వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

Written By:

మనుషుల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయా..మనుషులు నిజంగానే అధ్భుతాలు సృష్టించగలరా..అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది. వారు తమ అద్భుత విన్యాసాలతో మహామహులకే సాధ్యం కాని రీతిలో సూపర్ పవర్ ని కలిగి శాస్ర్త విజ్ఙానానికే సవాల్ విసురుతున్నారు. వీరు శక్తుల రహస్యం శాస్త్రవేత్తలకే అర్ధం కావడం లేదు. ఇక ఆ సూపర్ పవర్‌ కలిగిన వ్యక్తులను చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. శాస్త్రీయ అంచనాలకే అందని ఈ శక్తులేంటో మీరే చూడండి.

Read more: తమ శక్తులతో సైన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్ రే కళ్ల యువతి ( X Rays vision)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

టాషా డెమ్కినా (నటాషా DEMKINA) అనే రష్యన్ యువతి కళ్లు శాస్త్రవేత్తలకు పెద్ద పజిల్. నమ్మశక్యం కాని విధంగా ఆమెవి ఎక్స్-రే కళ్లు. ఆమె చూపులు చురుగ్గా వ్యక్తి శరీరంలోకి వెళతాయి. లోపలి శరీర భాగాల పరిస్థితి ఆమె కళ్లకు కడుతుంది. ఎక్స్ కిరణాలు చేసే పనిని ఆమె కళ్లు చేస్తాయంటే విన్నవాళ్లు గుడ్లు తేలేశారు. రష్యాతోపాటు యుకె, న్యూయార్క్, టోక్యోలలో ఆమె కంటిచూపుపై నిరంతర ప్రయోగాలు జరిగాయి. అయినా, తేలింది శూన్యం.

ఎక్స్ రే కళ్ల యువతి ( X Rays vision)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

తొమ్మిదేళ్ల ప్రాయంలోనే నటాషా కళ్లకు ఎక్స్-రే విజన్ ఉన్నట్టు వెల్లడైంది. తాను తన కళ్లతో చూసిందాన్ని పూస గుచ్చినట్లు వివరించేసరికి వైద్యులు బిత్తరపోయారు. ఒక వ్యక్తి శరీరాంతర భాగాలను ఆమె వీక్షించడం విచిత్రం కాక మరేమిటి? అంతర్జాతీయ స్థాయిలో ఆమెపై జరిపిన ప్రయోగాలు, పరీక్షలు ఒక రకంగా మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి.

అయస్కాంతపు మనిషి ( The magnetic man )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

మలేషియాకు చెందిన లియూ థో లిన్ (70) అనే పెద్ద మనిషి కిందటేడాది మిస్టర్ మాగ్నెట్ లేదా మాగ్నెట్ మనిషిగా వార్తల్లోకి వచ్చాడు. ఆయన దేహానికి అన్ని రకాల వస్తువులూ చక్కగా అతుక్కొంటున్నాయి. లోహపు వస్తువులైతే లిన్ ఒంటికి ఠక్కున అతుక్కొంటాయి. మనిషి దేహానికి ఇలాంటి ఆకర్షణీయ లక్షణం (చూషణ ప్రభావం) ఎలా వచ్చిందన్నదే ఇంకా ఇదమిద్ధంగా తేలలేదు.

అయస్కాంతపు మనిషి ( The magnetic man )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఓ లెక్కన మొత్తం 36 కేజీల బరువు తూగే వస్తువులను ఆయన తన ఒంటిపై అమర్చుకోగలడు. శాస్త్రవేత్తలు తేల్చిందేమిటంటే అతని చర్మం అత్యధిక స్థాయిలో ఫ్రిక్షన్ (ఘర్షణ జారి పోకుండా నిలుపుకునే గుణం) ను కలిగి ఉంది. ఫలితంగా వస్తువులు ఆయనకు అతుక్కుంటున్నాయి అని. లిన్ ఏకంగా తన ఆకర్షణ గుణంతో ఒక కారును సైతం లాగేశాడు.

నిదురపోని మనిషి ( The Man Who doesn’t Sleep)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

హెర్సిన్ ఇప్పటిదాకా నిదురపోలేదంటే నమ్ముతారా..దాదాపు 10 ఏళ్ల నుంచి ఇతను నిదర అనే మాటే ఎరుగడు. ఇతని ఇంట్లో బెడ్ రూం అనే మాటే వినబడదు.

నిదురపోని మనిషి ( The Man Who doesn’t Sleep)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

అయితే నిదరపోక పోవడం వల్ల అతని ఆరోగ్యానికి ఏమైనా జరిగిందా అంటే అదేమి లేదు. అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ఇప్పుడు అతనికి 64 ఏళ్లు .శాస్ర్తవేత్తలు సైతం అతని శక్తిని చూసి నోరెళ్లబెడుతున్నారు.

లాంగ్వేజ్ పండితుడు ( Super Language Abilities)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఇతని పేరు హోలార్ట్ విలియమ్స్. న్యూజిలాండ్ జర్నలిస్ట్. ఇతను 58 భాషలు అవలీలగా మాట్లాడగలడు. ఇతను ఏడు సంవత్సరాల వయసులోనే ఇతని మైండ్ లోకి ఈ పవర్ ప్రవేశించింది. ప్రపంచంలో అతి కష్టమైన లాంగ్వేజ్ లాటిన్ ను ఇతను కొద్ది కాలానికే నేర్చుకున్నాడు.

లాంగ్వేజ్ పండితుడు ( Super Language Abilities)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఇక ఇతను అన్ని దేశాలు పర్యటిస్తూ అక్కడి భాషలను నేర్చుకుంటూ పోతున్నాడు. కొన్ని సంవత్సరాలు పోతే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఇతను మాట్లాడేయగలడు. మరి అది ఎలా సాధ్యం.

సుదూర దృష్టి ( Eagle Vision)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

పశ్చిమ జర్మనీకి చెందిన వెరోనికా సీడర్ (వెరోనికా SEIDER) అనే మహిళ నేత్రదృష్టి (కంటిచూపు) ఎంతంటే ఒక సగటు మనిషి కన్నా 20 రెట్లు అధికం. 1951 లో జన్మించిన సీడర్కు ఈ సుదూర దృష్టి ఉందన్న సంగతి 1972 లో బయటపడింది. అప్పుడు ఆమె యూనివర్సిటీ ఆఫ్ స్టట్గార్ట్ (స్టట్గార్ట్) లో చదువుతోంది. ఆమె చూపు సామర్థం సుమారు 1.6 కి.మీ. దూరం.

సుదూర దృష్టి ( Eagle Vision)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

సాధారణంగా ఎవరి కళ్లయినా సుమారు 20 అడుగులకు మంచిన దూరాన్ని దర్శించలేవు. కానీ, ఈ మహిళ అంత దూరంలోని రంగులను టివిలో చూసినంత స్పష్టంగా చెప్పగలుగుతోంది. ఒక రకమైన జన్యు అసాధారణతే వెరోనికా ఈ నేత్రస్థితికి కారణమని వైద్య నిపుణులు అంటున్నారు.

కెమెరా మెన్ ( The cameraman )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

విల్ట్ షైర్ మొత్తం నగరాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే చూసి ఇలా చార్ట్ లో బంధిస్తాడు. 2005 లో ఇతను వెలుగులోకి వచ్చాడు. అది ఎటువంటి నగరమైనా ఎంత పెద్ద నగరమైనా సరే అతని చేతి నుంచి ఇలా మనకు దర్శనమివ్వాల్సిందే.

కెమెరా మెన్ ( The cameraman )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

దుబాయ్ నుంచి మొదలు పెడితే టోక్యో, ఫ్రాంక్లిన్ , షాంఘై, హాంగ్ కాంగ్ , జెరూసలేం, సిడ్నీ, మాడ్రిడ్, న్యూయార్క్ , ఇలా అన్నీ నగరాలను కేవలం హెలికాప్టర్లలో చుట్టి తనకున్న పవర్ తో ఆ సిటీ మొత్తన్నా ఇలా గీసి చూపించారు. సైంటిస్టులు సైతం బిత్తరపోయేలా చేశాడు.

మంచు మనిషి ( The Iceman)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

నెదర్లాండ్ (డచ్) కు చెందిన విమ్ హోఫ్ అనే మధ్యవయస్కుడు అతిశీతల ఉష్ణోగ్రతల్లోనూ వణకక తొణకక ఉంటున్న వింత ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. గడ్డ కట్టుకు పోయేంత చలిలోను అతను నిలదొక్కుకుంటున్న తీరు శాస్త్రజ్ఞులనే ఆలోచింపజేస్తోంది. ఇతనిని ఏకంగా ది ఐస్ మ్యాన్ అంటున్నారు.

మంచు మనిషి ( The Iceman)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ తో కూడిన అతిశీతల మడుగులో 1 గంట 13 నిముషాలపాటు స్థిరంగా ఉండిపోయాడు. తన స్వయంచలిత నాడీవ్యవస్థను ఆయన చెక్కుచెదరనీయలేదు. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఇప్పటికి మొత్తం 20 అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పాడు. వాటిలో దీర్ఘకాలం పాటు సాగిన ఐస్ బాత్ ఒకటి. యోగాతో మనసును నిగ్రహపరచుకోవడం ద్వారా తన దేహంపై హోఫ్ ఇంతటి అద్భుత పట్టును సాధించినట్టు చెబుతున్నారు.

సూపర్ మ్యాన్ ( Superhuman memory)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ప్రపంచంలోనే అత్యంత సూపర్ మెమొరీ పవర్ గల వ్యక్తి ఇతను. పేరు డానియల్ టమ్మెట్. ప్రపంచంలోని సమాచారం గురించి ఏది అడిగినా టక్కున చెప్పేస్తాడు. ఇతని మెమొరీ పవర్ సైంటిస్టులకే సవాల్ విసురుతోంది ఇప్పుడు.

తిండిలో కుబేరుడు ( Mr. Eats All)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఇతని పేరు మిచెల్ లిటిటో. ఇతను తినేది ఏంటో తెలుసా.. అందరూ అన్నం తింటే ఇతనే మెటల్ తింటాడు. అలాగే గ్లాసు ముక్కుల కరకరా నమిలేస్తాడు. అయితే ఇవి తింటే ప్రమాదం ఏమిలేదా అంటే అదేమి లేదు. ఇతను చాలా ఫిట్ గా ఉన్నాడు.

తిండిలో కుబేరుడు ( Mr. Eats All)

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఇతను ఇప్పటికీ 18 సైకిళ్లను అలాగే 7 టీవీలను రెండు బెడ్ లను, చిన్న ఈపిల్ టవర్ ని కరకరా నమిలి మింగేశాడు. ఇతనికి ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని శాస్ర్తవేత్తలు పరీక్షలు జరిపితే చాలా నార్మల్ గా ఉన్నాడు. సైంటిస్టులు సైతం బిత్తర పోతున్నారు ఇతని దెబ్బకి.

అది శరీరమేనా (Drill master )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

చైనాలోని షావోలిన్ (షావోలిన్) మఠానికి చెందిన ఓ బౌద్ధసన్యాసి దేహం ఏకంగా డ్రిల్లింగ్ మెషీన్ బిట్ను తిప్పినా రంధ్రం పడనంతగా మొద్దుబారి పోయింది. ఝావో రూయి (జావో రుయి) అనే 24 ఏళ్ల ఈ యువసన్యాసి ఎలక్ట్రిక్ డ్రిల్స్ ను తన తలమీది నుదుటి భాగంలో కంటికి దగ్గరే 10 సెకండ్ల పాటు తిప్పుకున్నాడు. అయినా, అక్కడ ఎర్రటి మచ్చ తప్ప ఎలాంటి రంధ్రం పడలేదు. రక్తం చిమ్మలేదు.

అది శరీరమేనా (Drill master )

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ఇంకా అభినవ భీష్ముడిలా లోహపు కత్తుల (METAL వచ్చే చిక్కులు) పైన బోర్లా పడుకున్నాడు. లావైన ఇనుప రాడ్ ను తన కంఠంతో వంచేశాడు. నేను నా తలతో రాళ్లను పగల గొడతాను. ఈ రకమైన విద్యలు నాలోని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తున్నాయి అంటున్న రూయి దేహం ఎంతగా గట్టిపడి పోయిందో అర్థమవుతోంది. అలాగని అతను జీవమున్న మనిషే మరి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write These 9 people have unbelievable Superpowers
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting