మిస్సయిన విమానంపై నివ్వెరపరిచే వాస్తవాలు

Written By:

రోజుకో కథ..రోజుకో విషాదవదనం...బతికున్నారనే ఆశలు ఓ నిమిషం చిగురిస్తే...వారు తిరిగిరాని లోకాలకు వెళ్లారని మరో నిమిషం ఆశలు రాలిపోయాయి...మళ్లీ ఎక్కడో ఉన్నారనే ఆశ..కాని ఇప్పటికీ దాని జాడ ఎవరికీ తెలియదు. కాని రోజుకో నివ్వెరపరిచే వాస్తవం మాత్రం బయటకొస్తోంది. గతేడాది మార్చి8న 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా ఎంహెచ్ 17 విమానంపై ఇప్పుడు విస్తుగొలిపే నిజాలు బయటిప్రపంచానికొచ్చాయి..విమానం పేల్చేశారన్న కఠోర వాస్తవాలు కర్కశుల కర్కశత్వానికి నిలువటద్దంగా నిలుస్తున్నాయి. మిగతా కధనం స్లైడర్ లో

Read more: త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నివ్వెరపరిచే వాస్తవాలు

గతేడాది ఉక్రెయిన్లో కూలిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 ప్రమాదం వెనుక నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఈ విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఎమ్38 క్షిపణి.. మలేసియా విమానం ముందు భాగాన్ని కొట్టడంతో విమానం పేలిపోయిందని తుది నివేదికలో పేర్కొంది.

విమానంపైకి దాడి చేసింది ఎవరు..?

రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటు దారులు ఈ విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్ నియంత్రణలోని ప్రాంతంలో నుంచి క్షిపణిని ప్రయోగించారని రష్యా చెబుతోంది. కాగా క్షిపణితో విమానంపైకి దాడి చేసింది ఎవరన్న విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు. ఉక్రెయిన్లో ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటు దారులకు మధ్య పోరు జరుగుతోంది.

విమానం దానికదే కూలిపోలేదని..

ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది.

తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని..

తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను కూల్చగలుగుతున్నామని స్పష్టం చేస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమాదం గురించి..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమాదం గురించి ఉక్రెయిన్ ను హెచ్చరించారు. తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోందని, తాము కోరినట్లుగా చర్చలు జరపడం ద్వారా ఘర్షణకు స్వస్తి పలికి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన గుర్తు చేశారు.

అంతకు మించి ఆయన ఏమీ ఆరోపణలు..

అంతకు మించి ఆయన ఏమీ ఆరోపణలు చేయలేదు. తిరుగుబాటుదారులే కూల్చివేశారన్న ఆరోపణను ఆయన తిరస్కరించలేదు కాబట్టి దానికాయన అంగీకరిస్తున్నట్లే అని డెయిలీ మెయిల్ లాంటి పశ్చిమ పత్రికలు ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాయి.

పశ్చిమ పత్రికల వార్తా కధనాలు..

ఇక పశ్చిమ పత్రికల వార్తా కధనాలు ఎలా ఉన్నాయంటే ‘అదిగో పులి, అంటే ఇదిగో తోక' అన్నట్లుగా. బక్ మిసైల్ తో రష్యా అనుకూల తిరుగుబాటుదారులే విమానాన్ని కూల్చేశారన్న ఆరోపణలు చేయడమే గానీ అందుకు సాక్ష్యాలనేమీ ఉక్రెయిన్ అధికారులు చూపలేదు.

ఉక్రెయిన్ వాదనను మోసే పనిలో పశ్చిమ పత్రికలు

కనీసం ఫలానా సాక్ష్యం ఉందన్న ప్రస్తావన కూడా చేయలేదు. ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ అయితే రష్యా గూఢచారులే విమానాన్ని కూల్చారని ఆరోపించాడు. ఉక్రెయిన్ వాదనను మోసే పనిలో పశ్చిమ పత్రికలు పూర్తిగా నిమగ్నం అయ్యాయి.

బక్ మిసైళ్ళు తమ వద్ద లేవని

బక్ మిసైళ్ళు తమ వద్ద లేవని విమానం కూలిన దోనెత్స్క్ ప్రాంత తిరుగుబాటు ప్రభుత్వం చెబుతూ కూల్చివేత పని ఉక్రెయిన్ మిలట్రీదే కావచ్చని ప్రత్యారోపణ చేశారు. కానీ వాళ్ళు కూడా అందుకు తగిన సాక్ష్యాలను ఏమీ చూపలేకపోయారు.

విమానం కూలిన చోటికి దగ్గరగానే..

ఈ లోపు ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అని ప్రచారం చేయడంలో పశ్చిమ పత్రికలు నిండా మునిగిపోయాయి. బక్ మిసైళ్లను ప్రయోగించే లాంచర్ ను పశ్చిమ దేశాల విలేఖరి ఒకరు దోనెత్స్క్ లో చూశారని ఆ ప్రాంతం విమానం కూలిన చోటికి దగ్గరగానే ఉందని డెయిలీ మెయిల్ రాసింది.

సాక్ష్యం లభ్యం అయ్యేవరకు వారి మాటలను నమ్మలేము

బక్ మిసైల్ లాంచర్ ని చూసినట్లు చెబుతున్న విలేఖరి సైతం అందుకు తగిన సాక్ష్యాన్ని చూపలేదు. ఇలాంటి గాలి వార్తలను కుమ్మరించడంలో కొందరు పశ్చిమ విలేఖరులు పండిపోయి ఉన్నందున రూఢి అయిన సాక్ష్యం లభ్యం అయ్యేవరకు వారి మాటలను నమ్మలేము.

క్రెయిన్ మిలట్రీ వద్ద కూడా బక్ మిసైళ్ళు

కాగా ఉక్రెయిన్ మిలట్రీ వద్ద కూడా బక్ మిసైళ్ళు ఉన్నాయి. అవి ఒకప్పుడు రష్యా సరఫరా చేసినవి. కానీ ఉక్రెయిన్ మిలట్రీలో ఇప్పుడు పని చేస్తున్నవారంతా సుశిక్షిత సైనికులు కాదు. యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన మితవాద గ్రూపుల సభ్యులే ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. క్రమబద్ధమైన యుద్ధ శిక్షణ వారికి లేదు.

శిక్షణ, నైపుణ్యం లేని సైనికులు పొరబాటున మలేషియా విమానాన్ని..

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్ బక్ మిసైల్ లాంచర్లను ఇటీవల కాలంలో దోనెత్స్క్ ప్రాంతానికి తరలించిందని రష్యా టుడే పత్రిక తెలిపింది. సదరు మిసైళ్లను ప్రయోగించగల శిక్షణ, నైపుణ్యం లేని సైనికులు పొరబాటున మలేషియా విమానాన్ని కూల్చి ఉండవచ్చని కొందరు సూచిస్తున్నారు.

కొన్ని నెలలుగా యుద్ధ ప్రాంతాలుగా ..

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు గత కొన్ని నెలలుగా యుద్ధ ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడి ప్రజలపై అన్ని రకాల అఘాయిత్యాలకు పాల్పడుతోంది. అనగా తన ప్రజలపై తానే యుద్ధం చేస్తోంది. అయినా పశ్చిమ దేశాలు గానీ, పశ్చిమ పత్రికలు గానీ, చివరికి ఐరాస కూడా దానిని పల్లెత్తు మాట అనడం లేదు.

ఉక్రెయిన్ ప్రభుత్వం నిజంగానే తమ ప్రజలపై యుద్ధం చేస్తున్నా..

సిరియా అధ్యక్షుడు తన ప్రజలను తానే చంపుతున్నాడని దొంగ సాక్ష్యాలు సృష్టించి, ఆయనను ఎదుర్కొనే పేరుతో ఇస్లామిక్ టెర్రరిస్టులను దించి వారికి డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి పశ్చిమ దేశాలు. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం నిజంగానే తమ ప్రజలపై యుద్ధం చేస్తున్నా అదేమీ ఎరగనట్లు నటిస్తున్నాయి.

ఆల్-ఖైదా ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలు

సిరియాలో ఆల్-ఖైదా ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలు ఇచ్చి ప్రజలపై ప్రయోగింపజేసి ఆ నేరాన్ని సిరియా అధ్యక్షుడి మీదకు నెట్టినట్లే తూర్పు ఉక్రెయిన్ లో మలేషియా విమానాన్ని కూల్చి ఆ నేరాన్ని తిరుగుబాటుదారులపై నేట్టేందుకు కుట్ర పన్నినా ఆశ్చర్యం లేదు.

ఉక్రెయిన్ సైన్యంలో చేరిన మితవాద, నియో-నాజీ గ్రూపులు

నిజానికి అటువంటి అఘాయిత్యాలకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన మితవాద, నియో-నాజీ గ్రూపులు పాల్పడిన చరిత్ర ఉంది. యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జనాన్ని తామే చంపి ఆ నేరాన్ని యనుకోవిచ్ పైకి నెట్టిన చరిత్ర వారిది.

మలేషియా విమానంపై దురాగతానికి ..

ఆ సంగతి లాత్వియా అధికారి ఒకరు వెల్లడి చేయడంతో వారి కుట్ర లోకానికి తెలిసింది. అదే తరహాలో వారు మలేషియా విమానంపై దురాగతానికి పాల్పడి ఉండవచ్చని కొందరు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ప్రమాద కారణాలపై ఎటువంటి సమాచారము లేదు. కనుక అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది. రానున్న రోజుల్లో వాస్తవాలు ఏదో విధంగా వెలుగు చూడక మానవు.

అదేమీ చిన్న వస్తువు కాదు

అదేమీ చిన్న వస్తువు కాదు. భారీ విమానం. సరిగ్గా సంవత్సరం క్రితం 239 మందితో ప్రయాణిస్తున్న మలేషియా విమానం మాయమై పోయింది. ప్రపం చంలోని అత్యా దునిక సాంకేతిక పరి కరాలు ఆ విమానం ఎక్కడ ఉం దన్న సం గతిని గుర్తించలేకపోయాయి. విమాన శిథిలాలు కాదుకదా, దానికి సంబంధించిన చిన్న రేకుముక్క కూడా దొరకలేదు.

వరల్డ్‌ ఎయిర్‌ లైన్‌ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటన

వరల్డ్‌ ఎయిర్‌ లైన్‌ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటనగా చరిత్రకెక్కిన దుర్ఘటనలో విమానం కూలిపోయిందని భావిస్తున్న అనుమానిత ప్రాంతాన్ని అణువణువునా శోధిస్తున్నా, సమయం ఏడాది కావడం మినహా, ఏ ఆధారమూ లభించలేదు.అయితే ఇప్పుడు ఈ వాస్తవాలు వెలుగులోకి రావడంతో ప్రపంచమే ఒక్కసారిగా నివ్వెరపోయింది. షాకింగ్ కు గురయింది.

కర్కశుల పాపానికి 239 మంది అమాయకులు

కర్కశుల పాపానికి 239 మంది అమాయకులు మంటల్లో మాడిమసైపోయారు..ఈ ఘోరమైన ..హేయమైన వికృత క్రీడ ఆడిన ఈ మానవత్వం లేని టెర్రరిస్టులకు ఏ రోజుకైనా చావు తప్పదు..

వాస్తవాలను వెల్లడి చేసిన డస్టీ సేఫ్టీ బోర్డ్ అధికారి జౌస్ట్రా

వాస్తవాలను వెల్లడి చేసిన డస్టీ సేఫ్టీ బోర్డ్ అధికారి జౌస్ట్రా 

దీనికి సంబంధించి దచ్ సేప్టీ బోర్డ్ రిలీజీ్ చేసిన వీడియో

దీనికి సంబంధించి దచ్ సేప్టీ బోర్డ్ రిలీజీ్ చేసిన వీడియో 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Malaysia Airlines flight MH17 shot down by Buk missile, investigation finds
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot