గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్న జంగిల్ బుక్

Written By:

ఇప్పుడు మన దేశంలో ఏదైనా హాలీవుడ్ సినిమా గురించి చెప్పుకుంటున్నారంటే అది జంగిల్ బుక్ గురించే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ అయితే ఆరంభం నుంచి ఓ సంచలనమే.

Read more: బాహుబలి : అందరూ అవాక్కయ్యే నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ది జంగిల్ బుక్ సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు.

2

నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే!

3

ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్' సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు.

5

ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం.

5

చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్'. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. ఇందులో గ్రాఫిక్స్ అచ్చం జంతువుల మధ్యన ఉన్నట్లే ఉంటుంది.

6

భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం.

7

త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్లు, రెండో రోజున రూ.13.5 కోట్లు, మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి.

8

మొత్తం మీద రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది.

9

దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్'! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేసే అవకాశం ఉంది.

10

ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం.

11

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెండింటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది.

12

రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2' చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్'కు సినీ రచన చేశారు.

13

మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్‌లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే మరి !

14

మీరు చూసిన ఫోటోలన్నీ గ్రాఫిక్స్ పోటోలే.ఎక్కడా ఒరిజినల్ ఫోటోలు లేవు. ఈ సినిమాకు ప్రాణం పోసినవి అవే 

15

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wrtie How Disney’s New Jungle Book Movie Pushes the VFX Envelope
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot