ఆ విమానాన్ని ఏలియన్స్ కూల్చివేశాయా..?

  రెండేళ్ల క్రితం మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టుఎయిర్ విమానంపై అనుమానాలు ఇప్పటికీ వీడటం లేదు. ఈ విమానం పేలుడు వల్ల కూలిందా లేక ఏలియన్స్ కూల్చి వేశాయా అనే అంశాలపై ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. విమానంలో పేలుడు సంభంవించిందని శాస్ర్తవేత్తలు నిర్ధారించినా అది ఎలా జరిగిందనే దానిపై ఫోరెన్సిక్ నిపుణులు ఖచ్చితమైన నిర్థారణకు రాలేకపోతున్నారు. కాగా విమానం కూలిపోవడానికి కాక్‌పిట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదమే కారణమై వుండవచ్చని ఫ్రాన్స్‌ దర్యాప్తు అధికారులు తెలిపారు.

  Read more : మిస్సయిన విమానంపై నివ్వెరపరిచే వాస్తవాలు

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  మద్యధార సముద్రంలో

  ఈజిప్టు ఎయిర్ కు చెందిన విమానం పారిస్ నుంచి కైరోకు వస్తుండగా సముద్రంలో కుప్పకూలడంతో 66 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇది మద్యధార సముద్రంలో కూలిందనే వార్త నాడు యావత్ ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది.

  యుఎఫ్‌ఓలను చూసిన విమానంలోని ఇద్దరు పైలట్లు

  అయితే ఈ ప్రమాదానికి ముందుగా బొడ్రమ్ నుండి ఈజిప్ట్‌కు వెళుతున్న విమానంలోని ఇద్దరు పైలట్లు గ్రహాంతర వాసులు వినియోగించే ఎగిరే వస్తువులుగా భావించే యుఎఫ్‌ఓలను గుర్తించినట్లు తెలిపారు.వారు వీటిని ప్రత్యక్షంగా చూసినట్లు అవి విమానానికి దగ్గరగా వచ్చినట్లు కూడా తెలిపారు.

  17,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు..

  ఇంస్తాబుల్ భూబాగంలో ఉన్న సిలివ్రీ జిల్లా ఉపరితలం మీద యుఎఫ్‌ఓలను సుమారుగా 17,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు గుర్తించినట్లు తెలిపారు. అవి అక్కడ ఎందుకు అలా తిరుగుతున్నాయో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదని వారు చెబుతున్నారు.

  అవి అలా తిరుగుతుండగా..

  అవి అలా తిరుగుతుండగా మేము చూసిన కొన్ని గంటల్లోపే విమాన ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అవి అక్కడ తిరుగుతుండగా ఈజిప్ట్ విమానం వచ్చిందని అప్పుడే అది టర్కీ మరియు ఈజిప్ట్ మధ్యలో మధ్యదరాసముద్రంలో కూలినట్లు సమాచారం అందిందని వారు వివరించారు.

  ఈజిప్ట్ విమానానికి యుఎఫ్‌ఓలే ముఖ్య కారణం

  అంతేకాకుండా ఈజిప్ట్ విమానానికి యుఎఫ్‌ఓలే ముఖ్య కారణం అనే వాదనను బలపరిచేందుకు గాను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ చెందిన పైలట్లు ఇస్తాంబుల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తాము 2,000 నుండి 3,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఆకుపచ్చ లైట్లతో మా ముందు నుండి యుఎఫ్‌ఓలు వెల్లినట్లు తెలిపారని టర్కిష్‌లోని ప్రముఖ పత్రిక తెలిపింది.

  అవి అలా ఎందుకు అక్కడ తిరుగుతున్నాయి

  అయితే అవి ఆ తరువాత కాసేపటికే అక్కడి నుండి ఉన్నట్లుండి అదృశ్యమయ్యాయి. ఆ తరువాత మేము వాటి ఖచ్చితంగా యుఎఫ్ఓలు అని నిర్ధారణకు వచ్చామని వారు తెలిపారు. మరి అవి అలా ఎందుకు అక్కడ తిరుగుతున్నాయి. అవి యుఎఫ్ ఓలేనా లేక మరెవరైనా శత్రువులు దాడి చేసేందుకు అక్కడ ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.

  అత్యవసర ల్యాండిగ్ అవసరం

  దీన్ని మరిన్ని ఆధారాలు ధృవ పరుస్తున్నాయి. మిస్టరీగా మిగిలిపోయిన ఈజిప్ట్ విమాన ప్రమాదానికి ముందుగా ఈజిప్ట్ఎయిర్ ఎమ్ఎస్804 అనే ఈ విమానం నుండి పైలట్ ఫోన్ చేసి అత్యవసర ల్యాండిగ్ అవసరం అని చెప్పాడని ఎయిర్‌లైన్స్ విభాగం తెలిపింది. మరి అత్యవసర లాండింగ్ అంటే చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా పైలెట్లు ముందే భావించారని సమాచారం బట్టి తెలుస్తోంది.

  విమానంలో దట్టమైన పొగలు

  ప్రమాదం సంభవించిన విమానంలోని పైలట్ మొహమ్మద్ సైయ్యద్ షౌకిర్ (37) కైరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులతో మాట్లాడుతూ, విమానంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి, మాకు అత్యవసర ల్యాండిగ్ అవసరం ఉంది కాని విమానం సముద్రం మధ్యలో ఉందని కొన్ని నిమిషాలపాటు వివరించినట్లు తెలిసింది. అది జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలో విమానం కూలిపోయింది.

  ఫ్రెంచ్ పత్రికా ఛానెల్ ఎమ్‌6

  ఫ్రెంచ్ పత్రికా ఛానెల్ ఎమ్‌6 వివరిస్తూ, విమానంలో అలుముకున్న పొగను చిధ్రం చేయడానికి పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్నట్లు నడిపాడు. అయితే అప్పటికి తీవ్ర లోపాలతో నడుస్తున్న విమానం కుప్పకూలిపోయింది. మరి అంత సడన్ గా అక్కడికి పొగలు ఎలా వచ్చాయన్నదే మిస్టరీగా మారింది.

  క్యాబిన్‌లోని గాలి పీడనాన్ని తగ్గించడం

  విమాన ప్రయాణంలో ఉన్నపుడు క్యాబిన్‌లోని గాలి పీడనాన్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తే అది విమానంలో ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువ. బహుశా ఇదే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

  పేలుడుకు ఉగ్రవాద చర్య కారణం కావచ్చని

  మరోవైపు ఈజిప్టు అధికారులు దీనిపై స్పందిస్తూ .. పేలుడుకు ఉగ్రవాద చర్య కారణం కావచ్చని, సాంకేతిక సమస్య కారణం కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే కొందరు ఏవియేషన్ నిఫుణులు మాత్రం బాంబు పేలుడు లేదా కాక్పిట్లో ప్రమాదం పేలుడుకు కారణం కావచ్చిన విశ్లేషిస్తున్నారు.

  ఉన్నట్లుండి 37,000 అడుగుల ఎత్తు నుండి 15,000 అడుగులకు

  ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఛేధించే పనిలో నిమగ్నమైన గ్రీస్ డిఫెన్స్ దీని గురించి వివరణ ఇస్తూ, ఈజిప్ట్ ఎమ్ఎస్804 విమనం ఉన్నట్లుండి 37,000 అడుగుల ఎత్తు నుండి 15,000 అడుగులకు ఎత్తుకు ఒక్కసారిగా పడిపోయింది.15,000 అడుగుల ఎత్తు వద్ద ఉన్నపుడు విమానం అడ్డదిడ్డంగా సుమారుగా 90 డిగ్రీల పాటు తిరిగి తూర్పు వైపు ప్రయాణించింది అని తెలిపింది.

  ఈ ప్రమాదానికి సంభందించిన లీకయిన సమాచారంలో

  ఈ ప్రమాదానికి సంభందించిన లీకయిన సమాచారంలో, విమానంలోని డెక్‌లలో కొన్ని క్షణాల వ్యవధిలోనే మంటలు అలుముకున్నాయి. ఎలక్ట్రానిక్స్ యొక్క పనితీరులో లోపం వలన విపత్తు సంభంవించిందని తెలిసింది. ఈ ప్రమాదానికి యుఎఫ్‌ఓలు ముఖ్య కారణం అని నమ్మే వారు కూడా లేకపోలేదు. అయితే ప్రమాదం జరిగిన రోజునే ఇతర విమానంలోని పైలట్లు యుఎఫ్‌ఓలను గుర్తించినట్లు తెలిపారు.

  శరీర భాగాలు చాలా చిన్నవిగా

  ఈజిప్టు దర్యాప్తు బృందంలో సభ్యుడైన ఫోరెన్సిక్ నిఫుణుడు మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించారు. ఘటనా స్థలం నుంచి 80 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారని, ఇవన్నీ చాలా చిన్నచిన్నగా ఉన్నాయని, పెద్ద భాగం ఒక్కటి కూడా లేదని, దీని వల్లే విమానంలో పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే దాని గురించి ఇప్పుడు చెప్పలేనన్నారు.

  పేలుడుకు కారణాలు ఏంటనేది

  మరి పేలుడుకు కారణాలు ఏంటనేది ఇప్పట్లో తెలిసేలా లేదు. ఇంతకుముందు మిస్సయిన మలేషియా ఎంహెచ్ 17 విమానం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలానే మారింది. మరి ఈ విమానంపై నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.

  2016 మే లో

  2016 మే లో సంభవించిన ఈ దుర్ఘటనలో విమానంలో వున్న 66మందీ చనిపోయారు. వీరిలో 12మంది ఫ్రాన్స్‌ జాతీయులు వున్నారు. ఈ విమానం కూలిపోవడానికి విద్రోహక చర్య కారణమై వుండవచ్చని, మృతదేహాల అవశేషాల్లో పేలుడు రసాయనాలు కనుగొన్నామని ఈజిప్ట్‌ అధికారులు నిర్ధారించారు.

  దర్యాప్తు నిర్ధారణలను తిరస్కరిస్తూ..

  ఆ దర్యాప్తు నిర్ధారణలను తిరస్కరిస్తూ ఫ్రాన్స్‌కి చెందిన బిఇఎ ఎయిర్‌ యాక్సిడెంట్‌ దర్యాప్తు సంస్థ పై వివరాలతో ఒక ప్రకటన జారీ చేసింది. చాలా ఎత్తులో వుండగా, కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి వుండవచ్చని, దానితో మొత్తంగా విమానమంతా మంటలు వ్యాపించి వుంటాయని భావిస్తున్నామని బిఇఎ పేర్కొంది.

  ఈజిప్ట్‌ అధికారులు తమ తుది నివేదికను ..

  అయితే, ఈజిప్ట్‌ అధికారులు తమ తుది నివేదికను ప్రచురించలేదని, విమాన శిధిలాలపై మరింతగా దర్యాప్తు సాగించాలన్న తమ ప్రతిపాదన కూడా వారు పట్టించుకోలేదని బిఇఎ తెలిపింది. కాగా దీనిపై వెంటనే వ్యాఖ్యానించడానికి ఈజిప్ట్‌ ఎయిర్‌ అధికారులు అందుబాటులోకి రాలేదు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Extraordinary claim that Turkish airline pilots saw a UFO where MS804 vanished just an hour before it crashed emerges on one of Turkey's biggest news outlets
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more