభివృద్ధి చెందామని భావించరాదు.వాస్తవ పరిస్థితులను గమనించాలి అని స్పైస్ జెట్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అంటున్నారు.

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

తాము మైసూరులో నిర్మించిన ఎయిర్ పోర్ట్ లో సేవలను ప్రారంభించినా ప్రజల నుండి స్పందన లేకపోవడంతో వెనక్కి తగ్గామని యాజమాన్యం చెబుతోంది. 

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

ప్రధాని మోడీ ప్రసంగంతో ఒక్కసారిగా ఈ విమానాశ్రయాల కథ బయటకు వచ్చింది. 

చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Drone Flying Over Airport Delays 55 Flights In Southwest China
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot