బ్లాక్‌బెర్రీ వదిలి వెళ్లిన తీపి గుర్తులు
బ్లాక్ బెర్రీ.. ప్రపంచ మొబైల్ ఫోన్ల రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నా కంపెనీ. అలాంటి కంపెనీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల తయారీ నుంచి బయటకు వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ల తయారీని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నల్ హార్డ్‌వేర్‌కిక గుడ్ బై..ఇకపై సాఫ్ట్‌వేర్ పైనా, సర్వీసెస్ పైనా దృష్టి పెట్టదల్చుకున్నాం అని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోవడంతో గత రెండేళ్లలో ఎన్నడులేని విధంగా భారీగా నష్టపోవడంతో కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లాక్ బెర్రి నుంచి వచ్చిన తీపి గుర్తులను ఓ సారి నెమరువేసుకుందాం.
2జిబి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌తో Airtel మరో సంచలనం

BlackBerry 6210
ఈ ఫోన్ అప్పట్లో ఓ సంచలనం. ఇంటిగ్రేటెడ్ వాయిస్ కాల్స్ తో వచ్చిన ఫస్ట్ ఫోన్ కూడా ఇదే.

BlackBerry 7210/7230
కలర్ స్క్రీన్ లో వచ్చిన తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ కూడా ఇదే. అప్పట్లో ఇది 240 x 160 65k color screenతో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BlackBerry 7100t/7105t
ఢిపరెంట్ కీ బోర్డ్ తో వచ్చిన మొబైల్ ఇది. రెండు లెటర్లు సింగిల్ బటన్ ఉంటాయి. అలాగే స్మూత్ టెక్ట్స్ ఫీచర్ కూడా సాధ్యం ఈ ఫోన్లో..

BlackBerry Pearl 8100
ట్రాక్ బాల్ తో వచ్చిన మొబైల్ ఇది. చూసేందుకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది కూడా.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BlackBerry Pearl Flip 8220
ఓపెన్ కామ్‌సెల్ డిజైన్ తో వచ్చి కష్టమర్లను ఓ ఊపు ఊపిన మొబైల్ ఇది. ఇప్పుడు తీపి గుర్తుగా మిగిలింది.

BlackBerry Curve 8300
అప్పట్లో ఈ ఫోన్ అంటేనే ఓ క్రేజ్ బిజినెస్ అలాగే ఎంటర్‌ప్రైజ్ యూజర్లు దీన్ని వాడటం ఓ సింబాలిక్ గా భావించేవారు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BlackBerry Bold 9000
2008లో మార్కెట్లోకి వచ్చి సంచలనం రేపిన మొబైల్ ఇది. tri-band HSDPA సపోర్ట్ చేసిన ఫస్ట్ మొబైల్ కూడా ఇదే. ఆ టైంలో దీనిదే అత్యధిక రిజల్యూషన్. ఓఎస్ 5.0 అనుభూతి కూడా మాటల్లో చెప్పలేనిది.

BlackBerry Storm 9530
టచ్ స్కీన్ తో వచ్చి దుమ్మురేపిన మొబైల్ ఇది. అప్పట్లో అందరూ టచ్ స్క్రీన్ ఎలా సాధ్యమని షాకయ్యారు కూడా.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BlackBerry Curve 8900
8300 మోడల్ కి కొంచెం అధునాతన ఫీచర్లు జోడించి తీసుకొచ్చారు.

BlackBerry Bold 9900
ఫర్పెక్ట్ కీ బోర్డుతో దూసుకొచ్చిన మొబైల్. టచ్ స్క్రీన్ కూడా మిక్స్ అయి ఉంటుంది.ఇప్పటికీ మార్కెట్లో ఈఫోన్ కోసం వెతుకుతున్నారు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








