70 ఏళ్లుగా అమెరికా దాచిన ఆ సీక్రెట్ గుట్టు విప్పేస్తా

Written By:

గ్రహాంతర వాసులు ఉన్నారా..ఉంటే ఎక్కడున్నారు..అసలు భూమి మీద వారి జాడ ఉందా..వాళ్లు ఏ రూపులో ఉంటారు..ఇలాంటి సందేహాలు చాలామందికి సహజంగానే వస్తాయి. అయితే నాసా గ్రహాంతర వాసులు ఉన్నారంటోంది. వాటి మీద ప్రయోగాలు చేస్తున్నామని వాటికి అన్ని దేశాలు కలిసిరావాలని ఎప్పటినుంచో పిలుపును ఇస్తోంది కూడా. ఇక అమెరికా కూడా ఏరియా 51 పేరుతో ప్రపంచానికి తెలియకుండా గత 70 ఏళ్ల నుంచి గ్రహాంతర జీవులపై అన్వేషణ సాగిస్తూనే ఉంది. అది బయటి ప్రపంచానికి ఇంతవరకు తెలియదు..అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షబరిలో ఉన్న హిల్లరీ నన్ను గెలిపిస్తే ఈ నిజాలను బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఏమిటా నిజాలు అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ఏరియా 51 :అంతులేని రహస్యాల పుట్ట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎప్పటి నుంచో గ్రహాంతరవాసులు గుట్టు

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అమెరికాకు ఎప్పటి నుంచో గ్రహాంతరవాసులు గుట్టు తెలుసు. వాటి రహస్యాలను కనుగొనేందుకు ఏరియా 51లో అనేక రకాలైన ప్రయోగాలు చేస్తోంది. నెవడా ఎడారిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ లో ఈ గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారన్న కథనాలు కూడా అనేక సార్లు హల్‌చల్ చేశాయి.

హిల్లరీ చేసిన వ్యాఖ్యలతో

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అయితే ఇప్పుడు హిల్లరీ చేసిన వ్యాఖ్యలతో అవి నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా ఏలియన్స్ రహస్యాలను కాపాడుతోందని నన్ను గెలిపిస్తే ఆ రహస్యాల గుట్టు మొత్తం విప్పేస్తానని సరికొత్త వాదనకు తెరలేపింది.

అమెరికా వైట్ హౌస్ హడావుడిగా

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

ఈ విషయం తెలుసుకున్న అమెరికా వైట్ హౌస్ హడావుడిగా ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. ఆమె ఏం చెబుతున్నదో ఆమెకే తెలియదంటూ ఇప్పట్లో ఆ రహస్యాలను వెల్లడించే అవకాశం కూడా లేదంటూ ప్రకటన కూడా జారీ చేసింది.

గ్రహాంతర వాసులపై కొన్ని వ్యాఖ్యలు

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అయితే హిల్లరీ మాత్రం నాకన్నీ తెలుసు అంటోంది. ఈ మధ్య ఓ లైవ్ షోలో కూడా ఆమె గ్రహాంతర వాసులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. యూఎఫ్ ఓలు ఉన్నాయా అనే ప్రశ్నకు ఆమె అవి యుఎఫ్ ఓలు కాదు యూఏపీ అనాలంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. యూఏపీ అంటే Unidentified aerial phenomena అని అర్థం.

అమెరికా ప్రభుత్వం 2013లో

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అయితే అమెరికా ప్రభుత్వం 2013లో కొన్ని ఫైళ్లను డీ క్లాసిఫై చేసిన విషయం తెలిసిందే. వాటిని ఎవరూ వెల్లడించానికి వీల్లేని విధంగా అమెరికా తయారుచేసింది. అవి ఏలియన్స్ రహస్యానికి చెందిన ఫైళ్లు ఉంటాయని అప్పట్లో అనుమానాలు వచ్చాయి కూడా.

రాస్వెల్ మిస్టరీ

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

ఇదిలా ఉంటే రాస్వెల్ మిస్టరీ సమయంలో కూడా అమెరికా కొన్ని వాస్తవాలను దాచిపెట్టింది. అవి ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదంటూ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

మరి ఏంటీ ఆ రాస్వెల్ మిస్టరీ

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

రాస్వెల్ మిస్టరీ గురించి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి కూడా. న్యూ మెక్సికో ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యవసాయ దారుని తోటలో 1947 జూలైన ఆకాశం నుంచి గుర్తు తెలియని వస్తువులు పడ్డాయి. అవి అంతరిక్ష శకలాలు లాగా పెద్దగా ఉన్నాయి.

అవి పడిన చోట పెద్ద గొయ్యి

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అవి పడిన చోట పెద్ద గొయ్యి ఏర్పడింది కూడా. ఈ సన్నివేశాన్ని చూసిన యజమాని వెంటనే సైనికాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఇద్దరు అధికారులు అక్కడికి వచ్చి వాటిని పరిశోధనశాలకు తరలించారు.

వైరల్ గా మారిన ప్రకటన

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

వెనువెంటనే ప్రకటన రిలీజ్ చేశారు. ఎగిరే పళ్లెం లాంటి వస్తువు ధ్వంసమై దానికి సంబంధించిన శకలాలు ఆ తోటలో పడ్డాయని రాస్వెల్ ఆర్మీ అధికారి కల్నల్ విలియం వెల్లడించారు. అయితే ఈ ప్రకటన అమెరికా మొత్తం వైరల్ అయింది. దాదాపు 30 పైగా న్యూస్ పత్రికలు ఈ కధనాన్ని కవర్ పేజీలో ప్రముఖంగా ప్రచురించాయి.

శకలాలకు పోస్ట్ మార్టం

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అమెరికన్ మిలటరీ అధికారులు ఈ అంతుచిక్కని శకలాలను స్వాధీనం చేసుకుని వాటిపై పరిశోధనలు సాగించారు. అయితే ఆ శకలాలకు పోస్ట్ మార్టం జరుగుతుందనే విచిత్రమైన ఓ రహస్యం బయటకొచ్చింది.

ప్రతి ఒక్కరికీ హెచ్చరికలతో కూడిన ఆదేశాలు

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

ఈ వార్త ఎక్కడ బయటకొస్తుందోనని అమెరికా వెనువెంటనే శకలాల తొలిగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం ఎవ్వరికైనా తెలిస్తే మీకు చాలా ప్రమాదమని కూడా చెప్పింది.

రాస్వెల్ యుఎఫ్ఓ నిజమే అయితే

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

రాస్వెల్ యుఎఫ్ఓ నిజమే అయితే అమెరికా దగ్గర ఏలియన్స్ కు సంబంధించి టెక్నాలజీ 1947 నుంచే ఉందని అనుకోవాలి. గ్రహాంతర వాసులపై పరిశోధనలు సాగిస్తుందనే తెలుసుకోవాలి.

ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్' ద్వారా

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్' ద్వారా రాస్వెల్‌లో అసలేం జరిగిందన్న సమాచారాన్ని వెల్లడించేందుకు ఇప్పటివరకు అమెరికా నిరాకరిస్తుండడాన్ని బట్టి గ్రహాంతరవాసులకు సంబంధించిన టెక్నాలజీ అమెరికా దగ్గర ఉందనేది నిజమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇది కూడా త్వరలో బయటకు

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

అయితే ఇది కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు డెబ్బై ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన 1947 నాటి ‘రాస్వెల్' ఏలియన్ మిస్టరీపై అలాగే గ్రహాంతరవాసుల ఉనికిపై ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను కెనడా పరిశోధనా సంస్థ ఒకటి ఈ ఏడాది జూన్ 25న బహిరంగ చర్చకు పెట్టబోతోంది.

జూన్ 25 వరకు ఆగాల్సిందే

70 ఏళ్ల నుంచి అమెరికా దాచిపెట్టిన రహస్యాల గుట్టు విప్పేస్తా

ఈ చర్చలో అమెరికా దాచిన ఏలియన్స్ పై దాచిన నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏది నిజమో తెలియాలంటే జూన్ 25 వరకు ఆగాల్సిందే మరి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Hillary Clinton WILL release mysterious Area 51 alien secret files
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting