అమెరికా ఎడారిలో దాచిన రహస్యం, ఇప్పటికీ అంతు చిక్కడం లేదు

|

అమెరికా ఇప్పుడు బయటి ప్రపంచానికి తెలియని ఓ రహస్య ప్రాజెక్టును చేపట్టింది. అది అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..ప్రపంచానికి ఓ గొప్ప విషయం తెలియజేయడానికి ఆ ప్రాజెక్ట్ అమెరికాకు ఓ తురుపుముక్క...ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని సరికొత్త విషయాలు ఆ రహస్య ప్రాజెక్ట్ లో ఇమిడిఉన్నాయి..ఆ రహస్య ప్రాజెక్ట్ చేపట్టిన్న ప్రాంతం కూడా ఎవరికీ తెలియదు. ఆ ప్రాంతంలో అమెరికా చేస్తున్నది ఏంటో తెలుసా..గ్రహాంతరవాసుల అన్వేషణ...అవును గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అమెరికా ఆ ప్రాంతాన్ని ఇప్పుడు జల్లెడపడుతోంది.ఆ ప్రాంతం పేరే ఏరియా 51..ఇక కథనం చదవండి.

ఇండియా సరిహద్దులో ఏలియన్స్ కలకలం

ఏదైనా రహస్యం ఉంటే దాన్ని దాచి పెట్టడం కష్టం
 

ఏదైనా రహస్యం ఉంటే దాన్ని దాచి పెట్టడం కష్టం

ఏదైనా రహస్యం ఉంటే దాన్ని దాచి పెట్టడం కష్టం. మరి రహస్యమయమైన ఒక ప్రాంతం కొన్ని సంవత్స రాల పాటు ఎవరికీ తెలియకుండా తనను తాను దాచిపెట్టుకుని ఉంది. అదే రాస్‌వెల్‌లోని ఏరియా 51 ప్రాంతం.

అమెరికా ‘బ్లాక్‌ ప్రాజెక్టు' అనే ఎయిర్‌ క్రాఫ్ట్‌ను..

అమెరికాలోని లాస్‌వెలాస్‌ రాష్ట్రానికి దాదాపు 80-125 కిలో మీటర్లదూరంలో నెల్లీస్‌ ఏయిర్‌ ఫోర్స్‌,న్యూక్లియర్‌ టెస్ట్‌ సైట్‌లో ఉందీ ప్రాంతం. ఇందులో అమెరికా ‘బ్లాక్‌ ప్రాజెక్టు' అనే ఎయిర్‌ క్రాఫ్ట్‌ను పరిక్షిస్తోందని సమాచారం.

రాబర్ట్‌ లాజర్‌' అనే వ్యక్తి ..

అయితే ఇందులో ఒక ఎగిరే పళ్లం (యూఎఫ్‌ఓ) కూడా ఉందని చాలా మంది వాదన. రహస్యంగా ఎస్‌ఆర్‌71 అనే ప్రాజెక్టును గ్రూమ్‌ డర్టీ లేక్‌ ప్రాంతంలో పరీక్షిస్తున్నారట. అయితే ఆ ప్రాంతంలో పని చేశానని చెబుతున్న ‘రాబర్ట్‌ లాజర్‌' అనే వ్యక్తి తాను 51, ఎస్‌ 5 ప్రాంతాల్లో పని చేసినట్టు పేర్కొన్నాడు.

గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో ..
 

గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో ..

ఈ రహస్యమయ ప్రాంతం గురించి బయటి ప్రపంచానికి తెలిపిన తొలి వ్యక్తి అతనే.రాస్‌వెల్‌ ప్రాంతంలో ఒక ఫ్టైయింగ్‌ సాసర్‌పై పరిశోధనలు జరిపి గ్రహాంతర వాసుల సాంకెతిక పరిజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నట్టు, అంతే కాకుండా ఆ సాసర్‌లో ఉన్న గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో సంభాషించినట్టు తెలిపాడు.

51 అనేది ఒక అంతులేని రహస్యాల పుట్ట

వాటి శరీర నిర్మాణాన్ని డాక్టర్లు పరీక్షించారని తెలిపాడు. రహస్యాన్ని తలదన్నే రహస్యాలకు కేంద్రంగా ఈ ప్రాంతం ప్రస్తుతానికి ఎన్నో రహస్యాలను దాచుకొంది. ఒక్కటి మాత్రం నిజం ఏరియా 51 అనేది ఒక అంతులేని రహస్యాల పుట్ట. అతి రహస్యం బట్ట బయలు అనే సూత్రం దేనికి వర్తించదు అంటే వెంటనే ‘ఏరియా 51' పేరును చెప్పుకోవాలేమో.

1600లో ఇటలీలోని బ్రూనో అనే సన్యాసి మాట్లాడుతూ..

ఇక 1600లో ఇటలీలోని బ్రూనో అనే సన్యాసి మాట్లాడుతూ అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ భూమిలాంటి అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో మన లాంటి జీవులు నివసించవచ్చు. అవికూడా మనలాగే తెలివైనవా, లేకా మనకంటే తెలివైన జీవులు కావచ్చని తెలిపారు. ఆయన వ్యాఖ్యాలను ఖండించి అయనను కాల్చి చంపారు కొందరు.

వారి నమ్మకాన్ని శాస్తవ్రేత్తలు తప్పని..

కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమిని దాటి మరో జగత్తులేదని చాలా మంది నమ్మే వారు. వారి నమ్మకాన్ని శాస్తవ్రేత్తలు తప్పని నిరూపించారు. భూమికేవలం అనంత విశ్వంలో భాగమే. మరి ఇలాంటి అనంత విశ్వంలో ఎక్కడో అక్కడో మరోప్రాణి శ్వాసతీసుకుంటూ బ్రతికుండే అవకాశాలు లేకపోలేదు.

మనకు వేరే గ్రహవాసులు ‘ఏలియన్‌' అయితే, మనమూ వాటికీ ‘ఏలియన్ల'మే

వాటి జాడ కనుక్కోవడం మనకు చాలా కష్టంగా పరిణమించింది. మనం చూడలేని ప్రతి దాన్ని మనం కాదని అనలేం. మనకు వేరే గ్రహవాసులు ‘ఏలియన్‌' అయితే, మనమూ వాటికీ ‘ఏలియన్ల'మే. మనలా అవి కూడా మన జాడకోసం వెతుకుతున్నాయేమో? ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్న మనం వాటిని ఏదోక రోజు ఎదుర్కోవాలేమో? మరి మన భూమిపై అవి వచ్చినప్పుడు అతిధి దేవో భవ అని ఆతిధ్యం ఇస్తామా..లేక న్యూక్‌తో పేల్చేస్థామా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది.

1947 జులై 4వ తేది

1947 జులై 4వ తేది. వింతగా ఉన్న సిల్వర్‌ రంగులో ఉన్న ఒక ఎగిరే పళ్లం క్రాష్‌ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న జీవిల్లో అన్నీ చనిపోగా ఒకటి మాత్రం సజీవంగా ఉంది.ఈ ఎగిరే పళ్లం (యూఎఫ్‌ఓ-అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌) గురించి సైనికులు వెదకడం ప్రారంభించారు.

అమెరికా ప్రభుత్వం కేవలం బెలూన్‌ పేలుడుగా ..

మ్యాక్‌ బ్రాజెల్‌ అనే వ్యక్తికి పిడుగుపడినప్పుడు వచ్చే శబ్దం కన్నా పెద్ద శబ్దంతో ఏదో ఒక ఉల్క లాంటి వస్తువు పడటం గమనించి రాస్‌వెల్‌ పోలిస్‌ అధికారికి విషయం అందించాడు. దీంతో పోలిస్‌ అధికారి కొంత మందితో ఒక టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపించి ఈ ఎగిరే పళ్లాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం కేవలం బెలూన్‌ పేలుడుగా మార్చి కవర్‌ చేయడానికి ప్రయత్నించింది.

వాటిపై పరిశోధన జరుపుతున్నట్టు..

దీంతో చాలా మంది ఆమెరికా ప్రభుత్వం ఈ ఎగిరే పళ్లాలను స్వాధీనం చేసుకుని వాటిపై పరిశోధన జరుపుతున్నట్టు అనుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఎగిరై పళ్లాలను స్వాధీనం చేసుకుని వాటి సాంకెతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసినట్టు, దాని ఫలితంగానే మైక్రోసర్కిట్‌, లేజర్‌, ఫైబర్‌ ఆప్టిక్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, స్టార్‌ వార్‌ ఎస్‌డిఐ ఆయుధాలు వంటివి తయారు చేసింది' అని తన పుస్తకం ‘ది డే ఆఫ్టర్‌ రాస్‌ వెల్‌' అనే పుస్తకంలో ఫిలిప్‌ కార్సో అనే రచయిత వివరించాడు.

ఉన్నాయన్న కథనాలను కాదనలేము....అలాగని ఉన్నాయి అని అనలేం..

అయితే దీనికోసం ఆయనను విమర్శించిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఎగిరే పళ్లాలు తమకు కనిపించాయనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా రోజు వస్తుంటాయి. కొన్ని చిత్రాలు కూడా సంచలనాలు కలిగిస్తాయి. అవి ఉన్నాయన్న కథనాలను కాదనలేము....అలాగని ఉన్నాయి అని అనలేం. అయితే ఇలాంటి కథనాలు ఆసక్తిని కలిగిస్తాయన్నది మాత్రం ముమ్మాటికి నిజం.

ఇదే.. అమెరికా రహస్య స్థావరానికి చెందిన మ్యాప్

ఇదే.. అమెరికా రహస్య స్థావరానికి చెందిన మ్యాప్

అమెరికా తన పరిశోధనలను ఇక్కడ నుంచి పరీక్షిస్తోంది.

అమెరికా తన పరిశోధనలను ఇక్కడ నుంచి పరీక్షిస్తోంది.

సందర్శకులు కూడా వెళ్లే అవకాశం..

ఇక్కడికి సందర్శకులు కూడా వెళ్లే అవకాశం అప్పుడప్పుడూ కల్పిస్తారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here Write British Area 51? Claims secret ALIEN research base uncovered in Farnborough

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more