లవర్‌తో రొమాన్స్ కోసం రూములు దొరకడం లేదా..

Written By:

పెళ్లికాని జంటలు ముద్దు ముచ్చట్ల కోసం తహతహలాడుతుంటారు. ఇక సరససల్లాపాలకయితే చోటు ఎక్కడ దొరుకుతుందా అని తెగ వెతుకుంటారు. అయితే వీరి కోసం ఓ కొత్త వ్యాపారం మొదలయింది. పెళ్లి కాని జంటలకు ప్రైవసీ కల్పిస్తానంటూ కొత్త వ్యాపారం ప్రారంభించాడు సంచిత్ సేథి.. స్టే అంకుల్ పేరుతో ఓ కొత్త స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు బిట్స్ పిలానీ మాజీ స్టూడెంట్.

Read more : నెట్‌లో అమ్మకానికి పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్: నో డిస్కౌంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

స్టే అంకుల్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి పెళ్లి కాని జంటలు ఏకాంతంగా కలుసుకోవడం కోసం గదులు అద్దెకిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్‌ దేశంలోని పలు హోటళ్లతో అనుసంధానమై గదులు బుక్‌ చేసి కావాల్సిన వారికి అద్దెకిస్తుంది.

2

దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10-12 గంటల పాటు గడపొచ్చు. కావాలనుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు లేదా, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు ఉండొచ్చు.

3

ఇందుకు గంటకు ఇంత చొప్పున వసూలు చేస్తారు. సౌకర్యాలను బట్టి రెండు నుంచి ఏడు వేల వరకు వసూలు చేస్తారు. ఈ గదుల్లో ఎలాంటి సంకోచమూ లేకుండా పెళ్లి కాని జంటలు ఏకాంతంగా గడపవచ్చు. పగలు, రాత్రి సమయాల్లో కూడా గదులు అద్దెకు లభిస్తాయి.

4

అయితే ఇలా ఏకాంతంగా గడపదలుచుకున్న వ్యక్తులు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన ఐడెంటిటీ కార్డులు చూపించవలసి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో వివిధ నగరాల్లో తమతో అనుసంధానమైన హోటళ్ల జాబితా ఉంటుంది.

5

నిజానికి భారతదేశంలో చట్టాల ప్రకారం పెళ్లికాని జంటలు గది అద్దెకు తీసుకోకూడదని ఎక్కడా లేదని, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గది అద్దెకు తీసుకోవచ్చని సంచిత్ సేథి చెబుతున్నారు.

6

వాటిలో ఏదో హోటల్‌ ఎంచుకుని గది అద్దెకు తీసుకోవడమే. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రస్తుతం దీనికి ఆదరణ క్రమంగా పెరుగుతోందని సంచిత్‌ తెలిపారు. ప్రేమికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులే తనకు ఇలాంటి ఐడియా వచ్చేదుకు కారణమంటాడు సంచిత్ సేథి.

7

ఈ వెబ్‌సైట్ ప్రారంభించిన కొత్తలో పర్యాటకులు ఎక్కువగా వస్తారని అనుకున్నారు. కానీ పెళ్లికాని జంటల నుంచి పదేపదే తమకు హోటల్ గదులు కావాలని రిక్వెస్టులు రావడంతో అటుదిశగా చర్యలు ప్రారంభించారు.

8

అయితే అమ్మాయి, అబ్బాయి హోటల్ రూంకు ఎందుకు వస్తారో మనకు తెలియంది కాదు.. తప్పు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఈ వ్యాపారం తప్పుకాదా.. అని అడిగితే.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని సెలవిస్తున్నాడు. అవును మరి ఒకరి అవసరాలే.. మరొకరి వ్యాపార అవకాశాలుగా మారతాయంటే ఇదే మరి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write startup will help unmarried couples book hotel few hours
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot