ఆకాశంలోనే శత్రు క్షిపణులు ధ్వంసం:భారత్ సొంతం

Written By:

మన గగనతలంలోకి ప్రవేశించిన శత్రు క్షిపణులను ఆకాశంలోనే ధ్వంసం చేసే అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏఏడీ) మిస్సైల్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి (డీఆర్‌డీవో) సంస్థ విజయవంతంగా పరీక్షించింది. ఒడిసాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ (వీలర్‌ ఐలాండ్‌) టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ శత్రు క్షిపణి విధ్వంసక మిస్సైల్‌ ధ్వనికన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి నేవిగేషన్‌ వ్యవస్థతోపాటు అత్యాధునిక కంప్యూటర్‌ను, ఎలకో్ట్రమ్యాగ్నెటిక్‌ యాక్టివేటర్‌ను అనుసంధానించారు. అలాగే ఇది స్వతంత్ర ట్రాకింగ్‌, రాడార్‌ వ్యవస్థలనూ కలిగి ఉందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more: ప్రపంచ దేశాలకు భారత్ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శత్రుదేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్‌ను నాశనం చేయగల

శత్రుదేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్‌ను నాశనం చేయగల సామర్థ్యమున్న ఈ క్షిపణికి ఉంది. ఈ ఇంటర్‌స్టెపర్ మిసైల్‌ను అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఫ్లెట్ మోడ్‌లో ఇంటర్‌సెప్టర్‌కు సంబంధించిన వివిధ అంశాలను ధ్రువీకరించుకునేందుకు పరీక్షలు నిర్వహించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

రాడార్ల నుంచి సంకేతాలు అందగానే ఆకాశమార్గం నుంచి

రాడార్ల నుంచి సంకేతాలు అందగానే ఆకాశమార్గం నుంచి వచ్చే మిసైల్‌ను ధ్వంసం చేయడానికి ఇంటర్‌సెప్టర్‌ను అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఆదివారం ఉదయం 9.46 గంటలకు ఏర్పాటు చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

7.5 మీటర్ల పొడవున్న ఇంటర్‌సెప్టర్‌కు పక్కా నావిగేషన్ సిస్టంతోపాటు

7.5 మీటర్ల పొడవున్న ఇంటర్‌సెప్టర్‌కు పక్కా నావిగేషన్ సిస్టంతోపాటు సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొఫెల్లెడ్ గైడెడ్ మిసైల్, హైటెక్ కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్‌ను అమర్చామన్నారు.

సొంతంగా మొబైల్ లాంచింగ్, డాటా లింక్‌ను భద్రపరుచుకుంటుదని,

సొంతంగా మొబైల్ లాంచింగ్, డాటా లింక్‌ను భద్రపరుచుకుంటుదని, ఆధునిక రాడార్లను ట్రాక్ చేసే సామర్థ్యం ఇంటర్‌సెప్టర్‌కుందని డీఆర్డీఏ అధికారులు తెలిపారు.

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ ఇది.. దీన్నిఒడిశా తీరంలోని ప్రయోగ కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు.

పూర్తిస్థాయి మల్టిలేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం

పూర్తిస్థాయి మల్టిలేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం అభివృద్ధి చేసే క్రమంలో ఈ మిసైల్‌ను పరీక్షించామని అది విజయవంతమైందని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఏ) శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ అమ్ములపొదిలోకి మరోక క్షిపణి

ఈ పరీక్ష విజయవంతంతో భారత్ అమ్ములపొదిలోకి మరోక క్షిపణి చేరినట్లయింది. ఇప్పటికే శత్రు దేశాలతో పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇది విజయవంతం కావడంతో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Interceptor missile successfully test-fired from Abdul Kalam Island
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot