గుండెను పిండేస్తున్న హిరోషిమా విషాద వాస్తవాలు, అమెరికా ఆధిపత్యమే కారణం

|

చరిత్రలో చూడనిది.. ఊహించడానికి కూడా సాహసించలేనిది. ఏదైనా ఉంది ఉంటే అది హిరోషిమా విషాదమే. 70 ఏళ్ల క్రితం నేలమట్టమైన నగరం.ప్రపంచం ఇప్పటికీ ఆ గాయాన్ని మర్చిపోలేకపోతోంది. అయితే ఆ యుద్దానికి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. కాని ఆ యుద్ధానికి రెండవ ప్రపంచయుద్ధానికి అసలు సంబంధం లేదంటే నమ్ముతారా..అమెరికా ఆధిపత్యానికే ఆయుద్ధం జరిగిందంటే నమ్ముతారా ఏది నిజం.

Read more: అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

1945, ఆగస్టు 6.. ఉదయం గం.8.15 నిమిషాలు. మరియానా ద్వీపం నుంచి బి-29 అనే బాంబర్ విమానం జపాన్‌లోని హిరోషిమా నగరంపైకి వచ్చింది. అత్యంత శక్తిమంతమైన బాంబును ఈ అమెరికన్‌ యుద్ధ విమానం జారవిడిచింది. అదే లిటిల్‌ బాయ్‌. పేరులో మాత్రమే లిటిల్‌. కానీ మానవ చరిత్రలోనే అత్యంత పెను విషాదాన్ని, కనీవిని ఎరగని మారణహోమాన్ని సృష్టించే బాంబుగా దీనిని ఎవరూ ఊహించలేదు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

3 లక్షల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు పెంచింది. 28 మీటర్ల వ్యాసంలో భారీ అగ్నిగుండం ఏర్పడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అణుబాంబు పేలుడు ధాటికి హిరోషిమా ప్రజల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అణుబాంబు ద్వారా ధ్వంసం చేయబడ్డ తొలి నగరంగా హిరోషిమా చరిత్ర పుటలకెక్కింది. ఊహించని పేలుడుకు 90వేల మంది అసువులు బాసారు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం
 
అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

మళ్లీ మూడు రోజులకే అంటే... ఆగస్టు 9, 1945 నాగసాకిపై మరో అణుబాంబు. ఈసారి లిటిల్‌ బాయ్‌ కాదు.. ఫ్యాట్ మ్యాన్‌. కొకిరో పట్టణాన్నిటార్గెట్‌ చేసింది. కాని వాతావరణం అనుకూలించకపోవడంతో నాగసాకిపై వదిలింది. కొకిరోకు బదులుగా నాగసాకి క్షణాల్లో మాడిమసైంది. శక్తివంతమైన పేలుడుకు 40వేల మంది అలాగే ఏడాదిలోనే దాదాపు లక్షమంది అమాయక ప్రజలు బూడిదయ్యారు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

మన పాఠ్య పుస్తకాలు చెప్పేవి ఏమిటంటే అమెరికా జరిపిన అణు బాంబుల దాడుల వల్లే జపాను యుద్ధ విరమణ చేసి మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. ఆ విధంగా రెండవ ప్రపంచయుద్ధం పరిసమాప్తమైంది. వాస్తవాలను చూస్తే అమెరికా ఆధిపత్యానికి, అహంకారానికే ఈ పెను విషాదం జరిగిందని తెలుస్తోంది. రెండవ ప్రపంచయుద్ధానికి దీనికి సంబంధంలేదని తెలుస్తోంది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ ఈ ఘోరకలిపై మాట్లాడుతూ ఈ అటామిక్‌ బాంబ్‌‌ను ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం. ఈబాంబులు వేయకుంటే ఉన్మాద జపనీయులు లొంగిపోయి ఉండేవారు కాదన్నారు. అంతే కాకుండా లక్షల కొలది అమెరికా వీర సైనికులు తమ ప్రాణత్యాగం చేయ వలసి వచ్చేది'' అని అన్నాడు

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

దీనిని బట్టి అణుబాంబు దాడులను అమెరికా ఉద్దేశ పూర్వకంగానే చేసింది . దాని వెనుక గల రాజకీయాలు వేరే వున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులుపై కొన్ని సంవత్సరాల క్రితమే అమెరికా వర్గీకరణ ఎత్తివేసింది. కావున అవన్నీ నేడు బహిరంగ పత్రాలుగా మారి చరిత్ర పరిశోధకులకు నిజాలను తెలియజేస్తున్నాయి.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అణుబాంబును రూపొందించే ప్రక్రియ అమెరికాలో 1942లో అత్యంత గోప్యంగా న్యూయార్కులోని మాన్‌హట్టన్‌లో మొదలైంది. అందుకని ''మాన్‌హట్టన్‌'' ప్రాజెక్టుగా పేర్కొంటారు. జర్మనీలో నాజీలు అణు బాంబును రూపొందిస్తున్నారు, అది ప్రపంచానికి అత్యంత ప్రమాదం. సో నాజి జర్మనీని ఎదుర్కోవాలంటే అమెరికా కూడా అణుబాంబును తయారుచేయాలి. ఇవి బయటి ప్రపంచానికి నమ్మబలికిన కారణాలు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

కాని ప్రముఖ అమెరికా రచయిత మికిజడ్‌ తన వ్యాసంలో అసలు నాజి అణు బాంబు అనేదే ఒక బూటకమని అంటాడు. అప్పటి బ్రిటిష్‌ సీక్రెట్‌ ఇంటిలిజెన్స్‌ సర్వీసు (ఎస్‌.ఐ.ఎస్‌.) అధికారిక పత్రాల సమాచారాన్ని బట్టి జర్మనీలో అణుబాంబు ప్రాజెక్టులంటూ ఏవీ లేవని స్టీవర్ట్‌ ఉధాల్‌, మాక్‌ జార్జ్‌ బండి మొదలగు చరిత్రకారుల రచనలను వుటంకిస్తూ మికిజడ్‌ తన వాదన వినిపిస్తాడు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

ఈ విషయం అట్లా వుంచితే, జర్మనీ అధికారిక లొంగుబాటు 1945 మే7న జరిగినప్పటికీ, దాని వరుస ఓటముల పర్వం 1943 జనవరి నుండే మొదలైంది. జర్మనీ అపజయాల పరంపరను తెలుసుకున్న హిట్లర్‌ ఏప్రిల్‌ 30, 1945న తన మిలిటరీ బంకర్లోనే తుపాకితో పేల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జర్మని ఓటమి మరింత ప్రస్పుటమైంది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

దీనితో నాజీ జర్మని అణుబాంబు భయం కూడా తేటతెల్లమైంది. అమెరికా ఎలాగైనా నూతన బాంబును తయారుచేసి దానిని ప్రయోగించి ప్రపంచానికి, ముఖ్యంగా అప్పటి సోవియట్‌ యూనియన్‌కు తన మేటి సైనికసత్తా ప్రదర్శించి ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేయాలనుకుంది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్య కూటమికి వ్యతిరేకంగా వున్న మూడు రాజ్యాల కూటమిలోని ఇటలీ, జర్మని కంటే సుమారు రెండు సంవత్సరాల ముందే 1943 సెప్టెంబరులో లొంగిపోయింది. జర్మని లొంగుబాటు తరువాత ఒంటరైన జపాన్‌ 1945 జూలై నుండి తన లొంగుబాటుకు అవసరమైన అంశాలపై సోవియట్‌ యూనియన్‌తో అనధికారిక సంప్రదింపులు మొదలుపెట్టింది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

ఆ విధంగా జపాన్‌ లొంగుబాటు తథ్యమని మిత్ర రాజ్యాల కూటమికి తెలిసిపోయింది. అట్లాంటి సందర్భంలో జరగాల్సింది దౌత్య ప్రక్రియ జరగాలి కాని అణుబాంబుల దాడి కాదు. సోవియట్‌ యూనియన్‌తో జపాన్‌ జరుపుతున్న సంప్రదింపుల సమాచారం తెలిసి కూడా అమెరికా తన సత్తాను చూపడానికే బాంబుల వర్షం కురిపించిదనేది చరిత్రకారుల అభిప్రాయం.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

బాంబులు వేయడంలో కూడా జాతి పరమైన అంశాలు ముందుకు వచ్చాయి. యూరపులోని ప్రజలు, అమెరికాలోని ప్రజలు ఒకే శ్వేత జాతి సంతతే. కావున అక్కడి కంటే వేరే జాతికి చెందిన ఆసియాలోని జపానులో వేయడమే సరైందనే నిర్ణయానికి అమెరికా వచ్చింది. 

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

ఈ మేరకు ఒక టార్గెట్‌ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీనే క్యోటో, హిరోషిమా, కోకురా, నాగసాకి. నిగాతలపై కాకుండా మరోచోట బాంబులు వేయాలని నిర్ణయించింది. ఈ మర్మం తెలియని ఈ నగరాల ప్రజలు తమ నగరాలపై అమెరికా సైన్యాలు బాంబుల వర్షం కురిపించక పోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రాజధాని టోక్యో కాకుండా మొదటి టార్గెట్‌గా క్యోటోను ఎన్నుకోవడం వెనక కూడా మతలబు వుంది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

టోక్యో కేవలం చక్రవర్తి స్థానమనే పేరు గాని దానికి వ్యూహాత్మక ప్రాధాన్యత లేదు.అందువల్ల క్యోటోనే అటంబాంబు దాడికి ప్రప్రథమ లక్ష్యంగా టార్గెట్‌ కమిటీ మే 28, 1945న జరిగిన తన చివరి సమావేశంలో నిర్ణయించింది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

మరోక అంశం ఏమిటంటే జపాన్‌ ప్రజలను మానసికంగా ఉద్వేగపరచడానికి ముందు ముందు జరిపే బాంబుల దాడి ప్రభావాలపై ఆరు కోట్ల పైచీలుకు కరపత్రాలను పలు నగరాలపై విమానాలపై నుండి అమెరికా సైన్యం జారవిడవడం. 

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

ఇవే కాదు. తప్పనిసరిగా విజువల్‌ బాంబింగ్‌ మాత్రమే చేయాలనీ రాడార్‌ బాంబింగ్‌ను చేయరాదని కూడా కమిటి నిర్ణయించింది. రాడారు పర్యవేక్షణ ద్వారా బాంబు వేసే పద్ధతిలో విస్పోటన అనంతర దృశ్యాల చిత్రీకరణ సాధ్యంకాదు. అదే విజువల్‌ పద్ధతిలో అయితే పూర్తీ బాంబింగు ప్రక్రియ, తదనంతర పరిస్థితులను చిత్రీకరించవని కమిటీ భావించింది కూడా.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

క్యోటోపై బాంబు వేయడానికి ఆగస్టు5 రాత్రి 2 గంటల 45 నిమిషాలకు ఎనొల గే అనబడే బోయింగ్‌ బి-29 బాంబర్‌ విమానం పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని టినియన్‌ దీవుల నుండి మొత్తం 4,400 కిలో గ్రాముల బరువు గలిగిన లిటిల్‌ బాయ్ అనే ఆటంబాంబును వేసుకుని బయలుదేరింది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అయితే క్యోటో దట్టమైన మేఘాలతో అలముకొని వుంది. అందువల్ల రెండో లక్ష్యమైన హిరోషిమా వైపు విమానాలు మళ్ళించి లక్ష్యం చేసిన అయియో వంతెనపై కాకుండా మనుషులకు ప్రాణం పోసే ''డాక్టర్‌ షీమా సర్జకల్‌ క్లినిక్‌''పై మొదటి అణు బాంబు పేలింది. 70వేల నుండి 80వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోగా మరో 70వేల మంది క్షతగాత్రులయ్యారు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

కేవలం రెండు రోజుల విడిది తరువాత మూడవ రోజు మరో బాంబు నాగసాకిపై ఎందుకు ప్రయోగించ వలసి వచ్చింది? కారణం జపానును దారికి తీసుకు రావడమో, యుద్ధాన్ని అంత మొందించడమో అనుకుంటే పొరబాటే. రెండు వేరు వేరు రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను వాస్తవ పరిస్థితులలో ప్రయోగించి వాటి శక్తి సామర్థ్యాలను తెలుసుకోడానికి జపాన్‌ను వాడుకుంది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

హిరోషిమా బాంబు యురేనియం-235 ద్వారా ఒక సులభమైన కెమికల్‌ డిజైన్‌తో తయారు చేశారు. నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239 ద్వారా అత్యంత సంక్లిష్టమైన కెమికల్‌ డిజైనుతో రూపొందించారు. వీటి ప్రభావం ఏంటో తెలియాలంటే ఎక్కడో ఓ చోట బాంబులు వేయాలి. అందుకే జపాన్ మీదకి దాన్ని విసిరారు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

నిజానికి రెండో అణుబాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్‌ కొకూర. ఆ నగరం చేరుకోవడానికే టినియన్‌ దీవులనుండి బి-29 విమానాలు బయలుదేరినాయి. కోకూరపై బాంబు వేయడానికి పలు ప్రయత్నాలు చేసినాయి. కాని బాంబు వేయడానికి క్యోటో వాలే విమానాలకు సాధ్యం కాలేదు.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. జపానుపై అమెరికా సైన్యం మరో నాలుగు అణు బాంబుల దాడులకు సన్నాహాలు చేసినట్టు తెలుస్తున్నది. మూడవ దాడికి ఆగస్టు 19వ తేదిన, మిగతా దాడులు సెప్టెంబర్‌ మాసంలో చేయాలనుకున్నది. తరువాత రోజుల్లోఈ ప్రణాళిక ఉపసంహరించుకోవడంతో జపానులో అణు బాంబుల ఘోర కలి అంతటితో ఆగింది.

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అప్పటికే బలం పుంజుకుంటున్న సోవియట్ యూనియన్‌కు తన సత్తా ఏంటో చూపడానికే అమెరికా జపాన్‌ను పావుగా వాడుకుందని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందుకే జపాన్ పై దాడిచేసి శ్మశానాల దిబ్బగా దాన్ని మార్చివేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

 అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write The Real Reason America Used Nuclear Weapons Against Hiroshima and Nagasaki

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X