అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

Written By:

ప్రపంచమనే యవనికపై భారత్ మరోసారి తన కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. అతి కొద్ది సంపన్న దేశాలకే పరిమితమైన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటును తనకు తానే సొంతంగా ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు అయిదే దేశాలకే పరిమితమైన ఈ నావిగేషన్ వ్యవస్థను సాధించి భారత్ ఆరో దేశంగా తన కీర్తి పతాకను ఎగురవేసింది. ఆనాడు అమెరికా చేసిన మోసానికి ఈ విజయంతో సమాధానం చెప్పినట్లయింది. మరి నావిగేషన్ అంటే ఏమిటి..ఎందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

మనకు జీపీఎస్ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ఉండగా ఇక ఉపగ్రహ వ్యవస్థ ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తారు. దీనికోసం మనం మన గత విజయాన్ని ఆ విజయంలో అమెరికా చేసిన మోసాన్ని గుర్తు చేసుకోవాలి.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

1999లో కార్గిల్ యుద్ధం అత్యంత భయంకరంగా జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ దళాలు కార్గిల్ ప్రాంతాన్ని మొహరించాయి. ఈ సమయంలో అక్కడ పరిస్థితులు తెలుసుకోవడానికి ఇండియాకు జీపీఎస్ సమాచారం కావాల్సి వచ్చింది. అయితే ఈ జీపీఎస్ వ్యవస్థ అప్పుడు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

అమెరికా కార్గిల్ లో యుద్ధంలో జరుగుతన్న పరిస్థితులపై సమాచారం ఇవ్వడానికి ససేమిరా అన్నది. మరి అలా ఎందుకు చేసిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. యుద్ధం ముందుకు పోకుండానా లేక పాకిస్తాన్ దళాలకు సాయం చేయాడానికా అనేది మాత్రం ఇప్పటికీ బయటపడలేదు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

అయితే ఆ యుద్ధంలో భారత్ విజయకేతనం ఎగురవేయడం పాకిస్తాన్ దళాలను తరిమి తరిమి కొట్టడం జరిగిపోయాయి. అప్పుడే మనకంటూ ఓ సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలంటూ భారత్ ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూనే ఉంది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

పీఎస్ ఎల్వీ 33 విజయవంతం కావడంతో దాదాపు 17 సంవత్సరాల కృషి నేడు సాకారం అయింది. నింగిలోకి పీఎస్ ఎల్వీ 33 దూసుకెళ్లి అమెరికా చేసిన మోసానికి ధీటుగా బదులిచ్చినట్లయింది. నాలుగు దశల మోటార్లతో అంచెలంచెలుగా పయనించి 20.21 నిమిషాలలో భూమికి 497.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరి ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1జీ ఉపగ్రహాన్ని నిర్ణీతకక్ష్యలో వదిలిపెట్టింది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

భూమికి 284 కిలోమీటర్ల పెరిజీ (భూమికి అతిదగ్గర బిందువు)..20,657 కిలోమీటర్ల అపోజీ (భూమికి అత్యంత దూరంగా ఉండే బిందువు)గల దీర్ఘ వృత్తాకారపు ఉప భూబదిలీ కక్ష్యలోకి 17.86 డిగ్రీల వాలులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. వెంటనే ఉపగ్రహంలోని రెండు సౌర ఫలకాలు విచ్చుకోకుని.. దాన్నుంచి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హసన్‌ కేంద్రానికి ఉపగ్రహ సంకేతాలు అందాయి! అంతే సంబరాలు మిన్నంటాయి.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

భూమిపై నీవు ఎక్కడున్నావు. గమ్యాన్ని చేరుకోవడానికి ఎటువెళ్లాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే నావిగేషన్ వ్యవస్థ. దీనినే తెలుగులో మార్గ నిర్దేశనం లేదా దిక్సూచి అని పిలుస్తారు. 

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

దీనిని నావిక్ అంటూ కొత్త పేరు పెట్టారు ప్రధానమంత్రి మోడీ. పూర్వ కాలంలో కేవలం నక్షత్రాలు అలాగే సూర్య చంద్రుల గమనం ఆధారంగా వేలాది మైళ్లు సముద్ర యానం చేసిన మన దేశ పూర్వ నావికుల ధైర్యానికి గుర్తుగా ఈ వ్యవస్థకు నావిక్ అని ప్రధాని నరేంద్ర మోడీ నామకరణం చేశారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

ఈ నావిక్ భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పని చేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలో మీటర్లు పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పని చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా అనేక విపత్తులను ముందే పసిగట్టవచ్చు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

ప్రకృతి విపత్తుల సమయంలో సహాయకచర్యలకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని, రైళ్ల కదలికల గురించి కూడా తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే పొరుగున్న ఉన్న సార్క్‌ దేశాలు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు కూడా.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

నావిగేషన్ సిస్టం టెక్నాలజీని నేడు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారుల నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలట్లు, కెప్టెన్ల వరకు వినియోగించుకుంటున్నారని ప్రయోగ విజాయనంతరం మోడీ చెప్పారు. ఈ టెక్నాలజీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టంను తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006 లోనే ఇస్రో గుర్తించి దీనికి రూ.3,425 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ1,000 కోట్లు, రాకెట్లుకు రూ.1,125 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌కు చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలో బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006 లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2014 నాటికి రూపాంతరం చెంది అదే సంవత్సరం జూలై 1న ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS-1A) ఉపగ్రహం ప్రయోగంతో శ్రీకారం చుట్టారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ33 రాకెట్‌ను ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం సహా రాకెట్ మొత్తం బరువు సుమారు 320 టన్నులు. ఇంత బరువును మోసుకెళ్లేందుకు తొలి దశలోని స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని, కోర్ అలోన్ దశలో మరో 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. తొలిదశ 110 సెకన్లలో, రెండో దశ 262 సెకన్లలో, మూడో దశ 663 సెకన్లలో, నాలుగో దశ 1,182 సెకన్లలో పూర్తయింది. మొత్తంగా 20 నిమిషాల 19 సెకన్లకు 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

ఏప్రిల్ 4న IRNSS-1B ఉపగ్రహ ప్రయోగాన్ని, అక్టోబర్ 16న IRNSS-1C ఉపగ్రహ ప్రయోగం, 2015 మార్చి 28న IRNSS-1D ఉపగ్రహాన్ని, ఈ ఏడాది జనవరి 17న IRNSS-1E ఉపగ్రహాన్ని, మార్చి 10న IRNSS-1F ఉపగ్రహాన్ని, గురువారం IRNSS-1G ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

మొత్తంగా 1,425 కేజీల ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకు వెళ్లింది.దీనికయిన ఖర్చు కూడా చాల తక్కువ. ఇదే నావిగేషన్ కోసం చైనా 35 శాటిలైట్లను ప్రయోగించింది. అలాగే బైదూ నావిగేషన్ కోసం చైనా భారీగానే ఖర్చు చేసింది.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 35వది. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 13వ ప్రయోగం. ఇస్రో శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చేసిన కృషి ఫలించి సొంత నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేశారు. దటీజ్ ఇండియా.

అమెరికా మోసానికి నావిక్‌తో సమాధానం: నావిక్ అవసరం ఎందుకంటే..?

మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India's very own GPS is ready with seventh navigation satellite launch
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more