అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

Written By:

ప్రపంచదేశాల పెద్దన్న చాలా రోజుల తర్వాత కలవరపాటుకి గురవుతున్నారు. ఉగ్రవాదం, ఆయుధాల పేర్లు చెబితే ఉలిక్కిపడుతూ లేస్తున్నాడు. వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నాడు. కొంత కాలం నుంచి అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంపై కొన్ని దేశాలకు వార్నింగ్ లు కూడా ఇస్తోంది. మీరు ఆయుధాలను తయారుచేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ముఖ్యంగా పాకిస్తాన్ కు భారీగానే వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు ఇక కాలం చెల్లిందంటూ చేసిన హెచ్చరికలు ఇంకా వేడిని రగిలిస్తున్నాయి.

Read more: వామ్మో.. గుండె లేకుండానే 555 రోజులు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

అగ్రరాజ్యమైన అమెరికా నుండి పాక్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. అంతేకాదు పఠాన్ కోట్ కు సంబంధించిన విచారణలో భారత్ కు సహకారం అందించాలని ఆదేశించింది. ఇప్పుడు మరోసారి అమెరికా పాక్ కు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ దేశం పొరుగు గడ్డ మీద ఉగ్రవాదం పురుడుపోసుకుంటోందని అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగం చేశారు. దీంతో అమెరికా పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసింది.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

దీంతో 'మీ దేశ గడ్డ మీద నుంచి భారత్ పై జరుగుతున్న దాడులకు తక్షణమే చెక్ పెట్టాలని పాక్ కు అమెరికా నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న పాక్ కు అమెరికా నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

మొన్న ఓర్లాండోలో జరిగిన కాల్పులపై స్పందిస్తూ అమెరికాను కాని, ఆ దేశ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటే... ఐఎస్ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడ కూడా సురక్షిత స్థానం దొరికే అవకాశమే లేదని.. పూర్తిగా పెకలించేస్తాం అని ఆయన హెచ్చరించారు.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

ఇప్పటికే సిరియా అండ్ ఇరాక్ లో ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాము.. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 120 మంది అగ్ర నేతలను మట్టుబెట్టాము..అక్కడ ఆ సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి క్రమక్రమంగా ఉత్తర కొరియా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ వస్తోందని అమెరికా రీసెర్చ్ సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వెల్లడించింది.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

2014 చివరికి నార్త్ కొరియా వద్ద 2014 చివరకే 16 వరకూ అణ్వాయుధాలు చేరాయని, వాటి సంఖ్య ఇప్పుడు 21కి పెరిగి వుండవచ్చని అంచనా వేసింది. యురేనియంతో పాటు పెను విధ్వంసం సృష్టించగల ప్లూటోనియం అణ్వాయుధాలు ఆ దేశం వద్ద ఉన్నాయని భావిస్తున్నట్టు తెలిపింది.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

కిమ్ జాంగ్ అమ్ముల పొదిలో కనీసం 13 నుంచి గరిష్ఠంగా 21 వరకూ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, వాటి సంఖ్య ఇంకాస్త ఎక్కువగా అయినా ఉండవచ్చని ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు డేవిడ్ అల్ బ్రైట్, సెరీనా కెల్హర్ లు ఓ నివేదికలో తెలిపారు.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

ప్లూటోనియం ఇంధనాన్ని పెద్దఎత్తున తయారు చేసే పనిలో ఉత్తర కొరియా నిమగ్నమై ఉందని యూఎస్ ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల వ్యవధిలో ఈ నివేదిక బహిర్గతం కావడం గమనార్హం. యాంగ్ బయాన్ న్యూక్లియర్ సైట్ లోని రేడియో కెమికల్ ల్యాబొరేటరీలో ప్లూటోనియం తయారీ జరుగుతోందని వారు వివరించారు.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

దీంతో అమెరికా కలవరపాటుకు గురి అవుతోంది. ఉత్తరకొరియా ఎంతకైనా తెగిస్తుందని దానితో జాగ్రత్తగా ఉండాలని అంతే కాకుండా చైనా దానికి వంత పాడుతోందని రక్షణశాఖను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

ఈ వేడి ఇలా ఉంటే దలైలామా అమెరికా పర్యటనలో ఒబామాను కలవడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నిషేధించిన మత గురువుతో ఒబామా భేటి కావడంపై చైనా మండిపడింది..

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

అయితే చైనాలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న దలైలామాతో ఒబామా భేటీ కావటం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమేనని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లు కాంగ్‌ వ్యాఖ్యానించారు. 

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

ఈ భేటీ టిబెట్‌ స్వాతంత్య్రానికి, అక్కడి వేర్పాటు వాద శక్తులకు తప్పుడు సంకేతాలు పంపటమే కాక చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి, సహకారానికి గండి కొడుతుందన్నారు.

అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

అయితే చైనా హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా ఒబామా చాలా సేపు దలైలామా వివిధ అంశాలపై చర్చించారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమేనని.. ద్వైపాక్షిక చర్చలు కాదని వైట్ హౌస్ ప్రతినిది తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write North Korea may have 21 nuclear warheads or more: US think tank
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot