జయహో భారత్...ప్రపంచాన్ని కలవరపెడుతున్న భారత బ్రహ్మాస్రాలు

Posted By:

ఓ పక్క డ్రాగన్ బుసలు కొడుతూ సరిహద్దు దగ్గర అను నిత్యం ఎప్పుడు చొరబడదామా అని కాచుకూర్చుని ఉంది. మరో పక్క దాయాది దేశం పాకిస్తాన్ సందు దొరికిందే తడవుగా సైన్యంపై దాడులు చేస్తూ వస్తోంది. ఈ దశలో భారత సైన్యం ఎంతో అప్రమత్తమై అను నిత్యం సవాళ్లను ఎదుర్కోంటోంది. పొరుగుదేశాలను మనదేశ భూభాగంలోనికి రాకుండా తరిమి తరిమికొడుతోంది. అత్యాధునిక ఆయుధాలతో ఎప్పుడు ఏ తుఫాను విరుచుకుపడినా మేమున్నామంటూ భరోసానిస్తోంది. ఆ భరోసాతోనే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నది కాదనలేని వాస్తవం. ఇండియా అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాల గురించి తెలుసుకుందాం.

Read more: ప్రపంచాన్నివణికిస్తున్న భారత విహంగ అస్త్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న అత్యంత పవర్ పుల్ యుద్ధ విమానం ఇది. రష్యా సహకారంతో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ డెవలప్ చేసింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవి. దాదాపు 200 యుద్ధ విమానాలు భారత్ చేతిలో ఉన్నాయి.

2

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. దీన్ని విమానం, నౌక, సబ్‌మెరైన్ లేదా ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. ఇది బహుళ లక్ష్యాలపై కేవలం మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగలదు.తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ ప్రతిక్షిపణీ (Anti missile) ఎదుర్కోలేదు.

3

అత్యాధునిక యుద్ధ ట్యాంకర్. 12.7 mm NSVT మిషన్ గన్ తో శత్రువుల పని పడుతుంది. మొత్తం రిమోట్ కంట్రోల్‌తో నడుస్తుంది.

4

అత్యాధునిక ఐఎన్ ఎస్ విక్రమాదిత్య భారత నావికా దళంలోకి చేరింది. ఎయిర్ క్రాఫ్ట్ లను మోసుకెళ్లే నౌక ఇది. హిందూ మహాసముద్రం మొత్తాన్ని జల్లెడపట్టి శత్రువును కిలోమీటర్ల దూరం పరిగెత్తిస్తుందని ఆర్మీ చెబుతోంది. దీన్ని భారత్ రష్యా నుంచి 947 మిలియన్ డాలర్లకు అప్పుడు కొనుగోలు చేసింది.

5

12 వేల టన్నుల బరువు కలిగిన ఈ చక్ర 500 మీటర్ల లోతున ప్రయాణం చేయ గలదు. 30 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించగల చక్ర సుమారు 100 రోజుల పాటు నీటి అడు గున ఉంటుంది.300 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల శక్తి ఈ జలాంతర్గామికి వుంది, ఒకేసారి 26 శతఘ్నులను తీసుకెళ్ళగల సామర్థ్యం కూడా చక్ర సొంతం.

6

త్రీ స్టేజ్ మిస్సైల్ అయిన అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. ఉపరితలం నుంచి ఉపరితలానికి వెయ్యి కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.ఇప్పటి వరకు ఈ క్షిపణిని మూడు సార్లు ప్రయోగించగా.. ప్రతీసారి విజయవంతమైంది.

7

ఇజ్రాయెల్ సహకారంతో పురుడుపోసుకుంది. పై నుంచి శత్రువుల ఆయుధాలను సర్వనాశనం చేయగల సత్తా దీని సొంతం. రాడార్లతో శత్రువుల ఆయుధాలు ఎంత దూరంలో ఉన్నా పసిగట్టగలవు.

8

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. 40 వేల టన్నుల బరువు, 260 మీటర్ల పొడవు, 6ే మీటర్ల వెడల్పు ఉన్న యుద్ధ విమాన వాహన నౌక. ఈ నౌకపై ఒకేసారి రెండు యుద్ధ విమానాలు టేకాఫ్ రన్ వేలు తీసుకుంటాయి. అలాగే ల్యాండింగ్ కూడా ఉంది.

9

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని సూటిగా ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థ 'బరాక్-8. ఇది శత్రువుల నుంచి వచ్చే మిస్సైల్స్ ను అలాగే విమానాలాను డ్రోన్లను కూల్చివేయగలదు. ఈ మిస్సైల్స్ తో చైనా, పాకిస్తాన్ వార్ షిప్ ల మీద దాడి చేయవచ్చు.ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఇది తట్టుకుని నిలబడగలదు. 360 డిగ్రీల రేంజ్ లో దీన్ని ప్రయోగించవచ్చు

10

రష్యా 3వ జనరేషన్ మెయిన్ యుద్ధ ట్యాంకు ఇది. 310 యుద్ధ ట్యాంకుల కోసం ఆర్డర్ చేశారు. ఇప్పటికే 120 డెలివరీ కాగా మిగతావి త్వరలో చేరే అవకాశం ఉంది.

11

ఇదొక మల్టీ మిషన్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికోసం దాదాపు 2.1 బిలియన్ల కాంట్రాక్ట్ ఒప్పందం కూడా జరిగింది. పహారా కాయడంలో వీటికి మించినవి లేవు.

12

శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే క్షిపణి

13

లేటెస్ట్ గా తయారైన వెపన్. ఇది సొంతంగా ఆపరేట్ చేయగల అత్యాధునిక యుద్ధ విమానం.సముద్రంలోనూ నేలమీద ప్రయాణించి శత్రు స్థావరాలను ధ్వసం చేయగలదు. ఈ యుధ్ధ విమానంలో మొత్తం 64 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ఉంటాయి.దీని తక్కువ రేంజ్ బరక్ 1.. అలాగే మీడియం రేంజ్ బరక్ 8. యుద్ధ సమయంలో వీటితో శత్రు సేననే నామరూపాల్లేకుండా చేయవచ్చు.

14

బాలిస్టిక్ మిసైల్స్ ను తుత్తునియలు చేసే అత్యాధనిక ఆయుధం ఇది. దీని సరాసరి దూరం దాదాపు 5000 కిలోమీటర్లు.

15

మల్టీ రాకెట్ లాంచర్. ఆరు లాంచర్లతో కూడిన ఒక విభాగం ద్వారా 12 రాెకట్లను 44 సెకన్లలో ప్రయోగించవచ్చు. 3.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశంలో ఉన్న శత్రువులను నాశనం చేయగలదు. ఇది సైన్యం బలాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. శతఘు్నలకు తోడుగా పనిచేస్తుంది.

16

సముద్రగర్భంలో ప్రయాణించగల అన్ని వాహనాల వేగాలను, లోతులను గమనించి శత్రు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించగల అత్యాధునిక అణు జలాంతర్గామి ఇది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు మన భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి కలను నెరవేర్చుకుంది.

17

అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్ ఇది.

18

ఎలక్ట్రానిక్ పవర్ సబ్ మెరైన్. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 500 కోట్ల నుంచి రూ. 23.000 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం.

19

భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్. పాక్లో ఉన్న జేఎఫ్ -17 కు చెక్ పెట్టేందుకు ఈ విమానాలు రెడీగా ఉన్నాయి.

20

ఆకాష్ ... పేరు మూడు అక్షరాలు. పేరుకు తగ్గట్టు శత్రు దేశాల వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించగల సత్తా వున్న అస్త్రం. శత్రుదేశాలకు చెందిన విమానాల అతి సూక్ష్మమైన లక్ష్యాలను ఛేదించగలదు.

21

‘అగ్ని' ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

ప్రపంచ దేశాలకు భారత్ షాక్

 

 

 

22

ఆకాశంలోనే శత్రు క్షిపణులు ధ్వంసం:భారత్ సొంతం..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి .

బ్రహ్మోస్‌‌తో శత్రు దేశాలకు ఇక చుక్కలే

 

 

 

23

శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

పాక్‌తో యుద్ధం: ఇండియాకు 15 సెకన్లే ఎక్కువ

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 20 Technically Powerful weapons in Indain Armed Force
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot