అమెరికాను ఒక్క బటన్‌తో బూడిద చేసి పారేస్తాం

By Hazarath
|

మా చేతిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలతో అమెరికాను బూడిద చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఒక్క బటన్.. ఒకే ఒక్క బటన్ నొక్కితే మీ రెండు దేశాలు నాశనమైపోతాయి. మమ్మల్ని రెచ్చగొడితే మీపై నిప్పులు కురిపిస్తాం. నిమిషాల్లో మీ నేలను బూడిదగా మార్చేస్తాం. పాతాళంలోకి నెట్టేస్తాం' ఇవి పేద దేశం నార్త్ కొరియా అమెరికాను ఉద్దేశించి అన్నమాటలు..మరి నార్త్ కొరియా దగ్గర అంతటి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయా.. నిజంగానే బూడిద చేసే అవకాశం ఉందా..ఆసక్తికర కథనం స్లైడర్‌లో

Read more: అమెరికా షాక్..యుద్ధానికి తొడగొట్టిన పేద దేశం

1

1

అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై నార్త్ కొరియా ఫైర్ అయింది. దీనికి తోడు నార్త్ కొరియాను మరింత రెచ్చగొట్టేలా అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను ముమ్మరం చేశాయి. దీంతో ఉత్తరకొరియా మరింత రగిలిపోతోంది.

2

2

ఉత్తరికొరియా మొండి వైఖరికి అనుగుణంగానే అటు అమెరికా, దక్షిణకొరియాల చర్యలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో విన్యాసాల పేరుతో ప్యాంగ్‌యాంగ్‌ను కవ్విస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి కూడా విన్యాసాలు చేపట్టినట్టు అమెరికా, దక్షణకొరియా చెబుతున్నా వాటి టార్గెట్‌ మాత్రం నార్త్‌కొరియానే.

3
 

3

సియోల్ ఆగ్నేయ తీరంలో చేపట్టిన మెరైన్స్ విన్యాసాలతో గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా దీనిపై ఘాటుగా స్పందించింది. కొరియన్‌ స్టైల్ లో తాము చేసే ఎదురు దాడికి అమెరికా, దక్షిణకొరియాల దిమ్మ తిరుగుతుందని అంటోంది పాంగ్‌యాంగ్.

4

4

వాషింగ్టన్, సియోల్‌ ను అణుబాంబు దాడితో బూడిద చేసేస్తానని చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌..ఈ సారి జలాంతర్గామి ద్వారా ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను సిద్ధం చేసామని అంటున్నారు. వీటి ప్రయోగాలకు సంబంధించి వీడియో ఫుటేజి కూడా విడుదల చేసింది ఉత్తరకొరియా.

5

5

అయితే ఇవి నిజమైనవి కావేమోనన్న అనుమానాలు వ్యక్తం చేసున్నారు నిపుణులు. మరోవైపు తమ అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కూడా ఉత్తరకొరియా వెల్లడించింది.

6

6

ప్రస్తుతం జాయింట్‌ మిలటరీ డ్రిల్‌లో అమెరికా సైనికులు 17 వేల మంది పాల్గొనగా 3 లక్షలమంది దక్షిణ కొరియా సైనికులున్నారు. సౌత్‌ కొరియాలో దాదాపు 28 వేల 5వందల మంది సైన్యాన్ని మొహరించింది అమెరికా.. క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

7

7

ఇక తమ దేశంపై యుద్ధానికి తెగబడితే అమెరికా గడ్డపైనేకాక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనూ బీభత్సం తప్పదని కొరిన్స్ పీపుల్స్ ఆర్మీ(కేపీఏ) అధికారికంగా వెల్లడించింది. ఉత్తర కొరియా చేసిన హెచ్చరికల నడుమ తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

8

8

ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలంటూ నార్త్ కొరియా నియంత నేత కింగ్ జాంగ్ ఉన్.. తమ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ద్వారా దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. అణ్వాయుధ దాడి సామర్థ్యం మరింత పెంచాలి.. కొత్తగా తయారుచేసిన అణ్వాయుధాల శక్తి తెలుసుకునేందుకు పరీక్షలు కొనసాగించాలని అధికారులకు అధ్యక్షుడు కిమ్ చెప్పారంటూ కేసీఎన్‌ఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

9

9

అమెరికా, సౌత్ కొరియాలు చేపట్టిన సైనిక కవాతును 'పిల్లగుర్రం- రాక్షసగద్ద'ల దుశ్చర్యగా అభివర్ణించిన నార్త్ కొరియా.. ఒకవేళ వారు కవ్వింపు చర్యలకు దిగితే మరుక్షణమే అణుబాంబు దాడులు జరుపుతామంది. ఆ మేరకు ఇప్పటికే సరిహద్దుల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంది.

10

10

అయితే ఏటా నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా ఇలాంటి హెచ్చరికలు సాధారణమే అయినా కొద్ది రోజుల కిందటే నార్త్ కొరియా అణు, హైడ్రోజన్ బాంబుల్ని పరీక్షించడం, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సౌత్ కొరియా, అమెరికాకు చెందిన బలగాలు భారీ ఎత్తున కవాతులో పాల్గొంటుండటం గమనార్హం.

11

11

ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఆంక్షలను ఎదుర్కొంటున్న నార్త్ కొరియా పై మరికొన్ని షరతులు విధిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నార్త్ కొరియా రాకెట్ ప్రయోగాన్ని తప్పుపడుతూ ఐరాస తాజా ఆంక్షలు విధించింది. కాగా, నార్త్ పై ఐరాస ఆంక్షలను చైనా, రష్యాలు వ్యతిరేకించాయి.

12

12

ఇదిలా ఉంటే తమ శాస్త్రవేత్తలు మినీ న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేశారని, వాటిని బాలిస్టిక్ మిసైళ్ల మీద కూడా అమర్చగలమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ప్రకటించారు. గతంలో ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ఈ విషయం చెప్పినప్పటికీ.. అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం ఇది మొదటిసారి.

13

13

అణు వార్ హెడ్లతో కూడిన వివిధ రకాల వ్యూహాత్మక బాలిస్టిక్ మిసైళ్ల రూపకల్పన పైన పరిశోధనలు సాగించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. అణ్వస్త్రాల తయారీ, రాకెట్ పరీక్షల మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పటి నుంచి ఉత్తర కొరియా మరింత దూకుడు పెంచింది.

14

14

ఇక ముందు జాగ్రత్తగా దక్షిణ కొరియాలో అమెరికా బి-52 బాంబర్లను మోహరించింది. అణ్యాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఈ బాంబర్లకు వుంది. మరో వైపు ఉత్తర కొరియా క్షిపణి, అణు పరీక్షా కేంద్రాలను ఆక్రమించుకోవాలని అమెరికా పన్నాగాలు పన్నుతోంది.

15

15

అయితే మొత్తంగా ద. కొరియాతో కలిసి అది నిర్వహిస్తున్న సంయుక్త సైని క విన్యాసాలు ఉత్తర కొరియాను కవ్వించేందుకు ఉద్దేశించినవేనన్నది స్పష్టం. ఈ కవ్వింపు చర్యలపై ప్రపంచ దేశాలు ఎందుకు మాట్లాడడం లేదని ఉత్తర కొరియా ప్రశ్నిస్తోంది.

16

16

ఈ పరిస్థితుల్లో కొరియా ద్వీపకల్పంలో శాంతి చాలా అవసరం. ఇందుకోసం ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఆరు పార్టీల చర్చలను తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరముంది. లేకుంటే మరో వినాశానికి అది దారితీయక తప్పదు.

17

17

ఇది కూడా చదవండి. అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి.. 

 

 

18

18

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write North Korea plans For More hitech Nuclear Tests

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X