ప్రాణం పోసే ఆ మొక్క కోసం కోట్లు కుమ్మరిస్తున్న ఉత్తరాఖండ్

|

సంజీవని మొక్క...ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే రామాయణం గురించి ముందు తెలుసుకోవాలి. రామాయణంలో జరిగిన యుద్ధంలో బాణం తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హిమాలయాల్లో ఉన్న సంజీవని మొక్కని తీసుకురమ్మని హనుమంతుడికి రాముడు ఆదేశాలు జారీ చేస్తాడు. అయితే ఆ మొక్కను గుర్తించలేని హనుమంతుడు ఏకంగా పర్వతాన్నే మోసుకొస్తాడు.అప్పుడు లక్ష్మణుడి ప్రాణాలు పోసిన మొక్కను ఇప్పుడు ఎలాగైనా సాధించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా రెడీ అయింది. సంచలనం రేపుతున్న స్టోరీపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అంతుచిక్కని రహస్యం..ఆ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారు..

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు కాపాడే ఈ మొక్క హిమాలయాల్లో ఉందని చాలామంది చెబుతుంటారు. లేదని ఇంకొందరు కొట్టిపడేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం ఈ పురాణమొక్క హిమాలయాల్లో ఉందనే నమ్ముతోంది.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

అక్కడ ఈ మొక్కలు పెరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం దానిని వెతికి పట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు ఈ మొక్కను వెతికేందుకు కేంద్రం 250 కోట్ల నిధులు ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరింది.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట
 
ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

హిమాలయాల్లో ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటిలో సంజీవని కూడా ఒకటిని చాలామంది అభిప్రాయం. అయితే శతాబ్దాలుగా వెతుకుతున్నా ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. '' మేం ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాదు. తప్పకుండా సంజీవనిని కనుక్కుంటాం '' అని రాష్ట్ర మంత్రి సురేందర్ సింగ్ నేగి విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

చైనా సరిహద్దులో హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి ప్రాంతంలో ఈ మొక్క ఉన్నట్టు తెలుస్తోందని, అక్కడి నుంచే హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చాడని అక్కడి స్థానికులు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఈ మొక్కను వెతికేందుకు ప్రాథమికంగా రూ .250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  సైంటిస్టులు ఎలాగైనా ఈ మొక్కను పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. 

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చే సంజీవని మొక్క గురించి పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. చీకట్లో మెరిసే ఈ మొక్కలు హిమాలయాల్లో పెరుగుతాయని చెబుతారు.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఎత్తయిన పర్వతాలపై మాత్రమే పెరిగే సంజీవని మొక్క శాస్త్రీయ నామం సెలగినెల్లా బ్రైయాప్టెరిస్ అని అంటున్నారు. తెలంగాణలో ఈ మొక్కను పిట్టకాలుగా పిలుస్తారట. ఇది రాళ్లపైన మొలుస్తుంది. 6, 7 నెలల పాటు నీరు లేకున్నా ఈ మొక్క బతికేయగలదట.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఇక ఈ మొక్కకు పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనల్లో తెలిసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని మళ్లీ మామూలు స్థితికి రప్పించేందుకు, అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఇక నల్లమల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలు నీరసాన్ని పోగొట్టుకోవడానికి, బలాన్ని తెచ్చుకునేందుకు ఈ మొక్క ఆకుల రసంతో చేసిన ఓ ద్రవాన్ని నిత్యం తాగుతారట.పలురకాల రోగాలకు దీన్నిమూలికలతో కలిపి మాత్రలుగా వేసుకుంటారని తెలుస్తోంది.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

అయితే నిజానికి మరణించబోతున్న లేదా మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యూలో వైరల్ ప్రవేశిస్తుంది. దీన్ని నాశనం చేసేందుకు అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంధులను జనింపచేసే శక్తి ఒక్క సంజీవనికి మాత్రమే ఉందని ఓ ప్రచారం కూడా ఉంది

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

కాగా 2009 లో యోగా గురువు బాబా రామ్ దేవ్ సన్నిహితుడు బాలకృష్ణ మరికొందరు ఆయుర్వేద వైద్యులను వెంట బెట్టుకుని ఉత్తరాఖాండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో ఉన్న ద్రోణగిరి పర్వతాలపై సంజీవని మొక్క కోసం అన్వేషించారట.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

కాగా ఆ పర్వతంపై వెతికిన బాలకృష్ణ అతని బృంద సభ్యులకు సంజీవని దొరకలేదు కానీ దాని వర్గానికే చెందిన మరో 2 మొక్కలు దొరికాయని చెబుతారు. 

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఈ మొక్కలతోపాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన సంజీవని లాంటి లక్షణాలు కలిగిన మరో 17 మొక్కలపై బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉత్తర కర్ణాటకలోని సిర్సి అటవీ కళాశాల పరిశోధకులు పరిశోధనలు చేశారు కూడా.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

యుద్ధంలో మూర్ఛపోయి మరణానికి చేరువవుతున్న లక్ష్మణుడిని తిరిగి బతికించింది ఇదేనని రామాయణం చదివిన, విన్న వారికి తెలుసు. ఈ మొక్క గురించి శతాబ్దాలుగా వెతుకుతున్నా ఇప్పటి వరకు దాని జాడలేదు.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. మరి అద్భుతమైన ఈ పురాణ మొక్కను పట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. దొరికితే కనుక వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Best Mobiles in India

English summary
HereWrite Indian scientists find sanjeevani herbs in the Himalayas

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X