ఆ పర్వతంలో కళ్లు చెదిరే దేవ రహస్యాలు, ప్రపంచానికి తెలియని ఎన్నో వింతలు

  ఆ ప్రదేశం ఓ అగ్నిపర్వతంలాగుంటుంది. పర్వతాలకు దూరంగా ఎక్కడో ఒంటరిగా గంభీరంగా నిలిచి ఉంటుంది. సియర్రా నెవడా పర్వత శ్రేణికి దూరంగా, కాస్కెడ్ పర్వత శ్రేణికి దగ్గరగా సముద్రమట్టానికి దాదాపు 4,322 అడుగుల ఎత్తులో చూపరులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది. అదే కాలిఫోర్నియాలోని మౌంట్ శాస్తా పర్వతం. అయితే ఇది అందరికీ తెలిసిన విషయాలు.. కాని ఆ పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ప్రపంచానికి తెలియని ఎన్నో వింతలు దాగున్నాయి.

  అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  ప్రపంచంలో చాలామంది ఈ స్థలాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నార్త్ కాలిఫోర్నియా దగ్గర్లోని ఓర్గాన్ బార్డర్ కు 45 మైళ్ల దూరంలో సిస్కియు దగ్గర ఈ పర్వతం ఉంది. ఇక్కడ యుఎఫ్ ఓలు తిరుగుతుంటారని అలాగే ఎన్నో అతీత శక్తులు ఇక్కడ ఉన్నాయని. దేవతలు సంచరిస్తుంటారనే ప్రచారం కూడా ఉంది.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి అనేక శక్తులు సిద్ధించాయని వందల సంవత్సరాల నుంచి అక్కడ మనుషులు సంచరిస్తున్నారని వారికి ప్రపంచానికి తెలియని ఎన్నో శక్తులు తెలుసని. ఇంకా చెప్పాలంటే అదొక ఆధ్యాత్మిక సుడిగుండమని అక్కడికి వెళ్లినవారు సైతం చెబుతున్నారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  ఇక అక్కడ జీవించిన వారు దాదాపు 10 అడుగుల ఎత్తు ఉంటారని చరిత్ర సైతం చెబుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. మరి అది అండర్ గ్రౌండ్ లోకి ఎందుకువెళ్లింది..? ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఎందుకు దాక్కుందో తెలుసుకోవాలంటే చరిత్రపుటలను ఓ సారి పరిశీలించాలి.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అయితే ఆ ప్రదేశంలోకి ఆ శక్తులు ఎలా వెళ్లాయనేదానికి అప్పుడు వలసలు జరిగిన లెమూరియా చరిత్ర గురించి తెలుసుకోవాలి. లెమూరియా అనేది ఓ కనిపించని మిస్టరీ ఖండం. ఈ దక్షిణసముద్ర ఖండం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సముద్రంలో మునిగిపోయిందని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అనేక శతాబ్దాల క్రితం తమిళనాడు, కేరళ ప్రాంతాల క్రింది భూభాగంలో ప్రస్తుత భారతదేశము నుంచీ, ఒక పక్క ఆస్ట్రేలియా దాక, మరొక పక్క ఆఫ్రికాలోని మెడగాస్కర్ దాకా ఓ ఖండం వ్యాపించి వుండేదని దానిపైన ఒక గొప్ప సంస్కృతి విరాజిల్లుతూ వుండేదని చరిత్రకారులు చెబుతున్నారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అయితే ఈ మిస్టరీ ఖండం ఎక్కడ ఉండేది ఎలా కనుమరుగయ్యింది అనే దానిపై అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఫసిపిక్ మహా సముద్రంలో మునిగిపోయిందని కొందరు వాదిస్తే మరికొందరు హిందూ మహా సముద్రంలో మునిగిపోయిందని వాదిస్తారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అయితే ఈ లెమూరియా ఖండంపై ఖచ్చితమైన ఆధారాలు కొన్నేళ్లవరకు తెలియలేదు. కాని 1864 ప్రాంతంలో పిలిప్ స్కాల్టర్ జరిపిన పరిశోధనలలో మడగాస్కర్, భారతదేశాలలో దొరికిన మృగశిధిలాలను పరీక్షించి, ఈ రెండు ప్రాంతాలలోనూ ఒకే జాతి జీవులు వుండేవని నిర్థారించాడు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  మరి ఇలా జరగాలి అంటే ఈ రెండు ప్రాంతాలకూ మద్య ఏదైనా వారధి కానీ, లేక రెండు ప్రాంతాలూ ఒకే భూభాగానికి చెందినవి కానీ అయివుండాలని నిర్థారించాడు. 

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అలా ఈ లెమూరియా అన్న పదం ఆంగ్లంలో ఆనాటి నుంచి స్థిరపడింది. వెరసి ఆ కథనం ప్రకారం, లెమూరియా ప్రాంతంలో ప్రళయం సంభవించి, ఆ ప్రాంతం అంతా మునిగి పోయిందని తమిళ, కన్నడ పురాణాలు చెబుతున్నాయి. కన్నడ పురాణం ప్రకారం అది సముద్రంలో మునిగిపోతే ఆ ఊరిని పరుశురాముడు మళ్లీ పైకి తెచ్చాడనే కథనం కూడా ఉంది. నిజమెంతో తెలియదు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  మరి మౌంట్ శాస్తాకు లెమూరియాకు ఉన్న సంబంధం ఏంటనే అనుమానం చాలామందికి రావచ్చు. దానికి కూడా బలమైన కారణాలు చెబుతున్నారు. మౌంట్ శాస్తా వద్ద నివసించే బుషులంతా లేమూరియా నుంచి వలసలు వెళ్లినవారేనట.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  తాము బుషులు కాబట్టి లేమూరియా ప్రాంతం భూమిలో మునిగిపోనుందని ముందే గ్రహించి దాదాపు 25వేల మంది సన్మార్గులు అక్కడి నుంచి వలసలు వెళ్లిపోయారని వినికడి. అలా వారు ఓ సుదూర ప్రాంతాన్ని ఎన్నుకుని దానికి మౌంట్ శాస్తా అని పేరు పెట్టుకుని తన ఆవాసాన్ని ఏర్పరచుకున్నారని కొంతమంది చెబుతారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అయితే ఈ లెమూరియన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఓ పెద్ద రహస్యమే. వారంతా మౌంట్ శాస్తా పర్వతం కింద ఓ పెద్ద పట్టణాన్ని నిర్మించుకుని అందులో ఉంటున్నారని స్థానిక కధనాలు చెబుతాయి.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  వారు కంటికి కనపడరని వారు అజ్ఞాతంగా 5వ డైమెన్షన్లో (5th Dimension) వుంటారని ఈ ప్రభావంతో వారు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారని ఇది సామాన్య మానవులకు సాధ్యం కానిదని వారి సగటు ఎత్తు దాదాపు 10 అడుగులు ఉంటుందని చెబుతారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  మొత్తంగా వారి జనాభా ఇప్పుడు 2 లక్షలు దాటిందని, వారు విజ్ఞానంలో మనందరి కన్నా ఎంతో ముందున్నారని; మనోవేగంతో ప్రయాణించగలరని, అందరూ తపశక్తి సంపన్నులని, వారి సాంగత్యంతో ఆ శాస్తాపర్వతం అతి పవిత్రమయ్యిందని అక్కడి స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  దీనికి కొన్ని ఆధారాలు కూడా లభించాయి. 1904వ సంవత్సరంలో లార్డ్ కౌడ్రయ్ మైనింగ్ కంపెనీకి చెందిన జె.సి.బ్రౌన్ అనే బ్రిటీష్ పరిశోధకుడు బంగారపుగనుల అన్వేషణ నిమిత్తమై ఇక్కడకి వచ్చినప్పుడు, తానొక 11 మైళ్ళ పొడవున్న గుహ నొకటి కనుగొన్నాడట.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  ఆ భూగర్భంలోని గుహలో బంగారపు గనులకు బదులుగా ఏకంగా బంగారు ఆభరణాలను, నిక్షేపాలనూ కలిగిన ఒక సువిశాలమైన శిధిలమైన గ్రామాన్నే చూచాడట. అక్కడ దొరికిన మమ్మీలను చూస్తే వాటి పొడవు 10 అడుగుల దాకా ఉన్నాయట.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  తాను చూసినది తానే నమ్మలేక 30 సంవత్సరాల తరువాత జాన్ రూట్ అనే వ్యక్తికి చెప్పాడట. అప్పుడు జాన్ రూట్ 80మంది బలగం కల ఒక జట్టుని తయారుచేసి, స్టాక్‌టన్ నగరం నుంచీ శాస్తా గుహలను పరిశోధించడానికి నడుకట్టాడట. కానీ ఆ జట్టు బయలుదేరాల్సిన రోజు నుంచీ బ్రౌన్ కనిపించలేదట. ఆనాటి నుంచీ శాస్తా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అయితే దాదాపుగా ప్రతి ఆరువందల సంవత్సరాలకొకసారి ఈ అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుందట. ఇప్పటికి రెండు వంద స.రాలకు పూర్వం ఇలాంటి సంఘటన జరిగిందట.మళ్లీ ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందోనని అక్కడి వాసులు కలవరపడుతున్నారు. 

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  ఇలా ఎన్నో ప్రపంచానికి తెలియని రహస్యాలు ఆ మౌంట్ శాస్తాలో దాగున్నాయని తెలుస్తోంది. మరి దీనిపై ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. సైన్స్ పరంగా దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగితే కాని అసలైన వాస్తవాలు బయటకు రావు.

  మౌంట్ శాస్తా.. ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట

  అప్పుడు ప్రపంచానికి తెలియకుండా మాయమైన ఓ అద్భుత ఖండం గురించిన వాస్తవాలు బయటకొస్తాయి. ఆ పర్వతంలో దాగున్న రహస్యాలు తెలుస్తాయి. మరి చరిత్రకారులు, సైంటిస్టులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write Secrets Of Mount Shasta One Of The Most Sacred Places On Earth
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more