ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

|

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో కిట్‌క్యాట్ కంటే భిన్నమైన నోటిఫికేషన్ ప్యానల్‌ను డిజైన్ చేసారు. ఈ సరికొత్త నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా ఫోన్ స్ర్కీన్ లాక్ చేసి ఉన్నప్పటికి వివరణాత్మక నోటిఫికేషన్లను తెర పై చూడొచ్చు. పని ప్రాంగణాల్లో ఈ ఫీచర్ ఇబ్బంది అనుకుంటే Settingsలోని Sound and Notificationలోకి ప్రవేశించి When device is Locked - Don't show notifications at allను సెలక్ట్ చేసుకుంటే లాక్ చేసి ఉన్న మీ ఫోన్ స్ర్కీన్ ఏ విధమైన స్పెసిఫికేషన్‌లు కనిపించవు.

(3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6',బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు)

Trusted Places పేరుతో సరికొత్త స్మార్ట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసిన లోకేషన్‌లను ఎవరికంటాపడకుండా సురిక్షితంగా ఉంచుకోవచ్చు. Trusted Places ఫీచర్‌లో భాగంగా లొకేషన్‌ను సెట్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్‌లోకి ప్రవేశించి స్మార్ట్‌లాక్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

లాలీపాప్ ఓఎస్‌లో ఫ్లాపీ ఆండ్రాయిడ్ గేమ్ (ఈస్టర్ ఎగ్)

ఆండ్రాయిడ్ తన సరికొత్త లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంలో ఈస్టర్ ఎగ్ పేరుతో ఓ రహస్య గేమ్‌ను అందిస్తోంది. ఈ గేమ్‌ను మీరూ ఆస్వాదించాలనుకుంటే మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైస్‌లోని సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి About phoneలోని Android version ఆప్షన్ పై పలుమార్లు ప్రెస్ చేసినట్లయితే లాలీపాప్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది. ఆ స్ర్కీన్‌లోని లాలీపాప్ వర్డింగ్ పై వేలితో కొద్ది సేపు టాప్ చేసి ఉంచినట్లయితే ఫ్లాపీ ఆండ్రాయిడ్ గేమ్ ఓపెన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

డబల్ టాప్ టు వేక్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను కలిగి ఉన్న ఫోన్‌లో డిస్‌ప్లేను ఆన్ చేయవల్సి వస్తే ఫోన్ వవర్ బటన్ దగ్గరకు వెళ్లవల్సిన అవసరం లేదు. డిస్‌ప్లే పై రెండుసార్లు టాప్ చేస్తే చాలు ఫోన్ ఆన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

సెర్చ్ సెట్టింగ్స్

సెట్టింగ్స్ మెనూలో మీకు కావల్సిన సెట్టింగ్స్‌ను సెర్చ్ చేసేందుకు సలువుగా ఫోన్ సెట్టింగ్స్ మెనూను ఓపెన్ చేసి మ్యాగ్నిఫైంగ్ గ్లాస్ పై హిట్ చేసినట్లయితే ఓ సెర్చ్ కాలమ్ ఓపెన్ అవుతుంది. ఆ కాలమ్‌లో మీకు కావల్సిన సెట్టింగ్ వివరాన్ని టైప్ చేస్తే చాలు ఆ సెట్టింగ్ మీ ముందు ప్రతక్షమవుతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ హోమ్‌స్ర్కీన్ పై యాడ్ కాకుండా ఉండాలంటే ప్లేస్టోర్‌లోని సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి బాక్స్‌ను అన్‌చెక్ చేస్తే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో యాహూ! లేదా ఇతర మెయిల్ సర్వీసులను జీమెయిల్‌కు కాన్ఫిగర్ చేసుకోవాలంటే ముందుగా జీమెయిల్ యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి Add accountను ఓపెన్ చేసినట్లయితే Google, IMAP/POP3 services పేర్లతో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో రెండవ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా ఇతర ఈమెయిల్ సర్వీసులను జీమెయిల్‌కు కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైస్‌లో ప్లే అయ్యే సినిమాలు 5.1 సౌండ్ ట్రాక్‌లను సపోర్ట్ చేస్తాయి. ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకునేందుకు ఫోన్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి Enable Surround Soundను సెలక్ట్ చేసుకుంటే చాలు.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైస్‌లో కొత్త క్యాలెండర్ యాప్ వెనుక భాగంలో సీజనల్ బ్యాక్ డ్రాప్‌లను ఆఫ్ చేయాలనుకుంటే యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి బ్యాక్‌డ్రాప్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

లాలీపాప్ ఓఎస్‌ను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌‌ను రీబూట్ చేసినప్పటికి బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఫోన్‌లో సురక్షితంగా ఉంటాయి.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన టెక్నాలజీ ఫోన్ బ్యాటరీ మార్పులకు సంబంధించి ఓ నిర్థిష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ‘ఫోన్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ చార్జింగ్ ఎంత సేపు వస్తుంది'. ‘బ్యాటరీ చార్జ్ అవటానికి ఎంత టైమ్ పడుతుంది', తదితర బ్యాటరీ సంబంధిత సమచారాన్ని మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై చూసుకోవచ్చు. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో లోపించింది.

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్.. మీరు తెలుసుకోవల్సిన ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ విండోస్ తరహాలోనే గెస్ట్ యూజర్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో కొత్త గెస్ట్‌ను జత చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోకి  ప్రవేశించి - యూజర్స్ - యాడ్ గెస్ట్‌లోకి వెళ్లండి.

Best Mobiles in India

English summary
10 little-known Android 5.0 Lollipop features. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X