ట్విట్టర్‌లో కిమ్ జాంగ్‌ను చంపేశారు : అమెరికా మమ్మల్ని జోకర్ అనుకుంటోంది

Written By:

ఉత్తర కొరియా ఈ పేరు ఇప్పుడు ఓ సంచలనం. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ పేరు చెబితే ఇప్పుడు అన్ని దేశాలు ఉలిక్కిపడేస్థాయికి చేరుకున్నాయి. ఒంటరిగా అగ్రదేశాలకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తాజాగా రాకెట్ ప్రయోగం చేసి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. అగ్రరాజ్యంపై దాడిచేసే సత్తా మాకుందని చాటిచెబుతూ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇదిలా ఉంటే కిమ్ జాంగ్ చనిపోయారంటూ ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు హల్ చల్ చేస్తున్నాయి.ఎవరు ఆ ట్వీట్లు చేశారు..ఎందుకు చేశారు స్లైడర్‌లలో..

Read more: అమెరికాను ఒక్క బటన్‌తో బూడిద చేసి పారేస్తాం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ప్రపంచాన్ని భయపెట్టడానికి ఉత్తర కొరియా షాక్ ల మీద షాకులు ఇస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా వెన్నులో ఎలాగైనా వణుకు పుట్టించి, శత్రుదేశాల్లో తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే అణుబాంబును విజయవంతంగా ప్రయోగించామని ప్రకటించిన ఉత్తరకొరియా, తాజాగా ఖండాంతర బాలిస్టిక్ రాకెట్ పరీక్ష విజయవంతమైనట్టు పేర్కొంది.

2

అమెరికాపై అణుబాంబుల దాడికి ఇవి సామర్థ్యాన్ని చేకూర్చుతాయని వెల్లడించింది. అగ్రరాజ్యంపై అణు దాడి చేసే సత్తా ఆ కొత్త ఇంజిన్‌కు ఉందని ఉత్తర కొరియా అధికార వెబ్‌సైట్ పేర్కొంది.

3

ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ పరీక్షలు నిజంగా విజయవంతమైనవి అయితే ఈ ఏడాది ఉత్తరకొరియా నిర్వహించిన పరీక్షలో ఇది నాలుగవది. అణుఆయుధాల ప్రొగ్రామ్ ల్లో తన ఉనికిని చాటుకోవడానికి ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది.

4

అమెరికాతో పాటు భూమ్మీదున్న శత్రువులను టార్గెట్ చేస్తే సత్తా తమకు ఉందని ఈ సందర్భంగా కిమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ కొరియా, అమెరికా దేశాలు తమను జోకర్ అనుకుంటున్నాయనీ, అయితే తమ శక్తి ఏంటో ఆ దేశాలకు రుచి చూపించే రోజు త్వరలోనే రానుందని తెలిపారు.

5

ఈ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైన విషయం వాస్తవమైతే ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధ సంపత్తిలో మరో అడుగు ముందుకేసినట్లే. అయితే ఉత్తరకొరియా ఈ పరీక్ష నిర్వహించదనడంలో తమకు ఏ మాత్రం నమ్మకం లేదని దక్షిణ కొరియా చెబుతోంది.

6

ఖండాంతర అణుపరీక్షలకు 2014 నుంచి ఐక్యరాజ్య సమితి అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా తొలి మధ్య శ్రేణి రాకెట్ ను పరీక్షించిందని ఈ దేశ కేంద్ర న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

7

ఈ మధ్య అణు ఆయుధాల పరీక్షల్లో ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా దృష్టిపెడుతుండంతో ఉత్తర దేశాలకు అతడిని అత్యంత శత్రువుగా భావిస్తున్నారు.

8

ఇదిలా ఉంటే ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ మరణించారంటూ ట్విటర్లో పుకార్లు చెలరేగాయి. దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి హన్ మిన్ గూ పేరిట ఉన్న ఓ ట్విటర్ అకౌంట్లో ‘ ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షల్లో ప్రమాదం జరిగింది.

9

ఈ ప్రమాదంలో కిమ్‌జాంగ్‌కు తీవ్రంగా గాయాలవడమో, మరణించడమో జరిగిందని దక్షిణ కొరియా సైన్యం నుంచి విశ్వసనీయ సమాచారం' అంటూ ఓ పోస్ట్ కనిపించింది. దాన్ని నిజమని భావించిన ఫాలోవర్లు రిప్ కామెంట్స్ ఇవ్వడం ప్రారంభించారు.

10

అయితే ఇది రూమర్ అనీ, తమను నేరుగా ఎదుర్కోలేక దక్షిణ కొరియా చిల్లర పనులకు పాల్పడుతోందని ఉత్తరకొరియా సైన్యం పేర్కొంది.

11

కిమ్‌జాంగ్ మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన తర్వాత ఆ అకౌంట్ తనది కాదని.. తన పేరుతో వేరెవరో సృష్టించిన అకౌంట్ అని హన్ మిన్ గూ ప్రకటించారు.

12

ఏదేమైనా కిమ్ జాంగ్ మాత్రం ఇప్పట్లో తన దూకుడును తగ్గించేలా లేరని తెలుస్తోంది. ఇంకా మరిన్ని రాకెట్ ప్రయోగాలతో సిద్ధమవుతూ మేము జోకర్లం కాదని అమెరికాకు వణుకు పుట్టించే యోధులమని చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా పరిస్థితులు చెబుతున్నాయి.

13

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write North Korea says it successfully tests hi tech long-range rocket engine
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot