ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

Written By:

ప్రపంచానికి సవాల్ విసురుతూ తన దైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న ఉత్తరకొరియా మరో సారి నిప్పులు కక్కింది. తమ దేశం మీదకు ఎవరైనా దండయాత్రకు వస్తే చేతులు ముడుచుకు కూర్చోమని వారికి తగిన బుద్ధి చెబుతామంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాకుండా అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్యాంగ్‌యాంగ్ మళ్లీ అణ్వస్త్ర పరీక్షలతో అగ్రదేశాల్ని హడలెత్తిచేందుకు రహస్య పరీక్షలు జరుపుతోంది. మిగతా కధనం స్లైడర్‌లో

Read more: ఈ సారి దక్షిణ కొరియా నేలమట్టమయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

తమ జోలికి రాందే తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని టచ్ చేస్తే మాత్రం అణ్వాయుధాలుతో విరుచుకుపడతామని ఉత్తరకొరియా ఘాటు హెచ్చరికలు చేసింది. ఆ దేశ వివాదాస్పద అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ దాదాపు పది హేను నిమిషాలపాటు ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్బంగా కిమ్ జాంగ్ ఈ ఘాటైన హెచ్చరికలు పంపారు. అణ్వాయుధ రహిత ప్రపంచంగా అవతరించేందుకు తమ వంతు కృషి కూడా చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని తమ శత్రు దేశలపై కూడా తమకు గౌరవం ఉంటుందని ఈ సంధర్భంగా అన్నారు.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

అణ్వాయుధాలు కలిగిన మరో దేశం నుంచి బెదిరింపులు వచ్చినప్పుడు దేశ సార్వభౌమాదికారం ప్రమాదంలో పడుతుందని, అలాంటి సందర్భంలో మనం సైతం అణ్వాయుధాలను వినియోగించాల్సి ఉంటుందని కిమ్ పేర్కొన్నట్టు ప్రభుత్వ మీడియా వెల్లడించింది

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

2003లో నాన్ ప్రొలిఫిరేషన్ ట్రియటీ (ఎన్‌పిటి) నుంచి ఉత్తరకొరియా వైదొలిగింది. 2006లో తొలి న్యూక్లియర్ ప్రయోగాన్ని జరిపింది. అణ్వస్త్రదేశంగా దేశం రూపుదిద్దుకున్నప్పటికీ ముందుగా తాము అణ్వస్త్రాలను ప్రయోగించబోమని నార్త్‌కొరియా అప్పట్లో ప్రకటించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

దక్షిణకొరియా, అమెరికా ఇప్పటికే ఉత్తరకొరియా ప్రయోగాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆంక్షలకు దిగడం, సంయుక్త యుద్ధ విన్యాసాలు జరపడం వంటివి ఉభయకొరియాల మధ్య యుద్ధవాతావరణం సృష్టించాయి.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఈ నేపథ్యంలో దేశ సార్వభౌమాధికారానికి అణ్వస్త్ర దేశాల నుంచి ముప్ప తలెత్తితే తాము సైతం అణ్వస్త్రాల వినియోగానికి వెనుకాబడమంటూ కిమ్ సంచలన ప్రకటన చేశారు.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఇదిలా ఉంటే ఉత్తర కొరియా త్వరలో ఐదో అణుపరీక్షకు సిద్ధమవుతున్నట్టు అమెరికాకు చెందిన 38 నార్త్ అనే వెబ్‌సైట్ కీలక ఆధారాలను సేకరించింది. అందుకు సంబంధించిన శాటిలైట్ ఆధారిత చిత్రాలను సేకరించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఉత్తర కొరియాలోని భూగర్భ కమాండ్ సెంటర్‌లో భారీగా మోహరించిన వాహనాల దృశ్యాలను బయటపెట్టింది. పరీక్ష నిర్వహించే పంగ్గ్యేరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కమాండ్ సెంటర్లో తాజాగా చోటుచేసుకొంటున్న పరిణామాలన్నీ అణుపరీక్ష నిర్వహణకు సంకేతమని ఆన్‌లైన్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఉత్తరకొరియా తన ఐదో అణుపరీక్ష ఏక్షణంలోనైనా చేపట్టవచ్చని దక్షిణకొరియా ప్రభుత్వ అధికారులు ప్రకటన చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నది. చివరి సారిగా ఆ దేశం జనవరిలో అణుపరీక్ష జరిపింది. దీనిని కలుపుకుని 2006 తరువాత కొరియా 4 అణుపరీక్షలు నిర్వహించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఈ నేపథ్యంలో ఐదో అణుపరీక్షకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్టు వెలువడుతున్న వార్తలను ఆ దేశ నేత కిమ్ జంగ్‌ ఉన్ ఖండించారు. అలాందేమి లేదంటూనే జనవరి 6న జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్ష అద్భుతం.. థ్రిల్లింగ్ అంటూ ప్రశంసించడం గమనార్హం.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

ఇదిలా ఉంటే అమెరికా తమ వైరిదేశం దక్షిణకొరియాతో కలిసి సరిహద్దుల్లోని తమ సైనికుల మీదకు తుపాకులను గురి పెట్టిస్తోందంటూ ఉత్తరకొరియా ఆరోపించింది. యూఎస్ సైనికులు దుశ్చర్యలను మానుకోకపోతే మూల్యం చెల్లించుకుంటారని ఉత్తరకొరియా సైన్యం హెచ్చరించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

గతవారం అమెరికా జీఐలు సమాయత్తం చేసుకున్న ఆయుధాలతో సౌత్ కొరియన్ల ద్వారా ప్రమాదకరమైన హెచ్చరికలు చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. ఉత్తరకొరియా సైనికుల వైపుకు వేళ్లు చూపుతూ గద్గద స్వరాలను వినిపించారని, ముఖ కవళికల్లో అసహ్యంగా ప్రవర్తించారని వివరించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

2006లో ఉత్తరకొరియా తొలి న్యూక్లియర్ ప్రయోగం చేసినప్పటి నుంచి అమెరికా తరచుగా సరిహద్దుల్లో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. దీనికి దీటుగానే సమాధానం ఇస్తూ వస్తున్న రాజరికపు దేశం బోర్డర్లలోని సైనికులను అప్పుడప్పుడూ రెచ్చగొడుతూ వస్తోంది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

తాజాగా చేసిన ఆరోపణలు ఉత్తరకొరియా చేపట్టిన రెండు మీడియం రేంజ్ క్షిపణ ప్రయోగాలు విఫలం అయినదానిపైనే అన్న విషయం అర్థమవుతూనే ఉంది. ప్రతి ఏడాది దక్షిణ కొరియా, అమెరికాలు చేపట్టే కవాతుకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా వరుస ప్రయోగాలు చేస్తోంది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

1950-53 మధ్య జరిగిన యుద్ధానంతరం మొదలైన ఉత్తర, దక్షిణ కొరియాల వైరం ఇప్పటికే చల్లారకుండానే మిగిలేవుంది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఒప్పందం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

దీంతో రెండు దేశాల మధ్య సైనికులను నాలుగు కిలో మీటర్ల దూరం(పన్ మున్జోమ్) ప్రాంతంలో మొహరించకుండా ఉండేట్లు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో అమెరికా దాదాపు 28,000 మంది సైనికులను దక్షిణకొరియా సరిహద్దుల్లో మొహరించింది.

ఉత్తర కొరియా నిప్పులు: ఏ క్షణంలోనైనా దాడి

అయితే, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది దేశాల మధ్య ఏర్పడే వాతావరణాన్ని బట్టి ఉంటంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Satellite photos reveal North Korea is planning fresh nuclear bomb tests as Kim Jong-un tightens his grip on Pyongyang and is elevated to the same status as his 'dear' father
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot