అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి

|

ప్రపంచానికే పెద్దన్న..అన్ని దేశాలు తనకు గులాం కావాలంటూ కలలు కంటున్న పెద్దన్న...ఎదురుతిరిగిన వారిని నామరూపాల్లేకుండా చేసేందుకు ఎంతకైనా తెగించే పెద్దన్న...తన డేగకళ్లతో ఎదుటివారు ఏం చేస్తున్నారో పసిగట్టగల అతిపెద్ద ఉగ్రవాదానికి నాయకుడు..ఉగ్రవాదం పేరుతో అలాగే తిరుగుబాటుదారుల పేరుతో అమెరికా ఇప్పటివరకు ఎంతమందిని బలి తీసుకుందో తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..అమెరికా ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో దాదాపు లక్షలకు లక్షల మంది మరణించారనే వాస్తవాలు అమెరికా కర్కశత్వానికి అమాయకుల కన్నీటి వేదనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి..ఈ గణాంకాలు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుంచి మొదలైన గణాంకాలు..మరి అమెరికా ఉగ్రదాహానికి ఎక్కడెక్కడ బలయ్యారు..కధనం చదవండి.

పెద్దన్న చెవిలో పాకిస్తాన్ అధ్యక్షుడి పూలు

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి రెండేళ్లయినా గడవకముందే..
 

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి రెండేళ్లయినా గడవకముందే..

అమెరికన్ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం కోటి మంది ప్రజానీకం మరణించారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి రెండేళ్లయినా గడవకముందే గ్రీస్ అంతర్యుద్ధంలో రైటిస్టులకు మద్దతుగా బలగాలను దించి వందలాది ఉద్యమకారుల చావుకు అమెరికా కారణమైంది.

1948 నుంచి ఆరేళ్ల పాటు ఫిలిప్పైన్స్‌లో హక్‌ల తిరుగుబాటును..

1948 నుంచి ఆరేళ్ల పాటు ఫిలిప్పైన్స్‌లో హక్‌ల తిరుగుబాటును, 1950లో పోర్టరికోను ఆక్రమించడమే కాకుండా స్థానికుల తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.

1950లలో కొరియన్ సంక్షోభంలో జోక్యం చేసుకుని..

1950లలో కొరియన్ సంక్షోభంలో జోక్యం చేసుకుని వేలాది కమ్యూనిస్టులను ఊచకోత కోసింది.

ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసి రాజు షాను ..

1953 లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసి రాజు షాను గద్దెనెక్కించింది.

1954లో గ్వాటేమాలలో..
 

1954లో గ్వాటేమాలలో..

1954లో గ్వాటేమాలలో అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని దించేసి సైనిక ముఠాకు పగ్గాలప్పగించింది.

1960లో వియత్నాం అంతర్గత వ్యవహారాల్లో..

1960లో వియత్నాం అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి కమ్యూనిజాన్ని అంతం చేసే పేరిట పదిహేనేళ్ల పాటు క్రూర దమనకాండను కొనసాగించి బాంబుదాడులు చేసి 20 లక్షల ప్రాణాలను హరించింది.

ఇదే కాలంలో కంబోడియాలో, లావోస్‌లో సైతం బలగాలను దించి..

ఇదే కాలంలో కంబోడియాలో, లావోస్‌లో సైతం బలగాలను దించి మరో 20లక్షల మంది చావుకు కారణమైంది.

1961లో క్యూబాలో, 1962లో లావోస్‌లో, 1964లో పనామాలో ..

1961లో క్యూబాలో, 1962లో లావోస్‌లో, 1964లో పనామాలో జోక్యం చేసుకుంది.1965లో ఇండోనీషియాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసింది. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో 10 లక్షల మంది చనిపోయారని అంచనా.

1965-66లో డొమినిక్ రిపబ్లిక్‌లో, గ్వాటెమాలలో, 1970లో ఒమన్‌లో ..

1965-66లో డొమినిక్ రిపబ్లిక్‌లో, గ్వాటెమాలలో, 1970లో ఒమన్‌లో సైనికచర్యలు నిర్వహించింది. 73లో చిలీలో సైనిక కుట్ర చేసి అధ్యక్షుడు అలెండీ సహా వందలాది మంది కమ్యూనిస్టులను హత్యచేసింది.

1980లలో నికరాగ్వాలో అమెరికా సాగించిన మారణకాండను.

1980లలో నికరాగ్వాలో అమెరికా సాగించిన మారణకాండను ప్రపంచ న్యాయస్థానం సైతం అంతర్జాతీయ ఉగ్రవాదంగా అభివర్ణించింది.

1982-84 మధ్య లెబనాన్‌లో విధ్వంసం..

1982-84 మధ్య లెబనాన్‌లో విధ్వంసం సృష్టించింది. 1984లో గ్రెనెడా సర్కారును కూలదోసింది. 1989లో పనామాపై దాడిచేసి అధ్యక్షుడిని బంధించి అమెరికన్ జైలులో ఖైదు చేసింది.

1990లో అంతర్గత సంక్షోభంతో సోవియట్ క్యాంపు కుప్పకూలిన తర్వాత..

1990లో అంతర్గత సంక్షోభంతో సోవియట్ క్యాంపు కుప్పకూలిన తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేకుండా పోయింది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగానే దాడులను కొనసాగిస్తోంది.

9/11 తదనంతర పరిణామాల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై దాడిచేసి..

9/11 తదనంతర పరిణామాల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై దాడిచేసి ఆక్రమించుకుంది. ఇక ఇరాక్ సంగతి మనకు తెలిసిందే. బాంబుల వర్షంతో ఇరాక్‌ను వల్లకాడు చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో లిబియా అధినేత గడ్డాఫీని అంతమొందించింది.

సిరియాపై కారాలు మిరియాలు..

ఆపరేషన్ ఇరాన్ బాటలో పయనిస్తూ ఆ మార్గంలో అడ్డుగా నిలిచిన సిరియాపై కారాలు మిరియాలు నూరుతోంది.రష్యా అండతో సిరియా అమెరికాకు ఎదురు తిరిగింది.

కొలంబస్ ఆ గడ్డపై కాలుమోపిన నుంచీ అమెరికన్ చరిత్ర..

కొలంబస్ ఆ గడ్డపై కాలుమోపిన నుంచీ అమెరికన్ చరిత్ర అంతా మూలవాసుల అస్తిత్వాన్ని, దేశాల సార్వభౌమత్వాన్ని, స్థానిక పాలకుల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన చరిత్రే. అయితే, ప్రపంచం నలుమూలలా అమెరికా ఆధిపత్య ధోరణులపై తిరగబడుతున్నారు.

అమెరికన్ బలగాలు వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి...

నాడు వియత్నాంలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగానే నేడు ఆఫ్ఘనిస్తాన్‌లోనూ తీవ్ర ప్రతిఘటనతో అలాగే సిరియాలో రష్యా అండతో అమెరికన్ బలగాలు వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పులిలా పంజా విసురుతున్న అమెరికా చివరకు కాగితపు పులై ..

భారీగా బలగాలు, లెక్కకు మిక్కిలి ఆయుధాలు, అణుబాంబులతో పులిలా పంజా విసురుతున్న అమెరికా చివరకు కాగితపు పులై ప్రజా వెల్లువలో కొట్టుకుపోవడం ఖాయమని పలు దేశాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write How many people had died in all the American weapons wars

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more