ఆ కాలంలో ఇంత భయకంరంగా మనుషుల్ని చంపారా.. ?

Written By:

మీకు నియోలిథిక్ యుగం గురించి తెలుసా..కుప్తంగా చెప్పాలంటే కొత్త రాతి యుగం. పాత రాతి యుగం, కొత్త రాతి యుగమని దశలవారీగా కొన్ని యుగాలు వచ్చాయి. ఇప్పుడున్న యుగం కూడా కొత్త రాతియుగమనే పిలుస్తారు..అయితే ఈ యుగం ప్రారంభంలో మనుషుల్ని ఉచకోత కోసినట్లుగా తెలుస్తోంది. అత్యంత భయకంరంగా చంపేసి వాటిని గోతుల్లో పడేసినట్లుగా కొన్ని ఆధారాలు లభించాయి. షాక్ పుట్టిస్తున్న కథనం చదవండి.

Read more : అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా : షాక్ పుట్టిస్తున్న అస్థి పంజరాలు

సుమారు 6 వేల ఏండ్ల క్రితం జరిగిన నియోలిథిక్ అంటే కొత్త రాతియుగం ఊచకోత నాటివని భావిస్తున్న కొన్ని మానవ ఎముకలను ఈశాన్య ఫ్రాన్స్‌లోని అల్సేస్ ప్రాంతంలో పురావస్తుశాఖ పరిశోధకులు కొనుగొన్నారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా : షాక్ పుట్టిస్తున్న అస్థి పంజరాలు

అప్పట్లో ఆహారం, ఇతర వస్తువులను నిల్వ చేసుకొనేందుకు ఉపయోగించే పురాతన 300 గోతుల్లో పదుల సంఖ్యలో ఈ అస్థిపంజరాలను గుర్తించినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రివెంటివ్ ఆర్కియోలాజీ రిసెర్చ్ సంస్థ తెలిపింది.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఆనాటి నియోలిథిక్ గ్రూప్ సభ్యులు అప్పట్లో జరిగిన హింసాత్మకమైన దాడిలో మరణించారని చెప్పడానికి వారి కాళ్లు, చేతులు, పుర్రెలపై పలు గాయాల ఆనవాళ్లు ఉన్నట్టు వారు తెలిపారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఇంకా విషాదకరమైన విషయం ఏమిటంటే గోతుల్లో మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయని.. వారంతా సామూహిక వధకు గురి అయి ఉంటారనే అనుమానాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఎముకలపై ఉన్న గాయాలను బట్టి చూస్తే.. బలమైన రాతి గొడ్డలితో అతి దారుణంగా నరికి ఇలా గోతుల్లో పడేసి ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఐదుగురు పెద్దల, ఓ యువకుడి ఆస్థిపంజరాలతో పాటు, మరో నాలుగు ఆయుధాలు అక్కడ లభ్యమయ్యాయని తెలిపారు. ఇవన్నీ 2012లో బెర్గియంలోని శ్మశానవాటిక వద్ద లభించిన వాటిని పోలి ఉన్నాయన్నారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఇదిలా ఉంటే కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డలి ఒకటి అరుణాచల్‌ప్రదేశ్- చైనా సరిహద్దులలో దొరికి సంచలనం సృష్టించింది ఎగువ ‘సుబాన్‌సురి' జిల్లాలోని తాక్సింగ్ అనే చోట ఈ రాతి గొడ్డలి దొరికింది.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

నల్లటి స్ఫటికరాయితో తయారై రెండు వేపులా అతి నున్నగా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ఆయుధం మీద- కొన్ని గంట్లు పడ్డవో లేక మరి, పెట్టినవో కనపడుతున్నాయి. ఈ గొడ్డలి అంచు తాకితే చెయ్యి తెగేలాగా ఉంది.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఇండో, చైనా టిబెట్ భూభాగాలమధ్య ఇటువంటి గొడ్డలి దొరకటం ఇదే మొదటిసారి. దీన్ని- కొత్త రాతియుగం మానవుడు పొలం పనులలో వాడుకున్నాడేమోనని'' పురావస్తు నిపుణుడైన డాక్టర్ తగేగారు అన్నారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

ఇది సరిహద్దు ప్రాంతంలో నివసించే- తాడేవిబో, తాలిన్‌గ్యా అనే ఇద్దరు గ్రామీణులకి దొరికింది. ఇది ఆకాశంమీది నుంచి ఊడిపడ్డదని ఆ గ్రామస్థులు నమ్ముతున్నారు.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

దుష్టశక్తులు మానవుల మీద వీటిని ప్రయోగిస్తాయనీ, ‘తాన్సింగ్' జనాలు గుడ్డిగా చెబుతున్నారు. దాన్ని తాకడానికి కూడా హడలి చస్తున్నారు గానీ, మ్యూజియం డైరెక్టర్ చారిత్రక పరిశోధనలకి ఇది ఎంతో పనికొచ్చే పనిముట్టు- అని భద్రపరిచాడు!

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

అలాంటి గొడ్డలితోనే వీళ్లను చంపేసి ఇలా గోతుల్లోకి పడేసి ఉంటారని శాస్ర్తవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు చంపారన్న దానిపై వివరణ స్పష్టంగా తెలియడం లేదు.ఏదేమైనా ఇంత దారుణంగా అప్పట్లోనే చంపడమనేది చాలా విషాదకరం.

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా..

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write French archaeologists unearth bones from 6,000-year-old massacre
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot