తమ శక్తులతో సైన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు
ఇప్పటివరకు మీరు సూపర్ మ్యాన్ అలాగే స్పైడర్ మ్యాన్ తో పాటు అనేక శక్తులు కలిగి ఉంటే క్యారెక్టర్లను చూసి ఉంటారు. అయితే అవి కేవలం సినిమాలో మాత్రమే చూసుంటారు కదా..కాని అలాంటివాళ్లు నిజ జీవితంలో మీకెదురయితే ఎలా ఉంటుంది. అయితే నిజ జీవితంలో కూడా అలాంటి వారు చాలా మందే ఉన్నారు. ఎన్నో శక్తులను కలిగి ఉన్నారు...వారు మన మధ్యనే తిరుగుతూ అనేక శక్తులను కలిగిఉన్నారని తెలుస్తోంది. వారు తమ శక్తులతో సైన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి వారిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more: గ్రహాంతరవాసులతో ముప్పు : వెయ్యేళ్లలో మానవజాతి అంతం

విమ్ హోప్ ,ఎ.కె.ఎ (ది ఐస్ మ్యాన్ )
ఇతన్ని చూసారా ఐస్ మీదనే సంసారం చేస్తున్నారు. సాధారనంగా ఎవరైనా ఐస్ లో ఓ 10 నిమిషాల పాటు ఉంటే అతను రక్తం గడ్డ కట్టుకుని మరణిస్తాడు. కాని ఇతను దాదాపు 2 గంటల పాటు ఐస్ మీద ఇలా కూర్చుని సంచలనం సృష్టించారు. అయినా అతనికేం కాలేదు. మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అవలీలగా ఎక్కేయగలడు కూడా.

ప్రహ్లద్ జానీ ( అన్నం లేదు నీళ్లు లేదు)
దైవ భక్తుని రూపంలో ఉన్న ఈయన 1940 నుంచి అన్నపానీయాలనే మరచిపోయారట. కేవలం గాలి ద్వారానే బతికేస్తున్నారట..ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఓ 10 రోజులు గృహ నిర్భధం చేస్తే 10 రోజుల తర్వాత తాపీగా బయటకొచ్చాడు. ఇప్పటికీ ఇది అంతుచిక్కని మిస్టరీలా మారింది.

రతక్రిష్ణన్ వేలు ( పంటితో రైలు లాగాడు)
బోగీల రైలును తన పంటితో లాగి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా అంటే కష్టమే మరి. మనోడు గిన్నిస్ దిశగా పరుగులు పెడుతున్నాడు.

కెవిన్ రిచర్డ్స్ సన్ (ది లైన్ విస్పర్)
అడవిలో సింహాలతో ఇతగాని సావాసం. వాటితోనే 24 గంటలూ గడిపేస్తుంటారు. వాటితోనే మాట్లాడుతారు కూడా. వైల్డ్ పీల్డ్ లో ఇప్పుడు ఇతనే పెద్ద హీరో

బెన్ అండర్ వుడ్ ( ది బోయ్ విత్ సోనార్ విజన్ )
ఇతను అతని కన్నులు లేకుండా కాని ప్రపంచాన్ని చూడగలడు. కేవలం సౌండ్ ద్వారా మాత్రమే ఇతను ఆ పనిచేయగలడు. దురదృష్టవశాత్తు ఇతను 2009లో క్యాన్సర్ భారీన పడ్డారు.

డానియెల్ బ్రౌనింగ్ స్మిత్ ( ది రబ్బర్ బోయ్)
తన శరీరాన్ని రబ్బరు తిప్పినట్టు తిప్పగలడు ఈ రబ్బర్ బాలుడు. సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు ఇప్పుడు.

స్టీఫెన్ విల్ట్ షైర్ ( ది ఆర్టిస్ట్ విత్ ఎ ఫోటోగ్రాఫిక్ మెమొరీ)
అద్భుతమైన ఆర్టిస్ట్.. ఇతని జ్ఙాపక శక్తి అమోఘం. చూడకుండానే అన్నీ పనులు చేసేయగలడు.

ఎన్ జీఓసీ థయ్ (నిదురంటే తెలీదు)
1973 నుంచి ఇప్పటిదాకా ఇతనికి నిదరంటే తెలియదట. జ్వరంతో అప్పుడు నిదురకు దూరమయ్యాడు. ప్రతిరోజూ 50 కేజీల బరువున్న విత్తనాల బస్తాలను 4 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లినా కాని బాడీ అలసిపోదట. ఇక శాస్ర్తవేత్తలు నిదర మాత్రలు ఇచ్చినా కాని ప్రయోజనం లేదు మరి.

టిబిటెన్ సన్యాసులు
టిబెట్ లో ఉన్న ఈ బౌద్ద సన్యాసులు ఎటువంటి టెంపరేచర్ నైనా తట్టుకుని నిలబడగలరు. 17 డిగ్రీస్ వాతావరణంలో కూడా వీరు ఉండగలరు.అది వీరి మైండ్ పవర్ ను ఉపయోగించి ఇలా ుండగలరట. యోగా ,మెడిటేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.

నటాషా ( ఎక్సరే వుమెన్)
ప్రజల చర్మాన్ని చూసి ఎక్సరేలో ఏం ఉందో చెప్పేయగలదు ఈ రష్యన్ భామ. ఓ యాక్సిడెంట్ తో ఆమెకు ఈ వరం వచ్చిందట.

డేనియల్ టమ్మెట్ ( బ్రెయిన్ బాలుడు)
ఇతను ప్రపంచంలోని అన్ని విషయాలను అవలీలగా చెప్పేయగలడు. మీరు ఏం అడిగినా కాని టపీమని సమాధానం ఇస్తాడు. ఇతని ఐక్యూ చూసిన చాలామంది నోరెళ్లబెట్టారు కూడా..అంతే కాదండోయ్ ఇతను ప్రపంచంలోని అనేక భాషలు మాట్లాడగలడు కూడా.


Click it and Unblock the Notifications








